Begin typing your search above and press return to search.

యూట్యూబ్ రికార్డుల మోత.. 'రెబల్ సాబ్' ప్లేస్ ఎక్కడంటే?

లేటెస్ట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ 'రెబల్ సాబ్' ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

By:  M Prashanth   |   25 Nov 2025 2:10 PM IST
యూట్యూబ్ రికార్డుల మోత.. రెబల్ సాబ్ ప్లేస్ ఎక్కడంటే?
X

ఈ మధ్య కాలంలో సినిమా రిలీజ్ కంటే, పాటల రిలీజ్ మీదే ఫ్యాన్స్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా మొదటి 24 గంటల్లో వచ్చే వ్యూస్ రికార్డులు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక యుద్ధంలా మారాయి. స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే చాలు, యూట్యూబ్ షేక్ అవ్వాల్సిందే. తమ హీరో పాట ఎన్ని మిలియన్ల వ్యూస్ కొట్టింది అనే దాన్ని బట్టే సినిమా క్రేజ్ ను డిసైడ్ చేస్తున్నారు.

లేటెస్ట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ 'రెబల్ సాబ్' ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రెస్పాన్స్ మిక్స్ డ్ గా ఉన్నప్పటికీ, ప్రభాస్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కించాయి. ఈ సాంగ్ మొదటి 24 గంటల్లో ఏకంగా 14.92 మిలియన్ల వ్యూస్ రాబట్టి సత్తా చాటింది. టాప్ ప్లేస్ లో లేకపోయినా, టాప్ లీగ్ లో మాత్రం గట్టిగానే నిలబడింది.

రామ్ చరణ్ 'చికిరి చికిరి', 'కిస్సిక్' వంటి సాంగ్స్ టాప్ ప్లేస్ లో ఉండగా, ప్రభాస్ పాట కూడా స్ట్రాంగ్ పొజిషన్ దక్కించుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు సూపర్ హిట్ సాంగ్ 'కళావతి' రికార్డును 'రెబల్ సాబ్' క్రాస్ చేయడం విశేషం. అసలు టాలీవుడ్ లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ లిరికల్ సాంగ్స్ లిస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

చికిరి చికిరి: 29.19 మిలియన్లు

కిస్సిక్: 27.19 మిలియన్లు

నా నా హైరానా: 23.44 మిలియన్లు

ఢోప్: 21.27 మిలియన్లు

అసుర హననం: 19.93 మిలియన్లు

మాట వినాలి: 19.51 మిలియన్లు

దమ్ మసాలా: 17.42 మిలియన్లు

రా మచ్చా మచ్చా: 16.44 మిలియన్లు

పెన్నీ సాంగ్: 16.38 మిలియన్లు

చుట్టమల్లే: 15.68 మిలియన్లు

చిన్ని గుండెలో: 15.1 మిలియన్లు

రెబల్ సాబ్: 14.92 మిలియన్లు

కళావతి: 14.78 మిలియన్లు

మ మ మహేషా: 13.56 మిలియన్లు

ఈ లిస్ట్ చూస్తుంటే రామ్ చరణ్ 'పెద్ది' సినిమా సాంగ్ ఆల్ టైమ్ రికార్డ్ తో టాప్ లో కొనసాగుతోంది. అలాగే అల్లు అర్జున్, మహేష్ బాబు పాటలు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. ప్రభాస్ 'రెబల్ సాబ్' సాంగ్ 14 మిలియన్లతో ఈ లిస్టులో చేరడం ద్వారా సినిమాపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంది. ఫ్యాన్స్ కోరుకున్న కిక్ ఈ పాటలో దొరికిందని ఈ నంబర్స్ చెబుతున్నాయి. ఇక సినిమాలో ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.