రీజనల్ మార్కెట్ లో వీళ్లకు పోటీనే లేదా?
కమర్శియల్ చిత్రాలతో రీజనల్ మార్కెట్ ఫరిదిలో సినిమాలు చేసే దర్శకులు ఎంత మంది అంటే ? ప్రముఖంగా ముగ్గురు దర్శకులు హైలైట్ అవుతారు.
By: Srikanth Kontham | 27 Jan 2026 8:45 AM ISTకమర్శియల్ చిత్రాలతో రీజనల్ మార్కెట్ ఫరిదిలో సినిమాలు చేసే దర్శకులు ఎంత మంది అంటే ? ప్రముఖంగా ముగ్గురు దర్శకులు హైలైట్ అవుతారు. వాళ్లే త్రివిక్రమ్, అనీల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బాబి కొల్లి. వీళ్లు గాక హరీష్ శంకర్, పూరి జగన్నాధ్, సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను లాంటి వారు ఉన్నా? వీళ్లంతా ఫెయిల్యూర్స్ లో ఉన్నారు. ప్రధానంగా ఫామ్ లో ఉంది మాత్రం పై నలుగురు దర్శకులే. కొంత కాలంగా టాలీవుడ్ లో వాళ్ల చిత్రాలకు తిరుగు లేదు. ఎలాంటి సినిమాలు చేసినా కమర్శియల్ గా మంచి ఫలితాలు సాధిస్తున్నాయి.
అనీల్ రావిపూడి ఇప్పటి వరకూ తొమ్మిది సినిమాలు చేసాడు. తొమ్మిది బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అవేమి గొప్ప కథలు కాదు. ఎంటర్ టైనింగ్ గా ప్రేక్షకులకు కనెక్ట్ చేసి కాసుల వర్షం కురిపించాడు. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని అందించాడు. ఈ విషయంలో అనీల్ కూడా ఎంతో ఓపెన్ గా ఉంటాడు. తన సామర్ధ్యం హాస్యం అని దాన్ని బేస్ చేసుకుని తన ఫరిదిలో ఎంటర్ టైన్ చేస్తానన్నాడు. అలాగే కంటున్యూ అవుతాడు. తానేదో గొప్ప సినిమాలు తీసానని ఏనాడు ప్రగల్బాలు పకలేదు. అనీల్ జమానా టాలీవుడ్ లో ఇంకొంత కాలం తిరుగుండదు.
ఈ జానర్లో సినిమాలు చేసే దర్శకులు అనీల్ ఒక్కడే కనిపిస్తున్నాడు. డైరెక్టర్ బాబి ట్రాక్ రికార్డు కూడా బాగుంది. `పవర్` నుంచి `డాకు మహారాజ్` వరకూ కమర్శియల్ గా మంచి విజయాలు అందించాడు. `సర్దార్ గబ్బర్ సింగ్` తప్ప మిగతా సినిమాలన్నీ మంచి విజయం సాధించినవే. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ లాంటి సీనియర్లకు బాబి అంటే ఎనలేని నమ్మకం. వారందరితో పనిచేసి విజయాలు అందించి ఆ నమ్మకాన్ని ఏర్పరుచుకున్నాడు.
మాస్ కంటెంట్ ని కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాడు. అందుకే బాబి సక్సెస్ అయ్యాడు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది.
మరో మాస్ మసాలా డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా బాబిలా సక్సెస్ అయిన డైరెక్టరే. కమర్శియల్ గా ఇతడి సినిమాలు మంచి విజయాలు సాధిస్తాయి. బడ్జెట్ కూడా భారీగా ఉండదు. `జాట్` సినిమాతో బాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. నార్త్ లో సైతం దర్శకుడిగా మంచి గుర్తింపు తొలి సినిమాతోనే దక్కించుకున్నాడు. ఆ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో కూడా మలినేని ఉన్నాడు. సీనియర్ హీరోలు గోపీచంద్ ని రిపీట్ చేస్తున్నారంటే? కారణం సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుడి కావడంతోనే సాధ్యమవుతుంది. వీళ్లందరికీ కాస్త భిన్నంగా త్రివిక్రమ్ విజయాలుంటాయి. బలమైన కథ గురూజీ సినిమాల్లో హైలైట్ అవుతుంది. ఆ పాత్రలను అంతే బలంగా చెబుతాడు. అదే ఈ మాస్టర్ ప్రత్యేకత. రీజనల్ మార్కెట్ ఫరిదిలో్ ఈ నలుగురుకి పోటీ లేనే లేదు.
