సంక్రాంతి చిత్రాలు.. స్టోరీకి టైటిల్ కు సంబంధం లేదా?
ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు మన శంకర వరప్రసాద్ గారు, నారీ నారీ నడుమ మురారి చిత్రాల కోసం ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు.
By: M Prashanth | 21 Jan 2026 3:11 PM ISTసంక్రాంతి పండుగ సీజన్ అంటే సినీ ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఉత్సాహమే. కుటుంబంతో కలిసి థియేటర్లకు వెళ్లి కొత్త సినిమాలు చూసే కల్చర్.. కొన్నాళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి పొంగల్ కు విడుదలైన కొన్ని మూవీల కోసం ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినిమాల టైటిల్స్ కు, వాటి కథలకు మధ్య సరైన సంబంధం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు మన శంకర వరప్రసాద్ గారు, నారీ నారీ నడుమ మురారి చిత్రాల కోసం ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. టైటిల్ చూసినప్పుడు ఒక అంచనాతో థియేటర్ కు వెళ్లామని, కానీ మూవీ పూర్తిగా చూసిన తర్వాత టైటిల్ కు కథకు పెద్దగా పొంతన లేదని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో పలువురు రెస్పాండ్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాను తీసుకుంటే.. ఆ పేరు కథలో చాలా తక్కువగా మాత్రమే వినిపిస్తుందనే విమర్శ ఉంది. సినిమాలో మంత్రిగారు హీరోను ఒకసారి ఆ పేరుతో పిలవడం తప్ప, మొత్తం కథకు ఆ నేమ్ తో ఎక్కడా లింక్ ఉండదు. టైటిల్ లో ఉన్న ఆ పేరు కథకు మెయిన్ బేస్ గా మారుతుందని ప్రేక్షకులు ఊహించారు. కానీ టైటిల్ కేవలం అట్రాక్ట్ చేయడం కోసమే పెట్టినట్టు అనిపిస్తోందని కొందరు చెబుతున్నారు.
అదే విధంగా నారీ నారీ నడుమ మురారి సినిమా విషయంలో కూడా ఇలాంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ టైటిల్ వినగానే చాలా మందికి బాలకృష్ణ పాత సినిమా గుర్తుకు వస్తుంది. అందులో హీరో ఇద్దరు హీరోయిన్ల మధ్య ఇరుక్కునే కథ ప్రధానంగా ఉంటుంది. కానీ తాజా మూవీలో అటువంటి పరిస్థితి అసలు లేదని నెటిజన్లు. అంటున్నారు. రెండో హీరోయిన్ కథలోకి ఎంట్రీ ఇచ్చే సమయానికి, మొదటి హీరోయిన్ మరొకరిని వివాహం చేసుకుంటుందని చెబుతున్నారు.
దీంతో నడుమ మురారి అనే భావనకు అసలు అవకాశమే లేకుండా పోయిందని కామెంట్లు పెడుతున్నారు. టైటిల్ కు కథకు మధ్య సంబంధం కనిపించలేదని చెబుతున్నారు. సాధారణంగా సినిమా టైటిల్.. కథకు సంబంధించిన మెయిన్ ఎలిమెంట్ లేదా హీరో క్యారెక్టర్ ను బేస్ చేసుకుని ఉండాలని చాలా మంది భావిస్తారు. ఎందుకంటే టైటిల్ వినగానే కథపై అంచనా ఏర్పడుతుంది.
కానీ తాజా సంక్రాంతి సినిమాల విషయంలో ఆ అంచనాలు నెరవేరలేదన్న భావన ఇప్పుడు వ్యక్తమవుతోంది. అయితే టైటిల్ కంటే కథ, యాక్టింగ్, ఎంటర్టైన్మెంట్ ముఖ్యమని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టైటిల్ కు కథకు సంబంధం తక్కువగా ఉన్నా, సినిమా ప్రేక్షకులను ఫుల్ గా అలరించగలిగితే చాలు అని అంటున్నారు. అయినా, టైటిల్ కు కంటెంట్ కు మధ్య సరైన కనెక్షన్ ఉంటే సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతుందన్నది చాలామంది అభిప్రాయం.
