ఆ మూడు హిట్స్.. వారికి మంచి ఉదాహరణ..
టాలీవుడ్ లో రీసెంట్ గా మూడు చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 13 Sept 2025 4:00 AM ISTటాలీవుడ్ లో రీసెంట్ గా మూడు చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్న ఆ మూడు సినిమాలు.. మంచి వసూళ్లు రాబడుతున్నాయి. అందరినీ మెప్పిస్తున్నాయి. ఇప్పుడు వారికి మంచి ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఆ చిత్రాలు ఏంటంటే లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధ పురి.
చిన్న సినిమాగా రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ పెద్ద విజయం సాధించింది. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ తనూజ్ మౌళి నటించిన ఆ సినిమాలో యంగ్ బ్యూటీ శివాని నాగారం హీరోయిన్ గా నటించింది. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను ఈటీవీ విన్ ప్రొడక్షన్ పై ఆదిత్య హాసన్ నిర్మించారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఆ సినిమా.. బడ్జెట్ కు అనేక రెట్ల లాభాలు సంపాదిస్తోంది.
మిరాయ్ విషయానికొస్తే.. యంగ్ హీరో తేజ సజ్జ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన ఆ మూవీలో మనోజ్ మంచు విలన్ గా కనిపించారు. ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఆ మూవీ నేడే రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది.
అదే సమయంలో కిష్కింధ పురి సినిమా కూడా నేడే థియేటర్స్ లో విడుదలైన విషయం తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఆ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కనిపించింది. హారర్ థ్రిల్లర్ గా కౌశిక్ పెగల్లపాటి తెరకెక్కించిన ఆ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ మూవీ కూడా ఇప్పుడు మెప్పిస్తోంది.
ఇటీవల కాలంలో టాలీవుడ్ లో ఆ మూడు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. థియేటర్స్ కు ఆడియెన్స్ ను రప్పిస్తున్నాయి. అదే సమయంలో థియేటర్స్ కు సినీ ప్రియులు రావడం లేదని కామెంట్స్ చేసే వారికి పెర్ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఎందుకంటే లిటిల్ హార్ట్స్ మూవీని అంత ఎగబడి చూస్తున్నాయి. మిరాయ్, కిష్కింధ పురి చిత్రాలకు కూడా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా స్టార్ హోదాతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని ఆ సినిమాలు నిరూపిస్తున్నాయి. కంటెంట్ ఉంటే చాలు కచ్చితంగా ఆడియెన్స్ బ్రహ్మరథం పడతారని మరోసారి ప్రూవ్ చేస్తున్నాయి. సూపర్ రెస్పాన్స్ అందుకుని దూసుకుపోతున్నాయి. ఏదేమైనా బడ్జెట్.. క్యాస్టింగ్.. ఇంపార్టెంట్ కాదు.. కంటెంట్ ఇంపార్టెంట్ అనే ఆడియెన్స్ మరోసారి చెప్పారు.
