Begin typing your search above and press return to search.

స‌మ్మ‌ర్ సంబ‌రం అంతా నీరు గార్చేశారు!

సినిమా బాగుంద‌నే టాక్‌ని సొంతం చేసుకున్నా కానీ ఆ స్థాయిలో లాభాల్ని ద‌క్కించుకోలేక తీవ్ర నిరాశ‌కు గురి చేసింది.

By:  Ravindar Gorantla   |   1 May 2026 11:00 PM IST
స‌మ్మ‌ర్ సంబ‌రం అంతా నీరు గార్చేశారు!
X

ప్ర‌తి స‌మ్మ‌ర్‌కు థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడ‌టం, పెద్ద సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డం వంటివి స‌ర్వ‌సాధార‌ణం. అయితే ఈ ఏడాది మాత్రం స‌మ్మ‌ర్ సంబ‌రం అంతా నీరుగారిపోయింది. గ‌త కొన్నేళ్లుగా స‌మ్మ‌ర్ సీజ‌న్ అంటే ఆ హంగామా వేరుగా ఉండేది, కార‌ణం పెద్ద హీరోల సినిమాలు పోటా పోటీగా రిలీజ్ అయ్యేవి. కంటెంట్ ప‌రంగానూ బాక్సాఫీస్ వ‌ద్ద గ‌ట్టి పోటీనిచ్చేవి. అయితే ఆ స‌మ‌రం మాత్రం ఈ ఏడాది లేకుండా పోయింది. కార‌ణం చాలా వ‌ర‌కు పెద్ద హీరోలు, పాన్ ఇండియా సినిమాలు ఈ స‌మ్మ‌ర్‌కు మ‌రీ ముఖ్యంగా ఏప్రిల్‌లో సంద‌డి చేయ‌క‌పోవ‌డ‌మే.

అయితే ఏప్రిల్ ప్రారంభంలో పెద్ద హీరోలు బ‌రిలోకి దిగ‌లేక‌పోయినా చిన్న‌, మీడియం రేంజ్ సినిమాలు సంద‌డి చేయ‌డం మొద‌లు పెట్టాయి. శ‌ర్వానంద్ `బైక‌ర్‌`, సంగీత్ శోభ‌న్ `రాకాస‌` విడుద‌లై ఆ లోటుని తీర్చాల‌నుకున్నాయి. కానీ భారీ బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిల‌వ‌క‌పోయినా ఫ‌ర‌వాలేదు అనిపించాయి. కానీ అనుకున్న స్థాయిలో మాత్రం బ్లాక్ బస్ట‌ర్లుగా మార‌లేక‌పోయాయి. `బైక‌ర్‌`లో డా. రాజ‌శేఖ‌ర్ కీల‌క పాత్ర‌లో న‌టించి మెప్పించే ప్ర‌య‌త్నం చేసినా, ఈ సినిమా కోసం శర్వానంద్ ఎంత‌గానో శ్ర‌మించినా అనుకున్న స్థాయిలో మాత్రం ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు రప్పించ‌లేక‌పోయింది.

సినిమా బాగుంద‌నే టాక్‌ని సొంతం చేసుకున్నా కానీ ఆ స్థాయిలో లాభాల్ని ద‌క్కించుకోలేక తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. ఇక ఈ రెండు సినిమాల త‌రువాత వ‌చ్చిన అడివి శేష్ మూవీ `డెకాయిట్‌` ప్రారంభంలో భారీ స్థాయిలో ప్రేక్ష‌కులు, సినీ ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌ల్ని ద‌క్కించుకున్నా కానీ ఆ త‌రువాత టాక్‌కు త‌గ్గ‌ట్టుగా మాత్రం రాణించ‌లేక‌పోయింది. అన్ని ర‌కాలుగా అడివి శేష్ మూవీ లాభాల్ని తెచ్చి పెడుతుంద‌నే టాక్ ఉంది. అయితే ఆ టాక్‌ని `డెకాయిట్‌` మ‌ర్చిపోయేలా చేసి షాక్ ఇచ్చింది.

వ‌రుస‌గా వంద కోట్ల వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన సినిమాల‌తో స‌రికొత్త రికార్డుని సొంతం చేసుకున్న హీరో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ ఈ సారి కూడా ఎల్ ఐ కె`తో గ‌ట్టి హిట్ కొడ‌తాడ‌ని అంతా భావించారు. కానీ దానికి పూర్తి భిన్నంగా ప్ర‌దీప్ న‌టించిన `ఎల్ ఐ కె` తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. ఫ్యూచ‌రిస్టిక్ ల‌వ్ స్టోరీ అంటూ విఘ్రేష్ శివ‌న్ తీసిన సినిమా బ‌క్సాఫీస్ వ‌ద్ద చేతులెత్తేసింది. టొవినో థామ‌స్ `ప‌ళ్లి చ‌ట్టంబి`ది కూడా ఇదే దారి. అయితే నాగ‌శైర్య కొంత వార‌మం తీసుకుని చేసిన `బ్యాడ్ బాయ్ క‌ల్యాణ్‌` ఆడుతుంద‌ని అంతా అనుకున్నారు.

కానీ ఫ‌లితం మాత్రం షాక్ ఇచ్చింది. కెరీర్ ప‌రంగా చాలా కాలంగా వెనుక‌బ‌డిపోయిన తిరువీరు `పాపం ప్ర‌తాప్‌`.. చూసిన వాళ్ల చేత పాపం అనిపించింది. ఇదే ఊపులో వ‌చ్చిన `త‌మ్మ‌రాజు ప‌ల్లి టీవి`మూవీని స్వ‌యంగా హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం నిర్మించినా ఆశించిన స్థాయిలో ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. గ‌త వారం విడుద‌లైన `గేదెల రాజు`, వాళా 2 సోదిలో లేకుండా పోయాయి. ధ‌నుష్ `క‌ర‌`తో మెరుపులు మెరిపిస్తాడ‌ని భావిస్తే ఊహించ‌ని విధంగా షాక్ ఇవ్వ‌డం, మే ప్రారంభంలో త‌రుణ్ భాస్క‌ర్ `గాయ‌ప‌డ్డ సింహం`, స‌త్య `జెట్‌లీ` చిత్రాలు వొచ్చినా పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోవ‌డంతో స‌మ్మ‌ర్ సంబ‌రం నీరుగారిపోయిందే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.