స్టార్ పవర్ లేక టాలీవుడ్ సైలెంట్… మేలో ఎవరు సేవియర్?
ఇదే సమయంలో స్టార్ పవర్ లోటు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా వాయిదా పడటం ఇండస్ట్రీకి పెద్ద మైనస్‌గా మారింది.
By: Sravani Lakshmi Srungarapu | 21 April 2026 12:43 PM ISTటాలీవుడ్‌కు సమ్మర్ సీజన్ అంటే సాధారణంగా గోల్డెన్ పీరియడ్‌గా భావిస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఏప్రిల్ మూడో వారానికి చేరుకునే సరికి సమ్మర్ సగం పూర్తయ్యింది గానీ, ఒక్క పెద్ద హిట్ కూడా ఇండస్ట్రీకి దక్కలేదు. మార్చి నుండి ఏప్రిల్ మధ్య వరకు విడుదలైన సినిమాలన్నీ అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ ఫెయిల్యూర్ ట్రెండ్ థియేట్రికల్ ఎగ్జిబిషన్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు IPL కూడా భారీ ఎఫెక్ట్ చూపుతూ వీకెండ్ బాక్సాఫీస్‌ను దెబ్బతీస్తోంది. శని, ఆదివారాల్లో జరిగే మ్యాచ్‌ల కారణంగా కీలకమైన మూడు షోలు ప్రభావితమవుతుండగా, థియేటర్లకు వచ్చే ఆడియన్స్ గణనీయంగా తగ్గుతున్నారు. దీనికి ఎండలు కూడా తోడవడంతో, అనేక థియేటర్లు వీకెండ్‌లో కూడా మూతపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరో ఇంట్రెస్టింగ్ విషయేంటంటే కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, ఆ రెస్పాన్స్ బాక్సాఫీస్ కలెక్షన్లుగా మారడం లేదు. కంటెంట్ పరంగా బాగున్నా, ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్న సినిమాల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. భారీ ప్రమోషన్స్ చేసినా, సరైన ఓపెనింగ్స్ దక్కకపోవడం వల్ల అవి నష్టాల్లో ముగుస్తున్నాయి. దీనికి ఎర్లీ ఓటీటీ రిలీజ్ ట్రెండ్ కూడా ప్రధాన కారణంగా మారింది. థియేటర్‌లో చూడకుండా, కొద్ది రోజుల తర్వాత ఓటీటీలో చూద్దామనే భావన ప్రేక్షకుల్లో పెరిగిపోవడం థియేట్రికల్ రన్‌ను తగ్గిస్తోంది.
ఇండస్ట్రీకి మైనస్‌గా పెద్ది వాయిదా
ఇదే సమయంలో స్టార్ పవర్ లోటు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా వాయిదా పడటం ఇండస్ట్రీకి పెద్ద మైనస్‌గా మారింది. స్టార్ సినిమాలు లేకపోవడంతో మార్కెట్‌లో బజ్ బాగా తగ్గిపోయింది. పెద్ది వాయిదా పడటంతో ఇప్పుడు ఏప్రిల్ చివరి వారం నుంచి మే మధ్య వరకు వరుసగా అనేక సినిమాలు రిలీజ్‌లకు రెడీ అవుతున్నాయి. వాటిలో తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం, కమెడియన్ సత్య హీరోగా డెబ్యూ ఇస్తూ చేస్తున్న జెట్లీ, ఎపిక్, గోదారి గట్టుపైన, రేజర్, సమంత మా ఇంటి బంగారం, నిఖిల్ స్వయంభు లాంటి స్ట్రైట్ తెలుగు సినిమాలతో పాటు ది డెవిల్, కరుప్పు, దృశ్యం3 లాంటి డబ్బింగ్ సినిమాలు కూడా పోటీలోకి దిగుతున్నాయి. ఈ రిలీజ్ క్లట్టర్ వల్ల కంపిటీషన్ మరింత పెరగనుంది.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఆశలన్నీ ఇప్పుడు మే నెలపైనే ఉన్నాయి. వరుసగా రిలీజ్ కానున్న సినిమాల్లో ఏదైనా హిట్ టాక్ తెచ్చుకుంటే, ఇండస్ట్రీకి తిరిగి ఊపిరి పోసే అవకాశం ఉంది. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కూడా మే రిలీజ్‌లపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడటానికి కంటెంట్ బలం, సరైన రిలీజ్ ప్లానింగ్, ఓటీటీ విండో నియంత్రణ వంటి వ్యూహాలు కీలకమవుతున్నాయి. మొత్తానికి, నిరాశపరిచిన సమ్మర్ స్టార్టింగ్ తర్వాత టాలీవుడ్‌కు మే నెల ఒక కీలక టర్నింగ్ పాయింట్‌గా మారబోతోంది. ఈ నెలలో వచ్చే సినిమాలు బాక్సాఫీస్‌కు కొత్త జోష్ తీసుకురాగలవా? లేక ఈ నెగటివ్ ట్రెండ్ కొనసాగుతుందా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్నగా మారింది.
