Begin typing your search above and press return to search.

కంబ్యాక్‌ల సమరంలో గెలిచేదెవ‌రు?

ఇక ఈ సీజన్‌ను మరింత ఆసక్తికరంగా మార్చుతున్న అంశం కంబ్యాక్ స్టోరీస్. స‌మంత రూత్ ప్ర‌భు చాలా గ్యాప్ తర్వాత మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   25 April 2026 12:00 PM IST
కంబ్యాక్‌ల సమరంలో గెలిచేదెవ‌రు?
X

టాలీవుడ్ సమ్మర్ సీజన్ అంటే సాధారణంగా స్టార్ హీరోల హడావిడి, భారీ బడ్జెట్ సినిమాల సందడి గుర్తుకొస్తాయి. కానీ 2026 మే మాత్రం పూర్తిగా భిన్నమైన పరిస్థితిని చూపిస్తోంది. పెద్ద స్టార్ల సినిమాలు లేకపోవడంతో థియేటర్లలో ఒక రకమైన స్టార్ వాక్యూమ్ కనిపిస్తోంది. ఇదే పరిస్థితి చిన్న, మిడ్‌రేంజ్ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్‌గా మారింది. హాలిడే సీజన్ ఉండటం, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి అనుకూల పరిస్థితులు ఉండటం.. ఇవ‌న్నీ కలిపి చూస్తే, ఈసారి స‌క్సెస్‌ పూర్తిగా కంటెంట్ చేతుల్లోనే ఉందనే అభిప్రాయం బలపడుతోంది. భారీ ఓపెనింగ్స్ కోసం స్టార్ పవర్ లేకపోయినా, ఒకసారి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్‌ను నిలబెట్టుకునే అవకాశం ఈ సినిమాలకు ఉంది.

గతంలో స్టార్ ఇమేజ్ ఒక సినిమాను మొదటి వీకెండ్ వరకైనా లాగేది. కానీ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి. సోషల్ మీడియా, రివ్యూల ప్రభావంతో వర్డ్ ఆఫ్ మౌత్ కీలక పాత్ర పోషిస్తోంది. మంచి కథ, బలమైన ఎమోషన్స్, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే ఉంటే స్టార్ లేకపోయినా సినిమాలు ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించగలవని ఇటీవల వచ్చిన ఎన్నో సినిమాలు ఉదాహరణలుగా క‌న‌బ‌డుతున్నాయి. ఈ మేలో రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాయి. ప్రమోషన్స్ ఎంత ఉన్నా, ఫైనల్‌గా థియేటర్‌లో ప్రేక్షకుడిని కట్టిపడేసేది కంటెంట్ మాత్రమే అనే రియాలిటీ మరోసారి టెస్ట్‌కు రానుంది.

మా ఇంటి బంగారంతో స‌మంత కంబ్యాక్

ఇక ఈ సీజన్‌ను మరింత ఆసక్తికరంగా మార్చుతున్న అంశం కంబ్యాక్ స్టోరీస్. స‌మంత రూత్ ప్ర‌భు చాలా గ్యాప్ తర్వాత మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ఆమెకు కేవలం ఒక రిలీజ్ కాదు, ఒక రీడెఫినిషన్. నటిగా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా అడుగు పెడుతున్న సమంతకు ఇది భారీ రిస్క్, అలాగే పెద్ద అవకాశం కూడా. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ కథ ప్రేక్షకులను కనెక్ట్ చేస్తే, ఆమె కెరీర్‌లో ఇది కీలక మలుపు కావచ్చు.

నిఖిల్ కు కీల‌కంగా మారిన స్వ‌యంభు

మరోవైపు నిఖిల్ సిద్ధార్థ్ పరిస్థితి కూడా అంతే కీలకం. కార్తికేయ‌2 లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత వచ్చిన వరుస ఫ్లాప్స్ అతని మార్కెట్‌పై ప్రభావం చూపించాయి. ఇప్పుడు స్వయంభు వంటి భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్‌తో వస్తున్న నిఖిల్‌కు ఇది నిజంగా డూ ఆర్ డై సిట్యుయేష‌న్. భారీ బడ్జెట్, విభిన్న కథాంశం.. ఇవి సక్సెస్ అయితే అతన్ని మరో లెవల్‌కు తీసుకెళ్తాయి, లేకపోతే నిఖిల్ కెరీర్ మ‌రింత రిస్క్ లో ప‌డుతుంది.

ఇక త‌రుణ్ భాస్క‌ర్ విషయానికి వస్తే, డైరెక్టర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఆయన యాక్టర్‌గా మాత్రం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. గాయపడ్ద సింహంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు త‌రుణ్ భాస్క‌ర్. ఈ సినిమా అతనికి నటుడిగా సర్వైవల్ టెస్ట్‌లా మారింది. ప్రేక్షకులు అతన్ని యాక్టర్‌గా అంగీకరిస్తారా లేదా అన్నది ఈ ప్రాజెక్ట్‌తో స్పష్టమవుతుంది.

మొత్తానికి, 2026 మే టాలీవుడ్‌కు ఒక కీలక పరీక్షగా నిలుస్తోంది. స్టార్ పవర్ లేకున్నా కంటెంట్ బలంగా ఉంటే సినిమాలు ఎలా నిలబడతాయో, అలాగే ముగ్గురు ముఖ్య నటుల కెరీర్లు ఎలా మలుపుతీసుకుంటాయో ఈ సీజన్ నిర్ణయించనుంది. ఇది కేవలం బాక్సాఫీస్ పోటీ కాదు, కంటెంట్ ప‌వ‌ర్, కంబ్యాక్ ప్రయత్నాలు, ప్రేక్షకుల అభిరుచుల మార్పు అన్నీ క‌లిపే ఈ స‌మ్మ‌ర్ టెస్ట్.