నిర్మాతలు అదే పెద్ద విషయంగా భావిస్తున్నారు.. కార్మికుల సమ్మెపై ఆర్జీవీ
టాలీవుడ్ లో సినిమాలు తీసే పద్ధతి క్రమక్రమంగా మారిపోతోంది. పెద్ద బడ్జెట్ సినిమాలవైపే నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు.
By: M Prashanth | 11 Aug 2025 7:26 PM ISTటాలీవుడ్ లో సినిమాలు తీసే పద్ధతి క్రమక్రమంగా మారిపోతోంది. పెద్ద బడ్జెట్ సినిమాలవైపే నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. భారీ సెటప్ లు, విజువల్స్ తో సినిమాను గ్రాండ్ గా తీయాలనుకుంటున్నారు. దీంతో ప్రాజెక్ట్ ఖర్చు భారీగా పెరిగిపోతుంది. అయితే కోట్లు కుమ్మరించి సినిమా తీస్తున్నప్పటికీ.. కార్మికులకు వేతనాలు పెంచాలని వారం నుంచి టాలీవుడ్ కార్మికులు మరోవైపు సమ్మె చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో పలుమార్లు ఫెడరేషన్ నాయకులు- నిర్మాతలు మధ్య చర్చలు జరిగాయి. ఎట్టకేలకు శనివారం జరిగిన మీటింగ్ లో కార్మికుల వేతనాలు పెంచేందుకు కొన్ని షరతులతో నిర్మాతలు ఓకే చెప్పారు. కానీ, దీనిపై ఫెడరేషన్ నాయకులు సంతృప్తి చెందలేదు. నిర్మాతల డిమాండ్లు ఫెడరేషన్ ను విడదీసేలా ఉన్నాయని అన్నారు.
దీంతో ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి అన్న చర్చ మొదలైంది. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. నిర్మాతలు తాము తీసే సినిమాను ఇంకో చిత్రంతో పోల్చుకుని కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారని అన్నారు.
అలాంటి వాళ్లెవరో తనకు తెలుసనీ.. కానీ, వాళ్ల పేర్లను చెప్పడం ఇష్టం లేదన్నారు. అలాగే ప్రొడక్షన్ వ్యాల్యూ అనే పదం.. టాలీవుడ్ లో తప్పా ఇండియాలో మరే ఇండస్ట్రీలో వినిపించదని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఒక సినిమాతో పోల్చుకొని దానికంటే భారీగా తీయాలనే ఉద్దేశంతో ఖర్చు పెడుతున్నారని అన్నారు.
మగధీర సినిమాలో ఓ సెంట్ ఉంది అంటే.. మనం తీసే దాంట్లో దాని కంటే కనీసం ఓ 20 ఫీట్లు సెట్ ఎక్కువగా వేయాలి. అక్కడ 10 గుర్రాలు వాడితే, మన దాంట్లో 40 గుర్రాలు ఉండాలని అనుకుంటున్నారు. దీన్నే పెద్ద విషయంగా నిర్మాతలు భావిస్తున్నారు. ప్రొడక్షన్ వ్యాల్యూ అనే పదం తెలుగు ఇండస్ట్రీలో తప్పితే ఇంకెక్కడా వాడరు.
మలయాళంలో అస్సలు ఆ పదం లేదు. బాలీవుడ్ లో ఆ సమస్యే లేదు. కానీ ఈ పదం ఇక్కడే ఉంది. క్రిటిక్స్ కూడా ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి, బగా తీశారని అంటున్నారు. అని ఆర్జీవీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
కాగా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కార్మికుల స్ట్రైక్ వారం రోజులుగా చర్చనీయాంశంగా మారింది. వేతనాల పెంచాలన్న కార్మికుల డిమాండ్ కు నిర్మాతలు ఎట్టకేలకు ఓకే చెప్పారు. కానీ దీన్ని ఫెడరేషన్ నాయకులు ఒప్పుకోలేదు. నిర్మాతల డిమాండ్లు ఫెడరేషన్ ను విడదీసేలా ఉన్నాయని అన్నారు.
