ఆఫ్టర్ 3 వీక్స్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్..!
ఈ షార్ట్ వెకేషన్ ని ఫ్యామిలీతో గడిపిన హీరోలు కొందరైతే తాము చేయాల్సిన సినిమాల షూటింగ్ లొకేషన్స్ మిగతా ఏర్పాట్లు చూసుకున్న వారు కొందరు.
By: Ramesh Boddu | 22 Aug 2025 1:17 PM ISTటాలీవుడ్ లో సమ్మె కారణంగా దాదాపు 18 రోజులుగా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. సినీ కార్మీకుల వేతనాలకు సంబందించి నిర్మాతల మండలి చర్చలు 3 వారాలుగా సాగుతూ వచ్చాయి. ఫైనల్ గా సినీ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి కార్మీకులకు తగిన హామీ ఇచ్చారు. సినీ కార్మీకుల సమ్మె ముగించడంలో ప్రభుత్వం చొరవ కూడా ఉందని తెలుస్తుంది. ఐతే అనుకోకుండా ఒక 18 రోజులు తెలుగు స్టార్స్ కి గ్యాప్ వచ్చింది. వాళ్లకు ఒకటి రెండు రోజులు దొరికితేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏకంగా ఈసారి 17, 18 రోజుల దాకా ఎలాంటి షూటింగ్స్ జరగలేదు.
సమ్మె ముగింపు కోసం..
ఈ షార్ట్ వెకేషన్ ని ఫ్యామిలీతో గడిపిన హీరోలు కొందరైతే తాము చేయాల్సిన సినిమాల షూటింగ్ లొకేషన్స్ మిగతా ఏర్పాట్లు చూసుకున్న వారు కొందరు. స్టార్స్ అంతా కూడా సినీ కార్మీకుల సమ్మె వల్ల ఎక్కడ వాళ్లు అక్కడే అన్నట్టుగా ఉండిపోయారు. ఈ సమ్మె ముగింపు కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా ఫెడరేషన్ కార్మీకులతో మాట్లాడిన విషయం తెలిసిందే. సినీ పెద్దల హామీతోనే కార్మీకులు ఈ సమ్మె విరమించారు.ఆఫ్టర్ 2 వీక్స్ స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటూ స్టార్స్, డైరెక్టర్స్ రెడీ అయ్యారు.
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న అన్ని సినిమాలకు ఈ సమ్మె కాస్త బ్రేక్ పడేలా చేసినా.. 18 రోజుల తర్వాత ఎక్కడి షూటింగ్స్ అక్కడ మొదలయ్యాయి. మామూలుగా ఇదివరకు ఇలా వరుసగా 18 రోజులు షూటింగ్ ఆగిన సందర్భాలు తక్కువ. ఇలానే కొనసాగితే అటు కార్మీకులతో పాటు దర్శక నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుందని సమ్మె ముగించారు.
తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో నిలబెట్టే..
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మన పాన్ ఇండియా స్టార్ సినిమాలు కూడా ఈ 18 రోజులు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఫైనల్ గా సమ్మె ముగిసి మళ్లీ ఎక్కడి షూటింగ్స్ అక్కడ మొదలయ్యాయి. తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో నిలబెట్టే స్టార్ సినిమాలు ఓ పక్క.. మంచి కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించే సినిమాలు మరోపక్క. స్టార్ ఇమేజ్ తో సంబంధం లేకుండా సెట్స్ మీద ఉన్న సినిమాలు కొన్ని.. అసలు స్టార్స్ లేకుండా కొత్త వాళ్లతో తెరకెక్కించే సినిమాలు మరికొన్ని ఇలా అన్నీ కూడా షూటింగ్స్ తో సందడి చేస్తున్నాయి.
