టాలీవుడ్‌లో 'పోర్షే' కార్ కొనుగోలు చేసిన టాప్- 5 స్టార్స్
గ్యారేజీలో ఎన్ని విదేశీ బ్రాండ్ల కార్లు అందుబాటులో ఉన్నా జర్మన్ లగ్జరీ కార్ మేకర్ `పోర్షే` అందించే స్పీడ్, క్లాస్ లుక్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు మన సెలబ్రిటీలు ఫిదా అయిపోతుంటారు.
By: Sivaji Kontham | 21 Jun 2026 5:32 PM ISTటాలీవుడ్ స్టార్ హీరోలకు లగ్జరీ బ్రాండ్ స్పోర్ట్స్ కార్లంటే విపరీతమైన క్రేజ్. గ్యారేజీలో ఎన్ని విదేశీ బ్రాండ్ల కార్లు అందుబాటులో ఉన్నా జర్మన్ లగ్జరీ కార్ మేకర్ `పోర్షే` అందించే స్పీడ్, క్లాస్ లుక్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు మన సెలబ్రిటీలు ఫిదా అయిపోతుంటారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఈ అల్ట్రా లగ్జరీ స్పోర్ట్స్ కార్లను సొంతం చేసుకున్న టాలీవుడ్ టాప్ 5 స్టార్స్ వివరాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై పోర్షే కొత్త కార్ లో శోభితతో కలిసి రయ్ మంటూ దూసుకుపోతున్న నాగచైతన్యను చూసాక.. ఫ్యాన్స్ లో ఈ పోర్షే గురించిన చర్చ మొదలైంది. పోర్షే బ్రాండ్ లో అత్యంత ఖరీదైన అల్ట్రా మోడ్రన్ కార్ ని కొనుగోలు చేసి చై అందరి దృష్టిలో పడ్డాడు.
రామ్ చరణ్ - పోర్షే కేయాన్ టర్బో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కార్ల కలెక్షన్‌లోనూ పోర్షే కారుకు ప్రత్యేక స్థానం ఉంది. చరణ్ గ్యారేజీలో `పోర్షే కేయాన్ టర్బో` వేరియంట్ కారు ఉంది. దీని విలువ దాదాపు రూ.2.00 కోట్లకు పైమాటే. ఎంతో పవర్‌ఫుల్ వి8 ఇంజిన్‌తో నడిచే ఈ ప్రీమియం స్పోర్ట్స్ ఎస్‌యూవీని రామ్ చరణ్ గతంలో ఎన్నో సందర్భాలలో స్వయంగా డ్రైవ్ చేస్తూ కనిపించారు. లగ్జరీతో పాటు స్పీడ్‌ను ఇష్టపడే వారికి ఈ మోడల్ కేరాఫ్ అడ్రస్.
ఎన్టీఆర్ - పోర్షే కేయాన్ నోవా
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లగ్జరీ కార్ల కలెక్షన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అతడి గ్యారేజీలో దేశంలోనే మొట్టమొదటి లాంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారుతో పాటు `పోర్షే కేయాన్ నోవా` లగ్జరీ ఎస్‌యూవీ కూడా ఉంది. దీని ధర సుమారు రూ.1.50 కోట్ల నుండి రూ.2.00 కోట్ల వరకు ఉంటుంది. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, లగ్జరీ ఇంటీరియర్స్‌తో ఉండే ఈ కారును ఎన్టీఆర్ తన పర్సనల్ రైడ్స్ కోసం రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటారు.
అల్లు అర్జున్- రవితేజ - పోర్షే కేయాన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజా రవితేజ కూడా పోర్షే బ్రాండ్‌కు పెద్ద అభిమానులు. వీరిద్దరి వద్ద పోర్షే కేయాన్ లగ్జరీ ఎస్‌యూవీలు ఉన్నాయి. అల్లు అర్జున్ తన `ఫాల్కన్` కారవాన్ , రేంజ్ రోవర్‌తో పాటు ఈ కారును కూడా మెయింటైన్ చేస్తుండగా... రవితేజ సైతం తన లగ్జరీ ప్రయాణాల కోసం పోర్షే కేయెన్ కారునే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. ఈ మోడల్స్ మార్కెట్ వాల్యూ వేరియంట్‌ను బట్టి రూ.1.50 కోట్లకు పైగా ఉంటుంది.
అక్కినేని నాగచైతన్య - పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్
టాలీవుడ్‌లో కార్లు, బైకులంటే అమితంగా ఇష్టపడే యంగ్ హీరోగా నాగచైతన్యకు గుర్తింపు ఉంది. అతడి గ్యారేజీలోకి వచ్చిన లేటెస్ట్ క్రేజీ సూపర్ కార్ `పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్`. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.3.50 కోట్లు. టాక్సులు, కస్టమైజేషన్‌తో కలిపి మరింత ఎక్కువే ఉంటుంది. ఈ ట్రాక్ రేసింగ్ కారును జీటీ మెటాలిక్ సిల్వర్ షేడ్‌లో చైతన్య ఆర్డర్ ఇచ్చి మరీ కొనుగోలు చేశారు. రీసెంట్‌గా ఈ స్పెషల్ లగ్జరీ కార్‌లో నాగచైతన్య-శోభితా ధూళిపాళ దంపతులు కలిసి సిటీలో షికారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కేబుల్ బ్రిడ్జ్ పై రయ్ మంటూ దూసుకుపోతోంది ఈ జంట.
సీనియర్ నటుడు నరేష్ -పోర్షే పనమెరా జీ3 టర్బో
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ఇటీవల సరికొత్త సరికొత్త `పోర్షే పనమెరా జీ3 టర్బో` కారును కొనుగోలు చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. బ్లూ కలర్‌లో మెరిసిపోతున్న ఈ లగ్జరీ స్పోర్ట్స్ సెడాన్ విలువ దాదాపు రూ.2.70 కోట్లు. టాలీవుడ్‌లో ఈ సరికొత్త జనరేషన్ పనామెరా టర్బో కారును సొంతం చేసుకున్న మొదటి నటుడిగా నరేష్ రికార్డు సృష్టించారు.
