సమ్మర్ వెకేషన్ లో టాలీవుడ్ స్టార్లు!
తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో టాలీవుడ్ స్టార్లు షూటింగ్‌లకు తాత్కాలికంగా స్వస్తి చెబుతున్నారు.
By: Srikanth Kontham | 27 April 2026 8:30 AM ISTతెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో టాలీవుడ్ స్టార్లు షూటింగ్‌లకు తాత్కాలికంగా స్వస్తి చెబుతున్నారు. భానుడి ప్రతాపంతో అవుట్‌డోర్ షూటింగ్‌లు చేయడం కష్టతరమవుతోంది. వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించాలనే ఉద్దేశంతో అగ్ర హీరోలంతా `వెకేషన్ మోడ్` లోకి వెళ్లిపోతున్నారు. దీంతో టాలీవుడ్ లోని ప్రధాన షూటింగ్ స్పాట్‌లన్నీ నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ - రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్ట్ `వారణాసి` పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో షూటింగ్ పనులకు విరామం ప్రకటించి మహేష్ కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు.
మే నెలంతా ఆయన అక్కడే సేద తీరుతారని సమాచారం. రాజమౌళి కూడా ఈ విరామాన్ని తదుపరి షెడ్యూల్ ప్లానింగ్ కోసం వాడుకుంటున్నారు. ఎండలు తగ్గిన తర్వాతే చిత్రానికి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ మళ్ళీ ప్రారంభం కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తమ సినిమాల నుంచి చిన్న విరామం తీసుకున్నారు. ప్రభాస్ వరుస చిత్రాల షూటింగ్‌లతో గతేడాది నుంచి ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ సమ్మర్‌లో కొంత రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ సమ్మర్ సీజన్ ముగిసిన తర్వాతే మొదలుకానుందని చిత్ర వర్గాల సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సమ్మర్ ప్లాన్స్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న`పెద్ది` షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరో వారం రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్‌ను పూర్తవుతుంది. అటుపై చరణ్ కూడా నెల రోజుల పాటు రెస్ట్ మోడ్లో కి వెళ్లనున్నారు. వరుస షూటింగ్‌ల తో కలిగిన అలసటను దూరం చేసుకుని కొత్త ఉత్సాహంతో తదుపరి షెడ్యూల్ కోసం సిద్ధమవ్వడమే చరణ్ లక్ష్యంగా కనిపిస్తోంది. సాధారణంగా మే నెలలో సినిమాల విడుదలలు ఎక్కువగా ఉంటాయి.
కానీ ఈసారి స్టార్ హీరోలంతా వెకేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. విదేశీ యాత్రలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత దక్కుతుంది. విభిన్న సంస్కృతు లను పరిశీలించే అవకాశం కూడా లభిస్తుంది. భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్‌లలో వందలాది మంది టెక్నీషియన్లు ఎండలో పని చేయడం ఇబ్బందికరమని భావించి నిర్మాతలు కూడా బ్రేక్ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నారు. తెరపై అలరించే స్టార్లు నిజ జీవితంలో రీఛార్జ్ అవ్వడానికి సమ్మర్ వెకేషన్‌ను చక్కగా వాడుకుంటున్నా రు. జూన్ నెల నుండి మళ్ళీ షూటింగ్ స్పాట్లు, స్టూడియోలన్నీ కళక ళలాడ నున్నాయి. అప్పటి వరకు హీరోలు విదేశాల్లో విహరిస్తూ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయనున్నారు.
