Begin typing your search above and press return to search.

ఫార్మాలిటీయా? లేక టాలీవుడ్ సక్సెస్ ప్లానా?

ముఖ్యంగా చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు సపోర్ట్ మరింత ఉపయోగపడుతోంది. భారీ బడ్జెట్ లేని సినిమాలకు స్టార్ హీరోల ట్వీట్లు లేదా ప్రశంసలు పెద్ద బూస్ట్‌ గా మారుతున్నాయి.

By:  M Prashanth   |   17 July 2026 1:29 PM IST
ఫార్మాలిటీయా? లేక టాలీవుడ్ సక్సెస్ ప్లానా?
X

ఒక స్టార్ హీరో సినిమా ట్రైలర్ విడుదలైంది. కొన్ని నిమిషాల్లోనే మరో స్టార్ హీరో సోషల్ మీడియాలో ఆ ట్రైలర్‌ ను షేర్ చేస్తూ విషెస్ తెలిపాడు. మరో సినిమా రిలీజ్ అయితే ప్రముఖ నటులు ట్వీట్లు పెడుతున్నారు. చిన్న సినిమా హిట్ అయితే పెద్ద హీరోలు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. బయట నుంచి చూస్తే ఇవన్నీ సినీ ప్రముఖుల మధ్య ఉండే ఫ్రెండ్ షిప్ గా కనిపించవచ్చు.

కానీ టాలీవుడ్‌ లో ఇవి కేవలం ఫార్మాలిటీలు మాత్రమే కాదని, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కు ఉపయోగపడే ఒక ప్లాన్ గా మారాయని టాక్ వినిపిస్తోంది. గతంలో సినిమా ప్రమోషన్స్ మెయిన్ గా పోస్టర్లు, టీవీ అనౌన్స్మెంట్లు, మీడియా ఇంటర్వ్యూల వరకే పరిమితమయ్యేది. కానీ సోషల్ మీడియా ఎఫెక్ట్ పెరిగిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు స్టార్ హీరో ఒక ట్వీట్ చేస్తే లక్షలాది మంది అభిమానులకు ఆ ఇన్ఫో క్షణాల్లో చేరుతోంది.

దీంతో ఒక హీరో సినిమా గురించి మరో హీరో మాట్లాడితే అది ఎక్స్ ట్రా బూస్ట్ గా మారుతోంది. టాలీవుడ్‌ లో ఆ కల్చర్ గత కొన్నేళ్లుగా మరింత బలపడింది. ట్రైలర్ విడుదలైనా, టీజర్ వచ్చినా, పాట విడుదలైనా ఇతర హీరోలు సోషల్ మీడియాలో స్పందించడం సాధారణమైంది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు గెస్ట్లుగా హాజరవడం కూడా తరచూ కనిపిస్తోంది. దీనివల్ల సినిమా గురించి ఆయా హీరోల ఫ్యాన్స్ కు సమాచారం చేరుతోంది.

ముఖ్యంగా చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు సపోర్ట్ మరింత ఉపయోగపడుతోంది. భారీ బడ్జెట్ లేని సినిమాలకు స్టార్ హీరోల ట్వీట్లు లేదా ప్రశంసలు పెద్ద బూస్ట్‌ గా మారుతున్నాయి. ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడంతో పాటు మీడియా దృష్టి పడుతోంది. దీంతో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మరింత మందికి చేరుకునే అవకాశం లభిస్తోంది. అందుకే ఇది కేవలం వ్యక్తిగత సంబంధాల వల్ల మాత్రమే కాదు. తెలుగు పరిశ్రమ మొత్తం బలపడాలనే ఆలోచన కూడా దీనికి కారణంగా తెలుస్తోంది.

ఒక సినిమా విజయం సాధిస్తే దాని ప్రభావం మొత్తం ఇండస్ట్రీపై పడుతుంది. థియేటర్లకు ప్రేక్షకులు రావడం పెరుగుతుంది. ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతుంది. మార్కెట్ విస్తరిస్తుంది. రీసెంట్ గా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తెలుగు పరిశ్రమలో ఉన్న ఆ కల్చర్ ను ప్రశంసించింది. ఇక్కడ ఒకరి విజయాన్ని మరొకరు ఆనందంగా స్వీకరిస్తారని, ఇతర హీరోల సినిమాలను కూడా ప్రమోట్ చేస్తారని, అదే టాలీవుడ్ ప్రత్యేకత అని చెప్పడం విశేషం.

ఏదేమైనా ట్రైలర్ షేర్లు, ట్వీట్లు కేవలం ఫ్రెండ్ షిప్ కు గుర్తు మాత్రమే కాదు. ఇవి పరిశ్రమలో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ను పెంచే ఎలిమెంట్స్ గా పనిచేస్తున్నాయి. ఒకరి సినిమా బాగా ఆడితే అది తెలుగు సినిమా బ్రాండ్‌ కు మేలు చేస్తుందనే అవగాహన సినీ ప్రముఖుల్లో ఎక్కువైందని చెప్పాలి. అందుకే టాలీవుడ్‌ లో కనిపించే సోషల్ మీడియా సపోర్ట్ కేవలం ఫార్మాలిటీగా చూడలేమని, ట్రైలర్ షేర్లు, ట్వీట్లు, ఎంకరేజ్మెంట్ వెనుక తెలుగు ఇండస్ట్రీ మరింత బలపడాలనే ఆలోచన ఉందని అనేక మంది కామెంట్లు పెడుతున్నారు.