టాలీవుడ్ హీరోలకు కలిసి రాలేదా?
టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ పరిశ్రమ కలిసి రాలేదా? ఎంత మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఒకేలా ఉంటుందా? అంటే సన్నివేశం అలాగే ఉంది.
By: Srikanth Kontham | 28 Aug 2025 1:00 PM ISTటాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ పరిశ్రమ కలిసి రాలేదా? ఎంత మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఒకేలా ఉంటుందా? అంటే సన్నివేశం అలాగే ఉంది. సీనియర్ హీరోల నుంచి ఆ తర్వాత తరం స్టార్ల వరకూ చాలా మంది హిందీలో ఎంట్రీ ఇచ్చారు. కానీ ఎవరూ అక్కడ నిలదొక్కుకోలేకపోయారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ పీక్స్ లో ఉండగానే హిందీలో `ఆజ్ కా గుండా రాజ్` చిత్రంతో హిందీ లో లాంచ్ అయ్యారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన సినిమా 1992లో రిలీజ్ అయింది. కానీ ఆ తర్వాత చిరు మళ్లీ మరో హిందీ సినిమా చేయలేదు.
ఆ రెండు హిందీలోనే:
తెలుగులోనే తన ప్రస్తానాన్ని కొనసాగించారు. అలాగే కింగ్ నాగార్జున `శివ` సినిమాతోనే హిందీలో లాంచ్ అయ్యారు. రాంగోపాల్ వర్మ ఆ చిత్రాన్ని హిందీలో చేసి మిగతా భాషల్లో అనువదించారు. కానీ ఆ సినిమాకు అప్పట్లో సౌత్ మార్కెట్ అయినా తమిళ, సహా ఇతర భాషల నుంచి మంచి లాభాలొచ్చాయి. సౌత్ లో సొంత డిస్ట్రిబ్యూషన్ కావడంతోనే మిగతా భాషలకంటే ఎక్కువ లాభాలొచ్చినట్లు నిర్మాత అక్కినేని వెంకట్ ఓ సందర్భంలో తెలిపారు. `క్రిమినల్` చిత్రం కూడా హిందీలోనే తెరకెక్కించారు.
బాలయ్య మాత్రం నో ఛాన్స్:
ఆ తర్వాత నాగ్ `ఖుడా గావ్`, `ద్రోహీ` నాలుగు ఆరేడు హిందీ సినిమాలు చేసారు. కానీ స్టార్ గా అక్కడ ఎస్టాబ్లి ష్ కాలేదు. తెలుగు సినిమాలపై చూపించిన ఆసక్తి హిందీ సినిమాల్లో చూపించలేదు. `ఎల్ ఓసీ కార్గిల్` ద్వారా నాగ్ మళ్లీ హిందీ సినిమా చేయడానికి రెండు దశాబ్దాలు పట్టింది. 2022లో రిలీజ్ అయిన `బ్రహ్మస్త్ర` మొదటి భాగంలో ఓ కీలక పాత్ర పోషించారు. ఇక నటసింహ బాలకృష్ణ అయితే హిందీ సినిమాల జోలికి వెళ్లింది. ఆయన ప్రయాణమంతా తెలుగులోనే కనిపిస్తుంది. విక్టరీ వెంకటేష్ మాత్రం హిందీలో కొన్ని సినిమాలు చేసారు.
సీనియర్లు అలా..జూనియర్లు ఇలా:
1993లో `అనారి` సినిమాతో హిందీ మార్కెట్ లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత `తాక్ దీర్ వాలే`లో నటిం చారు. ఆ తర్వాత బాలీవుడ్ ని టచ్ చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన `కిసీకా భాయ్ కిసీకా జాన్` లో గెస్ట్ రోల్ లో అలరించారు. ఇలా ముగ్గురు సీనియర్లు హిందీలో సినిమాలైతే చేసారు గానీ అక్కడ పెద్ద స్టార్లగా మాత్రం అవతరించలేదు. తెలుగు పరిశ్రమకే పరిమిత మయ్యారు. తర్వాత తరం హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `జంజీర్` రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు.
ఎవరి డెబ్యూలు సక్సస్ అవ్వలేదు:
ఇది తెలుగులో `తుపాన్` గా రిలీజ్ అయింది. కానీ సినిమా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత మళ్లీ చరణ్ బాలీవుడ్ వైపు చూడలేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ `సాహో`తో బాలీవుడ్ లో తొలి హిందీ సినిమా చేసారు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఇటీవలే రిలీజ్ అయిన `వార్ 2` తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా అంచనాలు అందుకోలేకపోయింది. అలా తర్వాత తరం హీరోలు కూడా బాలీవుడ్ లో బెస్ట్ లాంచింగ్ ఇవ్వ లేకపోయారు. రానున్న రోజుల్లో మరింత మంది తెలుగు స్టార్లు బాలీవుడ్ లో సినిమాలు చేసే అవకాశం ఉంది.
