టాలీవుడ్ సెలబ్రిటీల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడంటే?
యావత్ ప్రపంచం న్యూ ఇయర్ కోసం వెయిట్ చేస్తుంది. సాధారణ ప్రజల్లానే సినీ సెలబ్రిటీలు కూడా ఈ న్యూ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 30 Dec 2025 10:45 PM ISTయావత్ ప్రపంచం న్యూ ఇయర్ కోసం వెయిట్ చేస్తుంది. సాధారణ ప్రజల్లానే సినీ సెలబ్రిటీలు కూడా ఈ న్యూ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా కొందరు సెలెబ్స్ వెకేషన్స్ కు వెళ్లగా, మరికొందరు మాత్రం షూటింగుల కారణం చేతనో, తమ సినిమాల రిలీజుల కారణంగానో హైదరాబాద్ లోనే ఉండి ఇక్కడే న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి టాలీవుడ్ లోని సెలబ్రిటీలు ఎవరెక్కడ న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూద్దాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మామూలుగా ఏదైనా బ్రేక్ దొరకడం ఆలస్యం వెకేషన్లకు వెళ్లే మహేష్, ఈ న్యూ ఇయర్ కు కూడా ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లారు. షూటింగ్ కు బ్రేక్ దక్కడంతో మహేష్ తన న్యూ ఇయర్ ను ఫ్లోరిడాలో చేసుకోబోతున్నారు.
ఎప్పుడూ ఫ్రెండ్స్ తో కలిసి విదేశాలకు వెళ్లే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈసారి ది రాజా సాబ్ రిలీజ్ కారణంగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. సినిమా ప్రమోషన్స్ తర్వాత జనవరి 4న ప్రభాస్ హాలిడే కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
రీసెంట్ గా హాలిడే ట్రిప్ కోసం యూఎస్ వెళ్లిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రిస్మస్ తర్వాత తిరిగి షూటింగులో పాల్గొంటున్నారు. ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉన్న బన్నీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను సిటీలోనే చేసుకుంటున్నారు.
ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి జోర్డాన్ లో న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. డ్రాగన్ సినిమా లొకేషన్లను వెతికే పనిలో చిత్ర టీమ్ కూడా జోర్డాన్ లోనే ఉంది. పెద్ది షూటింగ్ కారణంగా రామ్ చరణ్ ఈసారి ఎలాంటి వెకేషన్ కు వెళ్లలేదు. మెగాస్టార్ చిరంజీవి సర్జరీ కోసం సిటీలోనే ఉండగా, నాగార్జున ఫ్యామిలీతో కలిసి గోవా వెళ్లారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇప్పటికే ఇటలీలో సెలబ్రేషన్స్ ను మొదలుపెట్టగా, విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా వారితోనే ఉన్నారు. నాగ చైతన్య, శోభిత హైదరాబాద్ లోనే న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకుంటుండగా, సిద్ధు జొన్నలగడ్డ, రామ్, నవీన్ పోలిశెట్టి కూడా సిటీలోనే ఉంటున్నారు. రీసెంట్ గా ఛాంపియన్ మూవీ ప్రమోషన్స్ ను పూర్తి చేసుకుని రోషన్ తన ఫ్రెండ్స్ తో విదేశాలకు వెళ్లగా, విశ్వక్ సేన్ ఇప్పటికే యూఎస్ లో వెకేషన్ మోడ్ లో ఉన్నారు.
