Begin typing your search above and press return to search.

పుడ్ బిజినెస్ లో టాలీవుడ్ న‌యా స్టార్లు!

పారితోషికం రూపంలోనే కాదు..వ్యాపార రంగంలోనూ సంపాదిస్తోన్న‌ సెల‌బ్రిటీలు ఎంతో మంది. ప్ర‌త్యేకించి పుడ్ బిజినెస్ అంటే? చాలా మంది స్టార్స్ లైక్ చేసే వ్యాపారం కూడా.

By:  Srikanth Kontham   |   27 Aug 2025 4:00 PM IST
పుడ్ బిజినెస్ లో టాలీవుడ్ న‌యా స్టార్లు!
X

పారితోషికం రూపంలోనే కాదు..వ్యాపార రంగంలోనూ సంపాదిస్తోన్న‌ సెల‌బ్రిటీలు ఎంతో మంది. ప్ర‌త్యేకించి పుడ్ బిజినెస్ అంటే? చాలా మంది స్టార్స్ లైక్ చేసే వ్యాపారం కూడా. ఎన్ని రంగాల్లో పెట్టుబ‌డి పెట్టినా? పుడ్ బిజినెస్ లో పెట్టుబ‌డి అధిక లాభాలు తెచ్చి పెడుతుందంటారు. ఇప్ప‌టికే చాలా మంది టాలీవుడ్ స్టార్లు రెస్టారెంట్ బిజినెస్ లో దిగ్విజ‌యంగా రాణిస్తున్నారు. వాళ్ల బ్రాండ్ ఇమేజ్ కూడా ఈ వ్యాపారానికి అంతే క‌ల‌సొస్తుంది. తెలిసిన సెల‌బ్రిటీలంతా ఆ స్టార్ రెస్టారెంట్ కే ప‌ని గ‌ట్టుకుని మ‌రీ వెళ్తున్నారు. హైద‌ర‌బాద్ ఫేమ‌స్ ప్రాంతాల్లో ఆయా స్టార్స్ రెస్టారెంట్లు ఉండ‌టం విశేషం. మ‌రి రెస్టారెంట్ బిజినెస్ లోరాణిస్తోన్న ఆ స్టార్లు ఎవ‌రంటే?..

ఆ ట్రెండ్ కి ఏఎన్నార్ బీజం వేయ‌గా అదే ఫ్యాష‌న్ మ‌ళ్లీ నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌లో క‌నిపిస్తుంది. ఏఎన్నార్ స్థాపించిన ‘ఎన్ గ్రిల్’, ‘ఎన్ ఏషియన్’ రెస్టారెంట్లు ఇప్ప‌టికే కొన్ని సంవ‌త్స‌రాలుగా న‌గ‌ర వాసుల ఆక‌లి తీరుస్తున్నాయి. ప్ర‌త్యేకించి నాగ‌చైత‌న్య క్లౌడ్ కిచెన్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఇదులో చైత‌న్య గ్రాండ్ స‌క్స‌స్ అయ్యాడు. విదేశీ వంట‌కాలు త‌న క్లౌడ్ కిచెన్ లో ప్ర‌త్యేకంగా చెప్పుకొచ్చారు. `షోయు’, ‘స్కుజి’ బ్రాండ్లతో పాన్-ఏషియన్, యూరోపియన్ వంటకాలను అందిస్తున్నారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ సైతం ‘ఏఎన్ రెస్టారెంట్స్’ పేరుతో ఓ రెస్టారెంట్ ర‌న్ చేస్తున్నారు.

అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `బఫెలో వైల్డ్ వింగ్స్` అనే స్పోర్ట్స్ బార్ నిర్వ‌హిస్తున్నారు. అలాగే మ‌రో యంగ్ హీరో సందీప్ కిష‌న్ `వివాహ భోజ‌నంబు` పేరుతో ఓ హోట‌ల్ ర‌న్ చేస్తున్నారు. న‌గర వ్యాప్తంగా చాలా చోట్ల దీని బ్రాంచ్లున్నా యి. హైద‌రాబాద్ స‌హా వైజాగ్ లో కూడా నిర్వ‌హిస్తున్నారు. సంప్ర‌దాయ తెలుగు రుచుల‌ను అందించడం ఈ హోట‌ల్ ప్ర‌త్యేక‌త‌. ఇంకా రానా ద‌గ్గుబాటి కూడా `బ్రాడ్‌వే` లైఫ్‌స్టైల్ హబ్‌తో పాటు, తన పాత ఇంటినే `సాంక్చువరీ` పేరుతో రెస్టారెంట్‌గా మార్చారు.

దేవ‌ర‌కొండ బ్ర‌ద‌ర్స్ ‘గుడ్ వైబ్స్ ఓన్లీ క్యాఫే’తో యువతను ఆకట్టుకుంటున్నారు. ఇంకా శ‌ర్వానంద్ ‘బీన్జ్’ పేరుతో స్నాక్స్ సెంటర్‌ను నిర్వ‌హిస్తున్నాడు. అలాగే న‌టుడు శ‌శాంక్ `మాయా బ‌జార్` పేరుతో ఓ రెస్టా రెంట్ ను దిగ్విజ‌యంగా ర‌న్ చేస్తున్నారు. త‌మ బ్రాండ్ నే తామే ప్ర‌మోట్ చేసుకుని మార్కెట్ చేసు కుంటారు. సిటీలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, అమీర్ పేట్ వంటి ప్రైమ్ ఏరియాలు టార్గెట్గా ఈ బిజినెస్ లు ర‌న్ అవుతున్నాయి. వీటి స‌క్సెస్ చూసి కొంత మంది టీవీ ఆర్టిస్టులు కూడా రెస్టారెంట్ వ్యాపారంలోకి దిగుతున్నారు.