Begin typing your search above and press return to search.

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

గ్రీన్‌కో సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ చలమలశెట్టి 50వ జన్మదిన వేడుకలు దీపావళి సంబరాల మధ్య ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మహేష్ బాబు, నమ్రత, రామ్ చరణ్, తేజ సజ్జా హాజరయ్యారు. నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఒకే వేదికపై టాలీవుడ్ స్టార్స్ కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

By:  Sivaji Kontham   |   10 Nov 2026 12:33 AM IST
సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?
X

ఓవైపు దీపావ‌ళి పండ‌గ‌.. మ‌రోవైపు సంఘంలో హై ప్రొఫైల్ ప‌ర్స‌నాలిటీ బ‌ర్త్ డే పార్టీ. రెండు వేడుక‌ల్ని ఒకే వేదిక‌పై ఆస్వాధించారు మ‌న సెల‌బ్రిటీలు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అటెండ‌య‌న ఇదే వేడుక‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ కూడా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. అలాగే యువ‌హీరో తేజ స‌జ్జా కూడా ఈ వేడుక‌ల్లో క‌నిపించ‌డం మ‌రో అద‌న‌పు మెరుపు.





గ్రీన్‌కో సంస్థ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి 50వ జన్మదిన వేడుకల సందర్భంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ - న‌మ్ర‌త జంట అత‌డికి శుభాకాంక్ష‌లు తెలిపారు. అనీల్ తో మ‌హేష్ కుటుంబానికి ఉన్న రిలేష‌న్ షిప్ ని ఈ వేదిక ద్వారా అర్థం చేసుకోవ‌చ్చు. అలాగే రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ వేడుక‌ల్లో క‌నిపించ‌డం సినిమా- పారిశ్రామిక వేత్త‌ల అనుబంధానికి ప్ర‌తీక‌గా చూడ‌వ‌చ్చు.





యువ‌హీరో తేజ సజ్జా మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఒక అంద‌మైన సాయంత్రం పుట్టిన‌రోజు వేడుక‌ల‌తో పాటు దీపావ‌ళి సంబ‌రాల‌లో చిల్ చేయ‌డం సెల‌బ్రిటీల‌కు ఆట‌విడుపు లాంటిది. ఇక ఈ వేదిక‌పై స్టార్ హీరోలపై మెరిసిన స్నాప్ లు ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. అక్క‌డ‌ పండ‌గ వాతావ‌రణం ప్ర‌ధాన హైలైట్ గా క‌నిపిస్తోంది.





సరదా ముచ్చట్లు, పండుగ చిరునవ్వుల నడుమ నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒకేచోట టాలీవుడ్ అగ్ర నటులందరూ కలసి సరదాగా గడపడం చూసి అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవ్వడంతో పాటు.. అభిమాన కథానాయకులు పండగ వెలుగుల మధ్య ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం తెలుగు సినీ ప్రియులకు కంటికి విందుగా నిలిచింది.

మ‌హేష్ ఓవైపు `వార‌ణాసి` చిత్రంతో బిజీ బిజీగా ఉన్నారు. త‌న పార్ట్ టాకీ చిత్రీక‌ర‌ణ ముగించి అత‌డు త‌దుపరి సినిమాపైనా దృష్టి సారించ‌నున్నారు. అలాగే రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌లే సుకుమార్ తో ఆర్.సి 17 చిత్రీక‌ర‌ణను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అలాగే జై హ‌నుమాన్ స‌హా జాంబిరెడ్డి సీక్వెల్ ప‌నిలోను తేజ స‌జ్జా కూడా బిజీగా ఉన్నారు. అప్పుడ‌ప్పుడు ఇలాంటి పండుగ‌లు మ‌న స్టార్ల‌కు ఆట‌విడుపుగా మైండ్ రీఫ్రెషింగ్ గా ఉంటాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.