వారిద్దరి విడాకుల వార్తలు నిజమేనా?
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఎవరోకరి ప్రేమ గురించో, పెళ్లి గురించో లేక విడాకుల గురించో వార్తలొస్తూనే ఉంటాయి.
By: Sravani Lakshmi Srungarapu | 23 Oct 2025 8:15 PM ISTసినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఎవరోకరి ప్రేమ గురించో, పెళ్లి గురించో లేక విడాకుల గురించో వార్తలొస్తూనే ఉంటాయి. అందులోనూ ఈ మధ్య విడాకుల వార్తలు కాస్త ఎక్కువయ్యాయి. ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న జంటలు, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా బయటకు తెలియని కారణాలతో విడిపోతున్నారు. అలా ఇప్పటికే ఎన్నో జంటలు విడాకులు తీసుకుంటున్నామని చెప్పి ఆడియన్స్ కు షాకిచ్చారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్లు
ఇక అసలు విషయానికొస్తే, టాలీవుడ్ లో ఇప్పుడో జంట విడిపోతున్నట్టు తెలుస్తోంది. స్టార్ సింగర్లుగా తమ పాటలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఓ జంట విడాకులు తీసుకుంటున్నారట. ఈ సెలబ్రిటీ సింగర్లు విడాకులు తీసుకుంటారని కొన్నాళ్ల నుంచే వార్తలొస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఇప్పుడు వారిద్దరికీ పొంతన కుదరటం లేదని, అందుకే ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారని తెలుస్తోంది.
విడాకులు తీసుకుంటున్నారని కొన్నాళ్లుగా వార్తలు
ఈ నేపథ్యంలోనే త్వరలోనే వారిద్దరూ డివోర్స్ తీసుకోబోతున్నారని నెట్టింట జోరుగా వార్తలొచ్చాయి. అయితే విడాకుల గురించి, వారి మధ్య జరుగుతున్న గొడవల గురించి ఎన్ని వార్తలొచ్చినా సదరు గాయకుడు కానీ, గాయని కానీ వాటిపై రెస్పాండ్ అవకపోవడంతో విడాకుల వార్తలు నిజమేనని అందరూ అనుకుంటూ వచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా ఆ జంటలో ఒకరు దీపావళి సందర్భంగా చేసిన పోస్ట్ ఈ విడాకుల వార్తలకు ఆజ్యం పోస్తుంది.
ఆ జంటలో ఒకరు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఓ అమ్మ, ఓ నాన్న, ఓ అక్క, ఓ తమ్ముడు.. అదీ స్టోరీ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేయగా, ఆ ఫోటోల్లో తన పార్టనర్ కానీ, తమ సంతానం కానీ లేకపోవడంతో వారిద్దరి విడాకులు ఆల్మోస్ట్ కన్ఫర్మేనని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. తమ విడాకుల గురించి ఇంతలా వార్తలొస్తున్నప్పుడైనా ఆ జంట ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి.
