క్యూలో ఉన్నంత కాలం పరిస్థితి మారదు!
టాలీవుడ్ లో స్టార్ హీరోల పారితోషికాలు ఆకాశన్నంటోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ట్రెండ్ మొదల వ్వనంత కాలం హీరోల పారితోషికం 25-30 కోట్ల మధ్యలో కనిపించేది.
By: Srikanth Kontham | 28 Nov 2025 5:00 PM ISTటాలీవుడ్ లో స్టార్ హీరోల పారితోషికాలు ఆకాశన్నంటోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ట్రెండ్ మొదల వ్వనంత కాలం హీరోల పారితోషికం 25-30 కోట్ల మధ్యలో కనిపించేది. కానీ ఇప్పుడదే హీరో పారితోషికంగా పాన్ ఇండియా మోజులో స్కైని టచ్ చేస్తోంది. ఒక్కో సినిమాకు 50 కోట్లు..100 కోట్లు అందుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతోంది. పారితోషికంతో పాటు విజయం సాధిస్తే సినిమాలో వాటా కూడా అందుకుంటున్నారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోవడంతో స్టార్ హీరోలంతా పారితోషికం తగ్గించుకోవాలి అన్న డిమాండ్ కూడా ఎప్పటికప్పుడు వ్యక్తమవుతూనే ఉంది.
నిర్మాతల మధ్యనే పోటీ:
కానీ దాన్ని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. నిర్మాతల బాధలన్నవి కేవలం మైక్ ముందు వరకే. అది దాటొచ్చిన తర్వాత కథ మళ్లీ మొదటికే. అయితే హీరోలు ఇలా డిమాండ్ చేయడానికి ప్రధాన కారణం నిర్మాతలే అంటున్నారు. హీరో అడిగినంత పారితోషికం ఇవ్వకపోతే అదే హీరోతో సినిమా నిర్మించడానికి వెనుక మరో నిర్మాత రెడీగా ఉంటాడు. అతడు కాకపోతే మరొకరు వెనకాలే పది కోట్టు ఇంకా ఎక్కువ ఇస్తానంటూ సూట్ కేసు పట్టుకుని సిద్దంగా ఉంటాడు. దీంతో హీరో దృష్టిలో నిర్మాత అంటే? నవ్వు కాకపోతే మరొకరు అన్న విధంగా మారిపోయింది.
నిర్మాతల మధ్య ఐక్యత లేకనే:
హీరోల ముందు నిర్మాతలు చేతులు కట్టుకుని నుంచోవడంతో హీరోలకు చులకనగా మారిపోయిందన్నారు. నిర్మాత ల్లో యూనిటీ ఎంత మాత్రం ఉండటం లేదన్నారు. హీరో డేట్ల కోసం ఒకరికి తెలియకుండా మరొకరు రహస్యంగా కలవడం..మంతనాలు జరపడం వంటివి హీరోలు అవకాశంగా మలుచుకుంటున్నారన్నారు. కార్పోరేట్ కంపెనీలు కూడా నిర్మాణంలోకి రావడంతో? సాధారణ నిర్మాత పరిస్థితి మరింత దైనీయంగా మారిందంటున్నారు. కార్పోరేట్ కంపెనీలు నిర్మాణంలో లేనంత కాలం నిర్మాతకు కాస్తైనా గుర్తింపు ఉండేదని ఇప్పుడా పరిస్థితి లేదంటున్నారు.
భవిష్యత్ లో పరిస్థితులు ఇంకా మారుతాయి:
అలాగే ఓటీటీలు రిలీజ్ స్లాట్ ఇచ్చే స్థాయికి చేరడంతో నిర్మాత పూర్తిగా ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారు. రిలీజ్ లు గురించి మాట్లాడంటే? ఓటీటీలు నిర్మాత చెబితే వినడం లేదు. దీంతో నేరుగా హీరోలే ఓటీటీ యాజమాన్యాలతో మాట్లాడుతున్నారని..వాళ్లకు ఉన్న గుర్తింపు కోట్లు ఖర్చు చేసిన నిర్మాతకు ఉండటం లేదన్నారు. నిర్మాత అనేవాడు కేవలం డబ్బు పెట్టడం తప్ప? అంతకు మించి కంటెంట్ పై తనకెలాంటి ఆధిపత్యం లేకుండా పోతుందంటున్నారు. భవిష్యత్ లో నిర్మాత పరిస్థితి ఇంకా దారుణంగానూ మారుతుందని కొంత మంది టాలీవుడ్ నిర్మాతలు అభిప్రాయపడ్డారు.
