మన స్టార్ హీరోలు చేసిన సినిమాల్లో పాత్రలు తప్ప హీరోలు కనబడని క్యారెక్టర్లు ఇవే...
వాళ్లు తప్ప ఇంకెవరు ఆ పాత్రలకు సెట్ అవ్వరు అనేలా కీర్తి ప్రతిష్టలను అందుకున్న ఆ గొప్ప క్యారెక్టర్లు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం...
By: Gopi Velupala | 2 Oct 2026 1:00 PM ISTసినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి విభిన్న తరహా పాత్రలను పోషిస్తుంటారు. వాళ్ళు ఎంచుకునే సబ్జెక్టులలోనే వైవిధ్యం ఉంటుంది. కాబట్టి క్యారెక్టర్లలో ఆటోమేటిగ్గా ఆ చేంజ్ ఓవర్ అనేది చూపించొచ్చనే ఉద్దేశ్యంతో డిఫరెంట్ కాన్సెప్ట్ ల మీద మన హీరోలు ఫోకస్ చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పటివరకు మన స్టార్ హీరోలు చేసిన కొన్ని సినిమాల్లో వాళ్ళ క్యారెక్టర్లు కనిపించాయి తప్ప అందులో హీరోలు ఎక్కడ కనిపించలేదు. అలా మన టైర్ వన్ హీరోలు ఎవరెవరు ఎలాంటి పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. వాళ్లు తప్ప ఇంకెవరు ఆ పాత్రలకు సెట్ అవ్వరు అనేలా కీర్తి ప్రతిష్టలను అందుకున్న ఆ గొప్ప క్యారెక్టర్లు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం...
పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన సినిమాలు అతనికి చాలా గొప్ప ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేసినవన్ని కమర్షియల్ సినిమాలే కావడం విశేషం... అయినప్పటికీ అందులో ఆయన తన మార్కును చూపిస్తూ వచ్చాడు. కెరియర్ స్టార్టింగ్ లో 'తొలిప్రేమ' సినిమాలో 'బాలు' అనే క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ ను చూసిన ప్రతి ఒక్కరు ఆ పాత్రలో ఆయన్ని తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేరు. ఆ తర్వాత 'బద్రి' సినిమాలో సైతం ఆయన చూపించినా స్టైల్ ప్రేక్షకులందరిని మెప్పించింది. ఖుషి, గబ్బర్ సింగ్, తీన్మార్, అత్తారింటికి దారేది లాంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ చాలా మంచి నటనను కనబరిచి ఆయా పాత్రల్లో పవన్ కళ్యాణ్ కనిపించలేదు. కేవలం క్యారెక్టర్లు మాత్రమే కనిపించాయి అంటూ విమర్శకుల చేత ప్రశంశలను అందుకున్నాడు.
మహేష్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు కెరియర్ స్టార్టింగ్ లోనే వైవిధ్యభరితమైన సినిమాలను చేశాడు. ఆయన చేసిన 'నాని' సినిమాలో తన నటన చాలా అద్భుతంగా ఉంటుంది. 8 సంవత్సరాల పిల్లాడి మైండ్ సెట్ తో ఉన్న క్యారెక్టర్ లో నటించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. 'నిజం' సినిమాలో ఆయన చేసిన పాత్ర ఎప్పటికీ ఎవరి గ్రీన్ గా నిలిచిపోతుంది. ఆ పాత్రలో మహేష్ బాబు ఎక్కడ కనిపించలేదు. తన కుటుంబానికి జరిగిన అన్యాయంతో రివెంజ్ తీర్చుకోవాలనుకునే ఒక పాతికేళ్ల కుర్రాడు మాత్రమే మనకు ఆ క్యారెక్టర్ లో కనిపిస్తాడు... ఒక్కడు, పోకిరి సినిమాలో ఒక మాస్ ఆరా ను క్రియేట్ చేశాడు. 'వన్ నేనొక్కడినే' సినిమాలో పేరెంట్స్ ఎవరో తెలుసుకోవడానికి సఫర్ అయ్యే కొడుకుగా అద్భుతంగా నటించాడు. చివర్లో నాజర్ దగ్గర తన పేరెంట్స్ గురించి అడుగుతున్నప్పుడు నాజర్ చెబుతుంటే మహేష్ బాబు ఏడుస్తూ చేసే నటన ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఆ ఒక్క సీన్ మహేష్ లోని గొప్ప నటుడిని చూపించడమే కాకుండా ఆయన నట పోటెన్షియాలిటీ ఏ రేంజ్ లో ఉందో కూడా తెలిసేలా చేసింది.
ప్రభాస్
ప్రభాస్ చేసిన 'డార్లింగ్' సినిమా అప్పటివరకు ప్రభాస్ సినిమాల్లో చాలా కొత్తగా ఉంటుంది. ఆ పాత్రను పర్ఫెక్ట్ గా డెలివరీ చేయగలిగాడు. ఇక దానికి తోడుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన 'బుజ్జిగాడు' సినిమాలో సైతం క్యారెక్టరైజేషన్ ను చాలా బాగా పట్టుకొని తమిళనాడు లో పెరిగి ఆంధ్రాకి వచ్చినవాడు ఎలా ఉంటాడో ఎలా మాట్లాడుతాడు ఆ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా పెర్ఫెక్ట్ గా డైలాగ్స్ ను డెలివరీ చేశాడు. బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి గా రెండు క్యారెక్టర్లలో నటించి ఒక రాజు ఎలా ఉంటాడో ఆ రాజసాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద చూపించాడు.
ఎన్టీఆర్
ఎలాంటి వైవిధ్యభరితమైన పాత్రనైనా సరే అలవోకగా చేయగలిగే నటులలో ఎన్టీఆర్ ఒకరు. 'రాఖీ' సినిమాలో ఆయన చాలా నాచురల్ గా నటించాడు. చెల్లి మీద ప్రేమతో ఉన్న అన్నయ్య క్యారెక్టర్ లో కనిపించాడు. అలాగే తన చెల్లె ను చంపేసిన వాళ్ల మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడనేది చాలా బాగా చేసి చూపించాడు. ఆ పాత్రలో ఎన్టీఆర్ పరకాయ ప్రవేశం చేశాడనే చెప్పాలి. 'టెంపర్' సినిమాలో మొదట కర్ప్టేడ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి అందరికీ కోపం తెప్పిస్తాడు. ఫైనల్ గా తన క్యారెక్టర్ లో చెంజోవర్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు... 'అరవింద సమేత వీర రాఘవ' లో ఊరు బాగుండాలని కోరుకునే ఒక నాయకుడి పాత్రలో ఒదిగిపోయాడు. 'జై లవకుశ' లో జై పాత్రలో సైతం తన విలనిజాన్ని చూపించాడు. వీటన్నింటిలో ఎన్టీఆర్ మనకి ఎక్కడ కనిపించలేదు. ఆ పాత్రలు మాత్రమే కనిపించాయి. అందుకే ఈ రోజు ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ప్రతి ఒక్కరు చాలా గొప్పగా చెబుతుంటారు...
రామ్ చరణ్
ధృవ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ను పెర్ఫెక్ట్ గా చేశాడు. ఆ పాత్రలో రామ్ చరణ్ ను తప్ప వేరే నటుడిని ఊహించుకోలేము... ఇక 'రంగస్థలం' మూవీలో 'చిట్టి బాబు' పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చెవిటి వాడి పాత్రలో అసలు అంతకు ముందు ఎన్నడు చూడని రామ్ చరణ్ ను మనం ఈ సినిమాలో చూస్తాం...ఈ పాత్రలో రామ్ చరణ్ కాకుండా చెవిటి చిట్టిబాబు మాత్రమే కనిపించాడు...నిజానికి ఒక కమర్షియల్ హీరో అప్పటి వరకు అలాంటి పాత్రల్లో కనిపించడం చాలా అరుదు. అలాంటిది రామ్ చరణ్ ఆ పాత్రను ఒప్పుకోవడం కూడా ఒక సాహసమనే చెప్పాలి.
అల్లు అర్జున్
గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆర్య, దేశముదురు లాంటి సినిమాల్లో తన పూర్తిస్థాయి నటనను చూపించాడు. ఆ పాత్రలో ఆయనను తప్ప వేరే ఎవ్వరిని ఇమాజిన్ చేసుకోలేం... 'పుష్ప' సినిమాలో రా అండ్ రాస్ట్రీక్ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా ఒదిగిపోయి నటించాడు. ఆ వేషధారణ, ఆ గుట్కా తినే స్టైల్, నడిచే విధానం, మాట్లాడేటప్పుడు పలికించిన హవా భావాలు అన్ని పెర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశాడు. అందుకే ఆయనకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది...
ఇలా మన హీరోలు తమ కెరియర్ లో ఎన్ని సినిమాలను చేసిన కూడా ది బెస్ట్ యాక్టింగ్ ను కనబరిచిన సినిమాలు మాత్రం ఇవే... ఇక రాబోయే రోజుల్లో ఇంకా మంచి మూవీస్ చేసి నేషనల్ అవార్డ్స్ తో పాటు ఆస్కార్ అవార్డ్ ను అందుకునే రేంజ్ కి వెళ్ళాలని కోరుకుందాం...
