Begin typing your search above and press return to search.

క్రేజీ స్టార్ సెట్‌లో చేసే హంగామా అంతా ఇంతా కాదా?

వెండితెర‌పై న‌ట విన్యాసాలు చేస్తూ ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహితుల్ని చేస్తుంటారు సినీ స్టార్స్‌.

By:  Tupaki Entertainment Desk   |   20 Jan 2026 3:00 PM IST
క్రేజీ స్టార్ సెట్‌లో చేసే హంగామా అంతా ఇంతా కాదా?
X

వెండితెర‌పై న‌ట విన్యాసాలు చేస్తూ ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహితుల్ని చేస్తుంటారు సినీ స్టార్స్‌. త‌మ‌దైన మార్కు మేన‌రిజ‌మ్స్‌, డ్యాన్స్‌..యాక్టింగ్ స్కిల్స్‌తో అల‌రిస్తుంటారు. వారి న‌ట‌న‌కు మెచ్చి ప్రేక్ష‌కులు వారిని డెమీ గాడ్స్‌గా పూజించ‌డం, వారికి జేజేలు ప‌ల‌క‌డం తెలిసిందే. అయితే వెండితెర‌పై ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే స్టార్స్ తెర వెనుక ఎలా ఉంటారు? తెర‌పైన క‌నిపించిన‌ట్టుగానే ప‌ద్ద‌తిగా ఉంటారా? .. లేక సాధార‌ణ వ్య‌క్తుల్లాగే ప్ర‌వ‌ర్తిస్తారా? అనేది చాలా మందికి తెలిసియ‌దు. సెట్‌లో ఉండేవారికి త‌ప్ప మిగ‌తా ప్ర‌పంచానికి వారి రియాలిటీ ఏంటో తెలిజే అవ‌కాశం లేదు.

దీంతో చాలా మంది అభిమానుల్లో, సినీ ల‌వ‌ర్స్‌లో అభిమాన తార‌లు సెట్‌లో ఎలా ఉంటారు? ఎలా ప్ర‌వ‌ర్తిస్తారు? .. టీమ్‌కు స‌హ‌క‌రిస్తారా? అంతా తామై టీమ్‌ని సాఫీగా ముందుకు న‌డిపిస్తారా? మిగ‌తా వారి లాగే టీమ్‌ని, డైరెక్ట‌ర్‌ని, ప్రొడ్యూస‌ర్స్‌ని ఇబ్బందుల‌కు గురి చేస్తారా? అనేది తెలుసుకోవాల‌నే ఆస‌క్తి ఉంటుంది. ఇంత‌కీ తెర‌పై మెరుపులు మెరిపించే స్టార్స్‌లో కొంత మంది సెట్స్‌లో ఎలా ఉంటారు? ..ఎలా షూటింగ్ చేస్తారు? అన్న‌ది కొన్ని సంద‌ర్భాల్లో బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసిన అది కొంత వ‌ర‌కే. తాజాగా ఓ స్టార్ హీరోకు సంబంధించిన ఆన్ ది సెట్స్ సీక్రెట్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

అవి చాలా వ‌ర‌కు అభిమానుల‌నే కాకుండా, స‌గ‌టు సినీ ల‌వ‌ర్స్‌ని షాక్‌కు గురి చేసే విధంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. స‌ద‌రు స్టార్ హీరో ప్రాజెక్ట్ అంగీక‌రించే ద‌గ్గ‌రి నుంచే స‌వా ల‌క్ష్య కండీష‌న్స్ పెడ‌తాడ‌ట‌. సెట్‌లో ఎంత మంది ఉండాలి? .. షూటింగ్ ఎప్పుడు ప్యాక‌ప్ చెప్పాలి? ..హీరోయిన్‌గా ఎవ‌రిని తీసుకోవాలి..మ‌ద‌ర్‌, సిస్ట‌ర్ క్యారెక్ట‌ర్ల‌కు ఎవ‌రైతే అనీజీగా ఉండ‌దు.. వంటి విష‌యాల‌ని ముందే చెప్పేస్తాడ‌ట‌. ఇక వ‌న్స్ షూటింగ్ స్టార్ట్ అయ్యాక స‌ద‌రు హీరో ఐదు దాటితే ఉండ‌న‌ని మొండికేస్తూ ఇబ్బంది పెడుతుంటాడ‌ట‌.

గంట ముందు నుంచే అసిస్టెంట్‌తో క‌బురు చెప్పించ‌డం.. షూటింగ్ ఇంకా కొన‌సాగుతుంటే ఇంకా ఎన్ని సీన్‌లు.. ఒకే లోకేష‌న్‌లో ఎన్ని సీన్‌లు తీస్తారు?.. నేను చేయ‌ను అని ఇబ్బంది క‌రంగా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ట‌. అంతే కాకుండా శ‌ని, ఆదివారాలు మాత్రం షూటింగ్ చేయ‌న‌ని, శ‌నివారం అయితే అస్స‌లు సెట్‌లోకే రాన‌ని మ‌రీ క‌రాకండీగా చెబుతాడ‌ట‌. ఈ కండీష‌న్‌ల‌న్నింటీకి అండ‌గీక‌రించిన వారికే సినిమా చేస్తాడ‌ట‌. లేదంటే నో చెప్పేస్తాడ‌ట‌. ఆ కార‌ణంగానే ఇటీవ‌ల త‌న‌ని వెతుక్కుంటూ వ‌చ్చిన బాలీవుడ్ క్రేజీ ఆఫ‌ర్‌ని స‌ద‌రు స్టార్ వ‌దులుకున్నాడ‌ని టాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

వెండితెర‌పై ఎన్నో ప్ర‌యోగాత్మ‌క సినిమాల‌కు శ్రీ‌కారం చుట్టిన స‌ద‌రు స్టార్ హీరో తెర వెనుక మాత్రం ఇలా నానా కండీష‌న్‌లు పెడుతూ సెట్‌లో ప్రొడ్యూస‌ర్, డైరెక్ట‌ర్‌, స‌హ న‌టుల‌తో స‌హా ప్ర‌తీ ఒక్క‌రినీ ఇబ్బందుల‌కు గురి చేస్తుండ‌టం నిజంగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మే అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికీ ఇదే పంథాని ఫాలో అవుతున్న స‌ద‌రు స్టార్ హీరో ప్ర‌స్తుతం రేసులో వెన‌క‌బ‌డ్డాడు. త‌న స‌మ‌కాలీన హీరోలంతా వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్లు సొంతం చేసుకుంటుంటే ఈ యాటిట్యూడ్ కార‌ణంగానే స‌ద‌రు స్టార్ హీరో స‌క్సెస్‌ల‌ని ద‌క్కించుకోలేక ప్ర‌ధాన పాత్ర‌లు, గెస్ట్ క్యారెక్ట‌ర్లు చేస్తున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వర్గాలు అంటున్నాయి.