బాక్సాఫీస్ లెక్కలు మారాయి.. సీనియర్ హీరో ప్రాజెక్టులో భారీ మార్పులు!
కేవలం ఈ ఒక్క సినిమానే కాదు, టాలీవుడ్‌లో చాలా కొత్త ప్రాజెక్టులు ఇప్పుడు కాస్ట్ కటింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. హీరోలు కూడా తమ రెమ్యునరేషన్లను తగ్గించుకుంటూ నిర్మాతలకు సపోర్ట్ చేస్తున్నారు.
By: M Prashanth | 27 Jan 2026 5:00 PM ISTటాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఒక సీనియర్ టాప్ హీరో, మాస్ సినిమాల స్పెషలిస్ట్ అయిన ఒక సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కాంబినేషన్‌లో పట్టాలెక్కాల్సిన సినిమా ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. నిజానికి ఈ ప్రాజెక్ట్ గతేడాదే లాక్ అయ్యింది. ఒక భారీ పీరియడ్ డ్రామాతో ఆడియన్స్‌ను అలరించడానికి టీమ్ అంతా రెడీ అయ్యింది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. అనుకున్న కథను పక్కన పెట్టి మరీ కొత్త ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం డిజిటల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్స్ అంత ఆశాజనకంగా లేవు. మార్కెట్ పరిస్థితులు తలకిందులు అవ్వడంతో మేకర్స్ ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు వందల కోట్లు పలికిన బిజినెస్ ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టింది. ఈ ప్రభావం నేరుగా ప్రొడక్షన్ ఖర్చులపై పడుతోంది. అందుకే భారీ బడ్జెట్‌తో రిస్క్ చేయడం కంటే.. ఉన్నంతలో బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చేలా ప్లాన్ మార్చుకుంటున్నారు.
ఈ ప్రాజెక్ట్ విషయంలో జరిగిన అసలు మార్పు ఏంటంటే.. ఏకంగా 60 కోట్ల రూపాయల బడ్జెట్‌ను తగ్గించేశారట. కథలో ఉన్న పీరియడ్ ఎలిమెంట్స్ వల్ల ఖర్చు పెరిగిపోతుండటంతో, సదరు దర్శకుడు తన స్క్రిప్ట్‌ను పూర్తిగా మార్చేశారని టాక్. కేవలం కొద్ది రోజుల్లోనే ఒక కొత్త కథను సిద్ధం చేసి హీరోతో పాటు నిర్మాత నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు. దీనివల్ల ప్రొడ్యూసర్‌పై ఉన్న భారీ ఆర్థిక భారం ఒక్కసారిగా తగ్గిపోయింది. సినిమా క్వాలిటీ తగ్గకుండానే బడ్జెట్‌ను కంట్రోల్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
కేవలం ఈ ఒక్క సినిమానే కాదు, టాలీవుడ్‌లో చాలా కొత్త ప్రాజెక్టులు ఇప్పుడు కాస్ట్ కటింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. హీరోలు కూడా తమ రెమ్యునరేషన్లను తగ్గించుకుంటూ నిర్మాతలకు సపోర్ట్ చేస్తున్నారు. అనవసరమైన ఖర్చులకు స్వస్తి చెప్పి, కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల సినిమా బిజినెస్ సేఫ్ జోన్ లో ఉంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బడ్జెట్ తగ్గినా మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని టీమ్ ఫిక్స్ అయ్యింది.
మార్చి నెలలో ఈ క్రేజీ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ కొత్త కథలో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు నేటి జనరేషన్ ఆడియన్స్‌కు నచ్చే కొత్త కోణం ఏదో ఉండబోతోందని సమాచారం. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాను మించి ఇది ఉండబోతోందట. అందుకే బడ్జెట్ తగ్గినప్పటికీ సినిమాపై ఉన్న అంచనాలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారికంగా మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. బాక్సాఫీస్ లెక్కలకు తగ్గట్టుగా మేకర్స్ తమ రూట్ మార్చుకోవడం మంచి పరిణామమే. భారీ ఖర్చుతో కూడిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడితే వచ్చే నష్టం కంటే, ఇలా పక్కా ప్లాన్‌తో వెళ్లడం సేఫ్ అనిపిస్తోంది. సదరు మాస్ హీరో తన మార్క్ పెర్ఫార్మెన్స్‌తో ఈసారి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
