Begin typing your search above and press return to search.

2026 ఆగ‌స్టు సంథింగ్ స్పెష‌ల్!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతి నెలా ఎన్నో విశేషాలు ఉంటాయి. కానీ ఈసారి 2026 ఆగస్టు మాత్రం టాలీవుడ్ అభిమానులకు నిజంగా పండుగలా మారుతుంది.

By:  Srikanth Kontham   |   4 Aug 2026 12:53 PM IST
2026 ఆగ‌స్టు సంథింగ్ స్పెష‌ల్!
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతి నెలా ఎన్నో విశేషాలు ఉంటాయి. కానీ ఈసారి 2026 ఆగస్టు మాత్రం టాలీవుడ్ అభిమానులకు నిజంగా పండుగలా మారుతుంది. టాలీవుడ్ అగ్ర హీరోల పుట్టినరోజులు రావడం మాత్రమే కాకుండా అదే సమయంలో వారి మోస్ట్ అవేటెడ్ సినిమాల నుంచి వచ్చే క్రేజీ అప్‌డేట్స్ ఇండస్ట్రీలో సందడి చేయ‌నున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ వంటి దిగ్గజ హీరోల బర్త్ డేలు ఆగస్టు మాసంలో తెలిసిందే. అయితే ఈసారి పుట్టిన రోజు వేడుక‌ల‌తో పాటు వారి సినిమా అప్ డేట్స్ కూడా ఇదే నెల‌లో రావ‌డం విశేషం.

సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలతో సరిపెట్టకుండా మేకర్స్ సైతం ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని వారు న‌టిస్తోన్న భారీ ప్రాజెక్ట్‌ల నుంచి అదిరిపోయే అప్‌డేట్స్‌ను ప్లాన్ చేశారు. దీంతో టాలీవుడ్ సర్కిల్స్‌లో ఎక్కడ చూసినా ఈ ముగ్గురి గురించే హాట్ చర్చ జరుగుతోంది. ఈ ఆగస్టు నెలలో అభిమానులకు ఊపునిచ్చేలా రాబోతున్న సినిమా అప్‌డేట్స్ ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలను పెంచుతున్నాయి. విభిన్న కథాంశాలతో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న చిత్రాల నుంచి వచ్చే టీజర్లు.. పోస్టర్లు ..గ్లింప్స్‌ల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఈ సంబరాలు టాలీవుడ్‌లో సరికొత్త ఊపును తీసుకొస్తాయని బాక్సాఫీస్ వద్ద సినిమాలపై అంచనాలు మరింత పీక్స్‌కు వెళ్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముగ్గురు అగ్ర హీరోల సినిమాలు ఒకే సీజన్‌లో ఇలా అప్‌డేట్లతో సందడి చేయడం తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఆగ‌స్టు 22 చిరంజీవి పుట్టిన రోజు కావ‌డంతో ఆరోజు `విశ్వంభ‌ర‌`కు సంబంధించిన కొత్త అప్ డేట్ ఉంటుంది. అలాగే సెట్స్ లో ఉన్న బాబి సినిమా విష‌యాల‌ను కూడా చిరంజీవి లీక్ చేసే అవ‌కాశం ఉంటుంది.

ఈ రెండింటితో పాటు శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ వివ‌రాల‌పై క్లూ త‌ప్ప‌నిస‌రి అని అభిమానులు భావిస్తున్నారు. ఇక మ‌హేష్ బ‌ర్త్ డే ఆగ‌స్టు 9 కావ‌డంతో `వార‌ణాసి` నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ క‌చ్చితంగా ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. రాజమౌళి త‌న హీరో బ‌ర్త్ డేని క్రేజీగా ప్లాన్ చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌చారం ఠారెత్తిపోతుంది. ఇక నాగార్జున బ‌ర్త్ డే ఆగ‌స్టు 29 కావ‌డంతో? ఆ రోజు క‌చ్చితంగా ఆయ‌న వందవ సినిమాకు సంబంధించిన అప్ డేట్ లేకుండా బ‌ర్త్ డే పుల్ ఫిల్ కాదు. అలాగే కొత్త సినిమా విశేషాలు కూడా ఆరోజును లీక్ చేసే అవ‌కాశం ఉంది.

ఇలా ముగ్గురు హీరోలు ఒకే నెల‌లో త‌మ సినిమా విశేషాల‌ను పంచుకోవ‌డం ఇదే తొలిసారి కావొచ్చు. ఇంత వ‌ర‌కూ ఇలాంటి శుభ సంద‌ర్భం ఎన్న‌డు వ‌చ్చి ఉండ‌దు. బ‌ర్త్ డేలు ఒకేనెల‌లో వ‌చ్చినా? ఆ స‌మ‌యానికి వారి సినిమాలు సెట్స్ లో ఉంట‌నే అప్ డేట్స్ కు అవ‌కాశం ఉంటుంది. 2026 ఆగ‌స్టు ముగ్గురు స్టార్ల‌కు అలా కుదిరింది.