ఎముకులు కొరికే చలిని సైతం లెక్క చేయని స్టార్లు!
సినిమా షూటింగ్ లకు మేకర్స్ ఇస్తే తప్ప బ్రేక్ ఉండదు. ఒకసారి సినిమా పట్టాలెక్కిందంటే? పూర్తయ్యే వరకూ రాజీ లేకుండా పని చేస్తారు
By: Srikanth Kontham | 30 Dec 2025 3:54 PM ISTసినిమా షూటింగ్ లకు మేకర్స్ ఇస్తే తప్ప బ్రేక్ ఉండదు. ఒకసారి సినిమా పట్టాలెక్కిందంటే? పూర్తయ్యే వరకూ రాజీ లేకుండా పని చేస్తారు. ఈ విషయంలో స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకూ దర్శకులకు అంతే గొప్పగా సహకరిస్తారు. అనుకోని సంఘటనలు..అనారోగ్యానికి గురైన సందర్భాల్లో తప్ప షూటింగ్ ఢుమ్మా కొట్టడానికి ఏ స్టార్ అంగీకరించడు. తీవ్రమైన ఎండైనా..వానైనా...చలి అయినా? రాజీ పడకుండా పని చేస్తారు. ప్రస్తుతం దేశంలో చలి తీవ్రత ఎలా ఉందన్నది చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత్తలు గణనీయంగా పడిపో తున్నాయి.
పెరుగుతోన్న చలి, దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో చలి తీవ్రత అంతకంతకు పెరిగిపోతుంది. మరో 20 రోజుల పాటు, చలి తప్పదు. అయినా సరే టాలీవుడ్ లో షూటింగ్ లు మాత్రం బంద్ అవ్వలేదు. బిగ్ స్టార్స్ నుంచి చిన్న హీరోల వరకూ అంతా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న `ప్యారడైజ్` షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. షూట్ మొదలైన దగ్గర నుంచి శ్రీకాంత్ ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా పనిచే స్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. అలాగే డార్లింగ్ ప్రభాస్ `పౌజీ` షూటింగ్ నుంచి తాను బ్రేక్ తీసుకున్నా? దర్శకుడు హనురాఘవూడి మాత్రం బ్రేక్ తీసుకోలేదు.
ప్రభాస్ అందుబాటులో లేకపోయినా ఇతర ప్రధాన నటీనటులపై షూటింగ్ నిర్వహిస్తున్నారు. `రాజాసాబ్` రిలీజ్ అనంతరం డార్లింగ్ మళ్లీ షూట్ కి హాజరవుతాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కూడా కొత్త షెడ్యూల్ ఈ మధ్యే మొదలు పెట్టడంతో? చలిగిలీ జాన్తా నయ్ అంటూ ముందుకు సాగుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న 22వ సినిమా షూటింగ్ కూడా నిర్విరామంగా ముంబైలో జరుగుతోంది. స్టూడియోలతో పాటు ఔట్ డోర్ షూటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఎస్ ఎస్ ఎంబీ 29 `వారణాసి` టీమ్ కూడా రెస్ట్ లెస్ గా పని చేస్తోంది. మహేష్ పై రాజమౌళి కీలక సన్నివేశాలు చిత్రీకరించే బిజీలో ఉన్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న `పెద్ది` షూటింగ్ కీ కూడా బ్రేక్ పడలేదు. మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన చిత్రం కావడంతో దర్శకుడు బుచ్చిబాబు వీలైనంత వేగంగా షూట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే చిత్రీక రణ క్లైమాక్స్ కు చేరుకుంది. రౌడీబోయ్ విజయ్ దేవరకొండ నటిస్తోన్న `రౌడీజనార్దన` కూడా రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే రిలీజ్ అయిన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో? విజయ్ ప్రోడక్ట్ పై చాలా కాన్పిడెంట్ గా ఉన్నాడు. ఇంకా నాగ చైతన్య, సాయిధరమ్ తేజ్, విశ్వక్ సేన్, అఖిల్ సినిమా షూటింగ్ లు కూడా నిర్విరామంగా జరుగుతున్నాయి. ఇంకా చిన్నా చితకా హీరోలంతా కూడా ఆన్ సెట్స్ లో బిజీగా ఉన్నారు. పొగ మంచులో షూట్ చేయాల్సిన సన్నివేశాలకు ఇది అనుకూల సమయం కావడంతో? సరంజామాతో రియల్ లోకేషన్స్ లో వాలిపోయే యూనిట్లు మరికొన్ని.
