Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ కు మరో బిగ్ షాక్

టాలీవుడ్ లో సినీ కార్మికులు తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   11 Aug 2025 12:20 PM IST
టాలీవుడ్‌ కు మరో బిగ్ షాక్
X

టాలీవుడ్ లో సినీ కార్మికులు తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. 30 శాతం పెంచాలని ఫిలిం ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. కానీ దానికి నిర్మాతలు అంగీకరించడం లేదు. మొదటి 15 శాతం పెంచి తర్వాత విడతల వారీగా పెంచుతామన్న ఒప్పుకోవడం లేదు.

రూ.2000 లోపు రోజువారీ వేతన ఉన్న వాళ్లకు పెంచుతామని చెప్పినా అందరికీ పెంచాల్సిందే ఫిలిం ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ తో చర్చలు జరిగినా అవి ఫలించలేదు. దీంతో టాలీవుడ్ లో షూటింగ్స్ నిలిపివేయాలని ఫిలిం ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ప్రకటించింది.

దీంతో కార్మికుల వేతనాల పెంపునకు అంగీకరించిన నిర్మాతలు రూపొందిస్తున్న సినిమాల షూటింగ్స్ కూడా నేటి నుంచి నిలిచిపోయాయి. అయితే వేతనాల పెంపుపై ఇరువర్గాల మధ్య చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో ఫెడరేషన్ కు సహకరించకుండా శుక్రవారం నుంచి షూటింగ్స్ నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్ ఆదేశించింది.

ఇప్పుడు ఫిలిం ఫెడరేషన్ కూడా అదే నిర్ణయం తీసుకోవడంతో టాలీవుడ్ లో అన్ని సినిమాల షూటింగులకు తాత్కాలికంగా బ్రేక్ పడిపోయింది. టాలీవుడ్ లో షూటింగ్స్ మొత్తానికి నిలిచిపోయాయి. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు నెటిజన్లు, ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. ఇప్పటికే టాలీవుడ్ లో అనేక సినిమాలు షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అందులో కొన్ని చిత్రాల రిలీజ్ డేట్స్ ఇప్పటికే కన్ఫర్మ్ అవ్వగా.. దానికి తగ్గట్లే మేకర్స్ ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. అందుకు అనుగుణంగా షూటింగ్ నిర్వహిస్తున్నారు. కచ్చితంగా అనుకున్న తేదీలకు సినిమాలు రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

కానీ టాలీవుడ్ లో పరిస్థితి అలా లేదు. అటు ఫిలిం ఛాంబర్ ఇటు ఫిలిం ఫెడరేషన్.. షూటింగ్స్ బంద్ కు పిలుపునిచ్చాయి. మేము షూటింగ్స్ బంద్ చేస్తాం అంటే మేము కూడా చేస్తాం అన్నట్లు ఉంది పరిస్థితి. ఇదే కొన్నాళ్లు సాగితే మాత్రం ఇబ్బందే. అనేక హీరోల సినిమాలకు తిప్పలు తప్పవు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో.. ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయో వేచి చూడాలి.