సీక్వెల్స్ లో సింహమే రికార్డు!
టాలీవుడ్ లో చాలా సీక్వెల్స్ ప్రకటించారు 'దేవర-2', 'సలార్-2', 'హనుమాన్-2', 'మిరాయ్-2', 'పుష్ప-3', 'కల్కి 2' ఇలా కొన్ని సీక్వెల్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
By: Srikanth Kontham | 22 Sept 2025 2:00 AM ISTటాలీవుడ్ లో చాలా సీక్వెల్స్ ప్రకటించారు.'దేవర-2', 'సలార్-2', 'హనుమాన్-2', 'మిరాయ్-2', 'పుష్ప-3', 'కల్కి 2' ఇలా కొన్ని సీక్వెల్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కానీ ఇవి ఎప్పుడు మొదలవుతాయి? ఎప్పుడు రిలీజ్ అవుతాయి? అన్నది మాత్రం రిలీజ్ అయ్యే వరకూ గానీ క్లారిటీగా చెప్పలేని పరిస్థితే. `దేవర` అనంతరం `దేవర 2` ఉంటుందని `దేవర` రిలీజ్ సమయంలో ఊదరగొట్టారు. కట్ చేస్తే? తాత్కాలికంగా ఆ ప్రాజెక్ట్ ను పక్కనబెట్టి ప్రశాంత్ నీల్ `డ్రాగన్` పట్టాలెక్కించారు. ఇది అనూహ్యంగా తెరపైకి వచ్చిన ప్రాజెక్ట్.
ఆ సీక్వెల్ అసలు సంగతేంటి?
దీంతో తారక్ 'దేవర 2' ఉండదనే ప్రచారం నేపథ్యంలో తారక్ ఆ ప్రచారాన్ని ఖండించి తప్పకుండా ఆ సినిమా ఉంటుందని ధీమా వ్యక్తం చేసారు. కానీ అదెప్పుడు? అన్నది క్లారిటీ గా చెప్పలేని పరిస్థితి. `కేజీఎఫ్` తరహాలోనే `సలార్` అనంతరం `సలార్ 2` పట్టాలెక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్ ఆ ప్రాజెక్ట్ ని పక్కనబెట్టి తారక్ తో ముందుకెళ్లారు. `హనుమాన్` సక్సెస్ అనంతరం ప్రశాంత్ వర్మ `జై హనుమాన్` ప్రకటించాడు. కానీ ఆ సినిమా స్టేటస్ ఏంటి? అన్నది ఇప్పటి వరకూ వరకూ తెలియదు. ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేసి హడావుడి చేసారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు.
ఆ సీక్వెల్స్ పై క్లారిటీ లేదే:
'పుష్ప 3' కూడా ఉంటుందని సుకుమార్ చెప్పారు. కానీ ఎప్పుడు చేస్తారన్నది ఆయనకి కూడా క్లారిటీ లేదు. ఇటీవల రిలీజ్ అయినా `మిరాయ్` కి సీక్వెల్ గా` మిరాయ్ 2` కూడా ప్రకటించారు. కానీ ఇది వెంటనే పట్టాలెక్కే ప్రాజెక్ట్ కాదు. `కల్కీ 2` విషయంలోనూ ఇదే ల్యాగ్ కనిపిస్తోంది. ఎప్పుడు ప్రారంభిస్తారు? అన్న దానిపై నాగీ కూడా వివరంగా చెప్ప లేకపోతున్నారు. ఇలా ఈ సీక్వెల్స్ విషయంలో కొంత డైలమా కనిపిస్తోంది. కానీ ఎలాంటి డైలమాలు లేకుండా వస్తుంది మాత్రం ఒకే ఒక్కడు. అతడే నటసింహ బాలకృష్ణ.
బాలయ్య ప్రత్యేకత అదే:
'అఖండ'కు సీక్వెల్ గా `అఖండ2` ప్రకటించి నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్నా? ప్రాజెక్ట్ మొదలైన తర్వాత మాత్రం నిర్విరామం పని పూర్తి చేసి రిలీజ్ చేయడం బాలయ్య-బోయపాటి ద్వయానికే సాధ్యమైంది. వాస్తవానికి అఖండ 2 ఉంటుందని అఖండ సమయంలో బోయపాటి రివీల్ చేయలేదు. ఆ సినిమా సక్సెస్ చూసి కొంత గ్యాప్ తర్వాత సీక్వెల్ చేస్తే బాగుంటుందని భావించి వెంటనే కథ పనుల్లో పడటం... దాన్ని పూర్తి చేయడం ..పట్టా లెక్కిం చడం ...గ్యాప్ లేకుండా పని చేయడం అంతా వేగంగా జరిగింది. ఈ నేపథ్యంలోనే `అఖండ` విషయంలో బాలయ్య అండ్ కో స్పెషల్.
