Begin typing your search above and press return to search.

5 సినిమాలు.. ఇదే కదా టాలీవుడ్ కు కావాల్సింది..

ఏ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయితే.. ఆ ఆనందం కేవలం హీరోకే కాదు.. మొత్తం మూవీ టీమ్ కు ఉంటుంది.

By:  M Prashanth   |   7 Oct 2025 5:00 AM IST
5 సినిమాలు.. ఇదే కదా టాలీవుడ్ కు కావాల్సింది..
X

ఏ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయితే.. ఆ ఆనందం కేవలం హీరోకే కాదు.. మొత్తం మూవీ టీమ్ కు ఉంటుంది. హీరోయిన్ కు అవకాశాలు వస్తాయి. డైరెక్టర్ కు నెక్స్ట్ సినిమా విషయంలో కలిసి వస్తుంది. నిర్మాతలకు మంచి లాభాలు వస్తాయి. డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు సూపర్ ప్రాఫిట్స్ వస్తాయి.

ఇప్పుడు కొద్ది రోజులుగా టాలీవుడ్ లో అదే జరుగుతోంది. ఎన్నాళ్లకెన్నాళ్లకు అన్నట్లు ఉంది పరిస్థితి. దాదాపు నెలకు పైగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. పలు సినిమాలు మంచి వసూళ్లు రాబడుతున్నాయి. అటు మేకర్స్ కు.. ఇటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు సాలిడ్ ప్రాఫిట్స్ అందిస్తున్నాయి.

అలా టాలీవుడ్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉందనే చెప్పాలి. ఓవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ నిండుతున్నాయి.. మరోవైపు ఆడియన్స్ లో వైబ్స్ హోరెత్తుతున్నాయి.. ఇంకోవైపు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఇది కదా కావాల్సింది అని టాలీవుడ్ మూవీ లవర్స్ కామెంట్లు పెడుతున్నారు.

అయితే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద లిటిల్ హార్ట్స్ మూవీతో స్టార్ట్ అయిన సందడి.. ఇప్పుడు కాంతార చాప్టర్ 1 సినిమాతో కొనసాగుతోంది. సెప్టెంబర్ 5వ తేదీన లిటిల్ హార్ట్స్ సినిమా విడుదలైంది. చిన్న మూవీగా రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధించింది. బడ్జెట్ కు అనేక రెట్లు లాభాలు సంపాదించింది. కొన్ని రోజుల పాటు ఓ రేంజ్ లో దూసుకుపోయింది.

ఆ తర్వాత సెప్టెంబర్ 12వ తేదీన మిరాయ్, కిష్కింధపురి సినిమాలు విడుదలయ్యాయి. ఒకే రోజు రిలీజ్ అయిన రెండు చిత్రాలు కూడా ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకుని రెండు కూడా క్లీన్ హిట్ గా నిలిచాయి.

రీసెంట్ గా ఓజీ మూవీ రిలీజ్ అవ్వగా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు కాంతార చాప్టర్-1 అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. మొత్తానికి సెప్టెంబర్ లో నాలుగు సినిమాలు సందడి చేయగా.. అక్టోబర్ లో కూడా సందడి కొనసాగుతూనే ఉంది.