Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ బాక్సాఫీస్ వద్ద క్లాష్!

ఒకే వీకెండ్‌లో ఇన్ని సినిమాలు విడుదలవుతుండటంతో థియేటర్ల కోసం తీవ్రమైన పోటీ ఏర్పడే అవకాశం ఉంది.

By:  Srikanth Kontham   |   7 Aug 2026 4:05 PM IST
సెప్టెంబర్ బాక్సాఫీస్ వద్ద క్లాష్!
X

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెప్టెంబర్ నెల అత్యంత రసవత్తరమైన పోరుకు వేదికగా మారుతోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `రణబాలి` విడుదల తేదీ వాయిదా పడటంతో సెప్టెంబర్ బాక్సాఫీస్ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. టాపర్ హీరో సినిమా తప్పుకోవడంతో ఆ ఖాళీలను భర్తీ చేయడానికి .. బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పలు మీడియం ..చిన్న చిత్రాలు క్యూ క‌డుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10, 11 తేదీలలో బాక్సాఫీస్ వద్ద ఏకంగా ఐదు సినిమాలు విడుదల కాబోతుండటం సినీ వర్గాల్లో చర్చనీ యాంశమైంది.

ఒకే సమయంలో ఇన్ని సినిమాలు బరిలో దిగుతుండటంతో థియేటర్ల సర్దుబాటు, కలెక్షన్ల విభజన ,ప్రేక్షకుల ఆదరణ ఏ విధంగా ఉండబోతుందనే టెన్షన్ నిర్మాతల్లో నెలకొంది. ఈ అనూహ్య క్లాష్ టాలీవుడ్ ట్రేడ్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ భారీ పోరు బరిలో నిలుస్తున్న చిత్రాల్లో కార్తీ హీరోగా నటిస్తున్న `సర్దార్ 2`పై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం విజయం సాధించడంతో సీక్వెల్‌పై ఓవర్సీస్ .. తెలుగు రాష్ట్రాల్లో మంచి బజ్ ఉంది. దీంతో పాటు విభిన్న కథాంశాలతో రూపొందిన `మారెమ్మ`, ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్న `ఎపిక్`, వినోదాత్మకంగా తెరకెక్కిన `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` అలాగే భక్తి యాక్షన్ కంటెంట్ తో కూడిన `మహేంద్రగిరి వారాహిస‌` చిత్రాలు పోటీ పడుతున్నాయి.

ఒకే వీకెండ్‌లో ఇన్ని సినిమాలు విడుదలవుతుండటంతో థియేటర్ల కోసం తీవ్రమైన పోటీ ఏర్పడే అవకాశం ఉంది. బలమైన కంటెంట్ .. సరైన పబ్లిసిటీ ఉన్న సినిమాలకే ప్రేక్షకులు మొదటి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి చిన్న చిత్రాలకు ప్రమోషన్లే శ్రీరామరక్షగా మారనున్నాయి. మల్టీప్లెక్స్‌లు ..సింగిల్ స్క్రీన్‌ల పంపిణీ కూడా ఈ అయిదు సినిమాల బాక్సాఫీస్ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

అగ్ర‌ హీరోల సినిమాలు తప్పుకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్న ఈ చిత్రాల యూనిట్లకు క్లాష్ ఒక సవాలుగా మారింది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే పండగ వాతావరణం ఏర్పడుతుంది . కానీ ఒకవేళ నెగటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్లు త్వరగా పడిపోయే రిస్క్ కూడా లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్ మధ్యలో జరగబోయే బాక్సాఫీస్ వార్ ప్రేక్షకులకు మాత్రం పూర్తి స్థాయి వినోదాన్ని పంచడం ఖాయం.

మొత్తంగా `రణబాలి` వంటి భారీ చిత్రం లేని లోటును ఈ ఐదు సినిమాలు ఏ విధంగా భర్తీ చేస్తాయో? బాక్సాఫీస్ వద్ద ఏ చిత్రం పైచేయి సాధిస్తుందో? చూడాలి. వైవిధ్యభరితమైన కథలతో వస్తున్న ఈ చిత్రాల ఫలితాలు టాలీవుడ్ రాబోయే సీజన్ ట్రెండ్‌ను కూడా డిసైడ్ చేసే అవకాశం లేక‌పోలేదు.