Begin typing your search above and press return to search.

ఒక్క నెలలో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

ఎన్నాళ్లకెన్నాళ్లకు అన్నట్లు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ అన్నీ కళకళలాడుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతున్నాయి.

By:  M Prashanth   |   26 Sept 2025 4:30 PM IST
ఒక్క నెలలో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
X

2025 సెప్టెంబర్ నెల దాదాపు టాలీవుడ్ సినీ వర్గాలకు గుర్తుండిపోతుందనే చెప్పాలి. గత ఏడాదికి ఈసారికి చాలా తేడా ఉంది. ఎన్నాళ్లకెన్నాళ్లకు అన్నట్లు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ అన్నీ కళకళలాడుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతున్నాయి. టాలీవుడ్ నుంచి వచ్చిన అనేక సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి.

తద్వారా ఈ నెలలో టాలీవుడ్ పెద్ద ఎత్తున వసూలు చేసిందని చెప్పాలి. అయితే అది చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ తో ప్రారంభమైంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ మూవీ.. సెప్టెంబర్ 5వ తేదీన విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా సూపర్ హిట్ గా నిలిచి.. ఆడియన్స్ నుంచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంది.

రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని.. మూడో రోజు లాభాల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూలు చేసి.. మేకర్స్ కు భారీ లాభాలు అందించింది. ఆ తర్వాత వారం.. మిరాయ్, కిష్కింధ పురి సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండూ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి.

రెండు చిత్రాలు కూడా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకుని సూపర్ హిట్స్ గా నిలిచాయి. సినీ ప్రియులను థియేటర్స్ కు రప్పించాయి. ఇప్పటి వరకు దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూలు చేశాయి. దీంతో సెప్టెంబర్ నెల.. టాలీవుడ్ లో ఒక ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందని అంచనా వేశారు. ఇంతలో ఓజీ మూవీ రిలీజైంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వచ్చిన గ్యాంగ్ స్టర్ డ్రామా రీసెంట్ గా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఆ సినిమా.. పవన్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతే కాదు.. వారందరినీ థియేటర్స్ కు రిపీట్ మోడ్ లో రప్పిస్తోంది.

అయితే ఇప్పుడు మూవీ రూ.150 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించి సత్తా చాటింది. ఈ నెల 25వ తేదీన రిలీజ్ అవ్వగా.. చివరి ఐదు రోజుల్లో పెద్ద ఎత్తున వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో సెప్టెంబర్‌ లో బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకుపైగా టాలీవుడ్ వసూలు చేస్తుందని అంచనాలు ఉన్నాయి. మొత్తానికి తెలుగు సినీ పరిశ్రమకు 2025లో మంచి లాభసాటి నెలగా నిలిచింది సెప్టెంబర్.