Begin typing your search above and press return to search.

ప్రభాస్ తో పాటు ఆ నలుగురు.. వ్వాటే లైనప్!

టాలీవుడ్‌లో యంగ్ హీరోల కంటే సీనియర్ స్టార్స్ జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు.

By:  M Prashanth   |   31 July 2025 11:41 AM IST
ప్రభాస్ తో పాటు ఆ నలుగురు.. వ్వాటే లైనప్!
X

టాలీవుడ్‌లో యంగ్ హీరోల కంటే సీనియర్ స్టార్స్ జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ తో పాటు నలుగురు పెద్ద హీరోలు బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ లకు ప్లాన్ చేస్తుండడం విశేషం. ఈ ఏడాది చివరి నుంచి వచ్చే సంవత్సరం వరకూ స్టార్ హీరోలు వరుసగా తమ సినిమాలను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. బిగ్ బడ్జెట్ మూవీస్‌తో పాటు, పలు కొత్త ప్రాజెక్ట్‌లు కూడా ప్రారంభం కానుండటంతో ఇండస్ట్రీలో కొత్త జోష్ నెలకొంది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రభాస్.. హ్యాట్రిక్ బిజీ షెడ్యూల్

ప్రస్తుతం టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్‌ మూవీస్‌తో హవా చూపిస్తున్న హీరో ప్రభాస్. సలార్, కల్కి వంటి భారీ హిట్స్‌ తర్వాత, ఇప్పుడు ది రాజాసాబ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఫౌజీ కూడా సెట్స్‌పై ఉంది. ప్రస్తుత ప్రాజెక్ట్స్‌తో పాటు, సెప్టెంబర్‌లో సందీప్ వంగా డైరెక్షన్‌లో స్పిరిట్ ప్రారంభించనున్నాడు. అంటే, వచ్చే ఏడాది వరకూ ప్రభాస్ బిజీ షెడ్యూల్‌తో మూడు చిత్రాలతో అభిమానుల ముందుకు రానున్నాడు.

చిరంజీవి - ఫ్యాంటసీ నుంచి మాస్

మెగాస్టార్ చిరంజీవి 2023లో భోళా శంకర్ లో కనిపించాడు. ఇప్పుడు విశ్వంభరతో ఈ ఏడాది చివర్లో థియేటర్లలో సందడి చేయనున్నాడు. తర్వాత సంక్రాంతి 2026కి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో పెద్ద సినిమా తీసుకురాబోతున్నాడు. అంతేకాదు, సెప్టెంబర్‌లో బాబీ కొల్లీ డైరెక్షన్‌లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నాడు. ఇది కూడా 2026లో రిలీజ్ కావొచ్చని టాక్. వీటికి తోడు, శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో చిరు ఓ ప్రయోగాత్మక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తం మీద, 2026 చివరికి చిరంజీవి నుండి మూడు లేదా నాలుగు సినిమాలు రానున్నాయి.

నాగార్జున.. సెంచరీ ప్లాన్స్

రీసెంట్ గా కుబేరాతో ఆకట్టుకున్న నాగార్జున, త్వరలో రజనీకాంత్ కూలీలోనూ కనిపించబోతున్నాడు. దీంతోపాటు, తమిళ దర్శకుడు కార్తిక్‌తో నాగ్ తన వందో చిత్రాన్ని ప్రారంభించనున్నట్టు ఫిలిం నగర్‌లో టాక్. ఆగస్టులో ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యే అవకాశముంది. అలాగే మరో రెండు కథలు కూడా చర్చల దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది వరకు నాగ్ కనీసం మరో మూడు సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది.

బాలకృష్ణ - సీక్వెల్‌ పూనకం

ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ తో హిట్ కొట్టిన బాలకృష్ణ, ఇప్పుడు అఖండ 2ను సెప్టెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నాడు. ఇది పూర్తయ్యాక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా స్టార్ట్ చేయనున్నాడు. 2026లో ఈ చిత్రం థియేటర్లకు రానుంది. ఇక కృష్ణ జాగర్లమూడి దర్శకత్వంలో ఆదిత్య 999 (ఆదిత్య 369 సీక్వెల్) పై కూడా బాలయ్య డిస్కషన్లు జరుపుతున్నట్టు సమాచారం. ప్లాన్ ప్రకారం, 2026 చివరికి బాలయ్య నుండి మూడు సినిమాలు వచ్చే అవకాశముంది.

వెంకటేశ్ మరోసారి ఫ్యామిలీ ట్రాక్

వెంకటేశ్ ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో కొత్త సినిమా చేయనుండగా, చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబోలో అతిథి పాత్రలో కూడా కనిపించనున్నాడు. త్వరలోనే దృశ్యం 3 ప్రారంభం కానుందని టాక్. అంటే, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు వెంకటేశ్ స్పెషల్ ట్రీట్ రెడీ అవుతోంది.