సీనియర్లు ఎవ్వరికీ ఆ ఆలోచనలే లేదే!
రొటీన్ సినిమాగా తేలిపోయింది. అప్పటికే బోయపాటి వరుస ప్లాప్ ల్లో ఉన్నాడు. `అఖండ` ఇమేజ్ తో అంచనాలైతే ఏర్పడ్డాయి కానీ అందులో బోయపాటి క్రియేటివిటీ లేదు.
By: Srikanth Kontham | 25 Jan 2026 9:00 PM ISTటాలీవుడ్ లో సీనియర్ హీరోలంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మాత్రమే. దాదాపు నలుగురు ఒకే జనరేషన్ హీరోలు. ప్రస్తుతం ఆ నలుగురు తర్వాత తరం నటులతో పోటా పోటీగా సినిమాలు చేస్తున్నారు. రీజనల్ మార్కెట్ లో నలుగురు పెద్ద స్టార్లు. ఎవరి స్టామినాతో వారు బాక్సాఫీస్ వద్ద రాణిస్తున్నారు. మరి ఈ నలుగురు పాన్ ఇండియాలో ఎలాంటి ప్రయత్నాలు చేసారు? అంటే పాన్ ఇండియా మార్కెట్ పై నలుగురు పెద్దగా ఆసక్తిగా ఉన్నట్లు కనిపించలేదు. మెగాస్టార్ చిరంజీవి `సైరానరసింహారెడ్డి`తో ఓ ప్రయత్నం చేసారు.
స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కథ కావడంతో ఆ చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేసారు. అనుకున్నంతగా సినిమా సక్సెస్ అవ్వలేదు. పైగా ఈ చిత్రాన్ని సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలో నిర్మించి నష్టపోయారు. అప్పటి నుంచి చిరంజీవి పాన్ ఇండియా ప్రయత్నాలు చేయడం లేదు. రీజనల్ మార్కెట్ ఆధారంగానే సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే నటసింహ బాలకృష్ణ కూడా `అఖండ 2` తో పాన్ ఇండియా ప్రయత్నం చేసారు. కానీ బాలయ్యకు చేదు అనుభవమే ఎదురైంది. హిందుత్వం కాన్సెప్ట్ తో దర్శకుడు బోయపాటి పాన్ ఇండయాకి కనెక్ట్ చేసే ప్రయత్నం ఫలించలేదు.
రొటీన్ సినిమాగా తేలిపోయింది. అప్పటికే బోయపాటి వరుస ప్లాప్ ల్లో ఉన్నాడు. `అఖండ` ఇమేజ్ తో అంచనాలైతే ఏర్పడ్డాయి కానీ అందులో బోయపాటి క్రియేటివిటీ లేదు. రొటీన్ సినిమా చేసి విమర్శలు ఎదుర్కున్నాడు. మరి చిరు..బాలయ్య లు ఇక పాన్ ఇండియా సినిమాలు చేయరా? అంటే అంటే ప్రస్తుతానికి దూరంగా ఉన్నట్లే కనిపిస్తోంది. మహేష్, ప్రభాస్, బన్నీ, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్లతో పోటీ పడటం కన్నా? రీజనల్ మార్కెట్ లోనే సినిమాల్నే ఉత్తమంగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే చిరంజీవి నటించిన `మనశంకర వరప్రసాద్ గారు` రీజనల్ మార్కెట్ లో వందల కోట్లు వసూళ్లు సాధించింది. ఈ సక్సెస్ చూసిన తర్వాత తక్కువ బడ్జెట్ లోనే మంచి ఫలితాలు స్థానికంగానే రాబొట్టొచ్చని మరింత విశ్వషించే అవకాశం ఉంది.
వెంకటేష్, నాగార్జున లు అయితే ఇంత వరకూ పాన్ ఇండియాలో ఒక్క సినిమా కూడా చేయలేదు. కనీసం ఆలోచన కూడా వాళ్లకు రానట్టే కనిపిస్తోంది. ఇద్దరు కుటుంబ నేపథ్యం, భావోద్వేగం ఉన్న కథలు మినహా కొత్త ప్రయోగాల వైపు చూడటం లేదు. మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని రిస్క్ తీసుకోవడం లేదనే మాట వినిపిస్తోంది. కానీ వెంకటేష్ `సంక్రాంతికి వస్తున్నాం ` సినిమాతో 300 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే. అంత గొప్ప విజయం ఉన్నా? వెంకీ కూడా పాన్ ఇండియా కథల వైపు కనెక్ట్ అవ్వడం లేదు. కంపర్ట్ జోన్ లోనే సినిమాలు చేస్తున్నారు.
