2026 సంక్రాంతి సినిమాలు.. ఈ డేట్స్ ఫైనల్ కాదా?
ఈ లిస్ట్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఒకే వారంలో ఆరు సినిమాలు, అందులోనూ ప్రభాస్, చిరంజీవి, విజయ్ లాంటి ముగ్గురు హెవీ వెయిట్ స్టార్లు ఉండటం అనేది చాలా అరుదైన విషయం.
By: M Prashanth | 26 Oct 2025 9:18 PM ISTసంక్రాంతి సీజన్ టాలీవుడ్‌కు ఎప్పుడూ మోస్ట్ వాల్యూబుల్ టైమ్. జనాలు పండగ సెలవుల్లో థియేటర్లకు వస్తారు కాబట్టి, ఈ సీజన్‌లో యావరేజ్ సినిమాకు కూడా మంచి కలెక్షన్లు వస్తాయి. అందుకే ప్రతీ ప్రొడ్యూసర్, ప్రతీ స్టార్ హీరో ఈ డేట్ల కోసం పోటీ పడతారు. 2026 సంక్రాంతికి కూడా ఈ పోటీ గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది.
ఇంకా సమయం ఉన్నా, 2026 సంక్రాంతి బరిలో నిలబడతామంటూ ఇండస్ట్రీలో వినిపిస్తున్న లిస్ట్ చూస్తుంటే, బాక్సాఫీస్ దగ్గర పెద్ద సందడే ఉండబోతోందనిపిస్తోంది. ఇది హెల్తీ కాంపిటీషనే అయినా, లిస్ట్ చూస్తుంటే కాస్త 'ఓవర్‌క్రౌడెడ్'గా అనిపిస్తోంది. ప్రస్తుతం ఆరు సినిమాలు ఈ రేసులో ఉన్నాయని గట్టిగా టాక్ నడుస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, 2026 సంక్రాంతికి వినిపిస్తున్న 'ప్రపోజ్డ్' లిస్ట్ ఇది
జనవరి 09: ప్రభాస్ 'ది రాజా సాబ్'
జనవరి 09: విజయ్ 'జన నాయకుడు' (డబ్బింగ్)
జనవరి 12: చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు'
జనవరి 13: రవితేజ 'RT76'
జనవరి 14: నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు'
జనవరి 15: శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి'
ఈ లిస్ట్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఒకే వారంలో ఆరు సినిమాలు, అందులోనూ ప్రభాస్, చిరంజీవి, విజయ్ లాంటి ముగ్గురు హెవీ వెయిట్ స్టార్లు ఉండటం అనేది చాలా అరుదైన విషయం. ఇది ఆడియెన్స్‌కు ఛాయిస్ పెంచినా, బిజినెస్ పరంగా మాత్రం చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుంది.
ప్రధానంగా, థియేటర్ల సమస్య చాలా పెద్దది. ప్రభాస్, చిరంజీవి, విజయ్ లాంటి స్టార్లు వస్తున్నప్పుడు, వాళ్లకే మెయిన్ థియేటర్లు సరిపోవు. ఇలాంటి టైమ్‌లో, రవితేజ, నవీన్ పొలిశెట్టి లాంటి సొంతంగా క్రౌడ్ పుల్ చేయగల హీరోల సినిమాలకు కూడా కావాల్సినన్ని స్క్రీన్లు దొరకడం కష్టమవుతుంది. దీనివల్ల ఓపెనింగ్స్, ఓవరాల్ రెవెన్యూ అన్నీ స్ప్లిట్ అయిపోతాయి.
అందుకే, ఇప్పుడు వినిపిస్తున్న ఈ లిస్ట్ ఫైనల్ కాకపోవచ్చు. చాలా వరకు ఇది ఒక స్ట్రాటజిక్ అనౌన్స్‌మెంట్ మాత్రమే. అంటే, మేము ఈ సీజన్‌కు లాక్ అయ్యాం, మీరు వేరే డేట్ చూసుకోండి అని ఇండస్ట్రీకి సిగ్నల్ ఇవ్వడం. రాబోయే నెలల్లో, ఈ ఆరింటిలో కనీసం రెండు లేదా మూడు సినిమాలు తెలివిగా ఈ రేస్ నుంచి తప్పుకుని, సోలో రిలీజ్ కోసం సేఫ్ డేట్‌కు వెళ్లే అవకాశమే ఎక్కువగా ఉంది. చూడాలి మరి ఈ లిస్టులో ఎవరు తగ్గుతారో.
