మేం వచ్చేస్తున్నాం.. సిద్ధం కండి అంటున్న స్టార్ హీరోలు!
ఇక ఎప్పటిలాగే వచ్చే ఏడాది కూడా 2026 సంక్రాంతిని టార్గెట్ చేసుకొని కొన్ని బడా చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి.
By: Madhu Reddy | 10 Sept 2025 10:12 AM ISTటాలీవుడ్లో స్టార్ హీరోలు సైతం సెంటిమెంట్ గా ఏదైనా పెద్ద పండుగలను భావిస్తూ తమ సినిమాలను కూడా అప్పుడే విడుదల చేసేలా ప్లాన్ చేస్తూ ఉంటారు. అలా సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దసరా, దీపావళి అంటూ ఈ పండుగలకు స్టార్ హీరోలు తమ చిత్రాలను రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే టాలీవుడ్ కి అతిపెద్ద పండుగ సంక్రాంతి..వరుసగా వచ్చే సెలవులను క్యాష్ చేసుకోవడానికి దర్శక నిర్మాతలు ,హీరోలు ఈ స్లాట్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు..
ఇక ఎప్పటిలాగే వచ్చే ఏడాది కూడా 2026 సంక్రాంతిని టార్గెట్ చేసుకొని కొన్ని బడా చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ ఏడాది వెంకటేష్'సంక్రాంతికి వస్తున్నాం' , రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' , బాలకృష్ణ 'డాకు మహారాజ్' వంటి చిత్రాలు విడుదలయ్యాయి. 2026లో కూడా స్టార్ హీరోల చిత్రాలు విడుదల కాబోతున్నాయి. వాటి గురించి చూద్దాం.
మన శంకర వరప్రసాద్ గారు..
చిరంజీవి హీరోగా , డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న "మన శంకర వరప్రసాద్ గారు" సంక్రాంతికి రాబోతున్నామంటూ ఇదివరకే చిత్ర బృందం ప్రకటించారు. ఇందులో చిరంజీవితో పాటుగా మరో హీరో వెంకటేష్ కూడా నటిస్తున్నారు. హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ని కూడా అక్టోబర్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ది రాజా సాబ్..
ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన ప్రభాస్ - డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమా వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ చేయవలసి ఉండగా.. కొన్ని కారణాల చేత ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
రవితేజ RT 76 మూవీ..
మరొక హీరో రవితేజ కథానాయకుడుగా డైరెక్టర్ కిషోర్ తిరుమల డైరెక్షన్లో వస్తున్న '#RT76' సినిమా కూడా సంక్రాంతి బరిలోనే దించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా రాబోతోంది.
అనగనగా ఒక రాజు..
అయితే ఈ స్టార్ హీరోల కంటే ముందుగా యంగ్ హీరో నటించిన నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' సినిమా సంక్రాంతికి ఫిక్స్ అయింది. డైరెక్టర్ మారీ దర్శకత్వంలో జనవరి 14న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.
జననాయకుడు..
అలాగే ఈసారి సంక్రాంతి బరిలో మెయిన్ చిత్రాలే కాకుండా.. డబ్బింగ్ చిత్రాలు కూడా విడుదల కాబోతున్నాయి. మరి వచ్చే ఏడాది టాలీవుడ్ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ను టార్గెట్గా చేసుకొని విడుదల కాబోతున్న డబ్బింగ్ చిత్రాల విషయానికి వస్తే.. హీరో విజయ్ దళపతి నటిస్తున్న 'జననాయకుడు' చిత్రం డైరెక్టర్ హెచ్ వినోద్ కుమార్ దర్శకత్వం వహించగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాబి దేవోల్ కీలకమైన పాత్రల నటిస్తున్నారు. జనవరి 9న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.
ఇకపోతే ఈ సినిమాలన్నీ కూడా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడడానికి సిద్ధమవుతున్నాయి. కానీ అన్ని సినిమాలు అనుకున్న సమయానికి వస్తాయా అంటే చెప్పలేని పరిస్థితి.. కొన్ని చిత్రాల షూటింగ్ ఆలస్యం అవ్వచ్చు లేదా ఇంకొన్ని చిత్రాలకు వీఎఫ్ఎక్స్ ఆలస్యం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా సంక్రాంతి బరిలోకి మేము వచ్చేస్తున్నాం .. మీరు సిద్ధంకండి అంటూ చాలామంది స్టార్ హీరోలు అభిమానులకు పిలుపునిస్తున్నారు. కానీ ఎవరు సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్నారు అనే విషయం తెలియాలి అంటే వచ్చే ఏడాది జనవరి వరకు ఎదురు చూడాల్సిందే.
