పొంగల్ ఫైట్.. ఈసారి హీరోలే కాదు ఈ భామలది కూడా
టాలీవుడ్ లో సంక్రాంతికి ఎప్పుడూ హెవీ కాంపిటీషనే. గతకొన్నేళ్లుగా ఇది మరీ ఎక్కువైంది. అయితే ఈసారి కాంపిటీషన్ లిమిటెడ్ గా ఉంటుందనుకుంటే అది కూడా అన్ లిమిటెడ్ అయ్యింది
By: M Prashanth | 12 Sept 2025 6:00 AM ISTటాలీవుడ్ లో సంక్రాంతికి ఎప్పుడూ హెవీ కాంపిటీషనే. గతకొన్నేళ్లుగా ఇది మరీ ఎక్కువైంది. అయితే ఈసారి కాంపిటీషన్ లిమిటెడ్ గా ఉంటుందనుకుంటే అది కూడా అన్ లిమిటెడ్ అయ్యింది. ఈ పొంగల్ కు చిరంజీవి, నవీన్ పోలిశెట్టి సినిమాలు ఇప్పటికే పండుగపై కన్నేస్తే, ప్రభాస్, శర్వానంద్, రవితేజ ఇటీవల జాయిన్ అయ్యారు. మరి హీరోల మధ్య ఈ కాంపిటీషన్ ఉంటే, హీరోయిన్స్ మధ్య ఉండదా? ఎందుకు ఉండదు కచ్చితంగా ఉంటుంది.
రాజాసాబ్ తో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ముందుగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జనవరి 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ ముగ్గురు కెరీర్స్ కు ఇది చాలా ఇంపార్టెంట్ సినిమా. వాళ్ల కెరీర్ కు ఇది సక్సెస్ అవ్వడం అవసరం. ఇక ఫ్యామిలీ ఆడియెన్స్ నాడి పట్టేసిన అనిల్ రావిపూడి ఈసారి మెగాస్టార్ చిరంజీవితో సినిమాతో వస్తున్నారు. మన శంకర వరప్రసాద్ సినిమాతో చిరు రానున్నారు. ఇందులో చిరుకు జోడీ నయనతార నటిస్తుంది.
ఇక మీనాక్షి చౌదరికి సంక్రాంతి సెంటిమెంట్ బాగానే కలిసొచ్చింది. సంక్రాంతికి వచ్చిన ప్రతిసారీ సక్సెస్ అందుకుంటుంది. గతేడాది సంక్రాంతికి గుంటూరు కారంతో, ఈసారి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి విజయాలు అందుకుంది. ఇక వచ్చే ఏఢాది నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజుకు సినిమాతో రానుంది. నారీ నారీ నడుమ మురారీ అనే శర్వానంద్ సినిమా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.
ఈ సినిమాలో సంయుక్త , సాక్షి వైద్య హీరోయిన్లు. పొంగల్ బరిలో ఈ ముద్దుగుమ్మలు కూడా దిగబోతున్నారు. వీరికి తోడు రవితేజ- కిషోర్ తిరుమల సినిమాలో లో ఆషికా రంగనాథ్ తో పాటు మరో హీరోయిన్ కూడా ఉంది. టాలీవుడ్ లోనే ఈ రేంజ్ పోటీ ఉంటే.. డబ్బింగ్ సినిమాలు జననాయగన్ పూజా, మమితా, కరుప్పుతో త్రిష, పరాశక్తి సినిమాలో శ్రీలీల వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా 2026 సంక్రాంతి హీరోలకే కాదు హీరోయిన్స్ కు కూడాపోటీ ఉండనుంది.
