Begin typing your search above and press return to search.

భ‌విష్య‌త్ లో టాలీవుడ్ ఎలా ఉండ‌బోతుంది?

టాలీవుడ్ ఇప్ప‌టికే భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌న్నింటిలో నెంబ‌ర్ వ‌న్ గా కొన‌సాగుతోంది. పాన్ ఇండియా విజ‌యాల‌తో తెలుగు సినిమా ఆ స్థానాన్ని ద‌క్కించుకుంద‌న్న‌ది కాద‌న‌లేని నిజం.

By:  Srikanth Kontham   |   18 Feb 2026 3:00 PM IST
భ‌విష్య‌త్ లో టాలీవుడ్ ఎలా ఉండ‌బోతుంది?
X

టాలీవుడ్ ఇప్ప‌టికే భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌న్నింటిలో నెంబ‌ర్ వ‌న్ గా కొన‌సాగుతోంది. పాన్ ఇండియా విజ‌యాల‌తో తెలుగు సినిమా ఆ స్థానాన్ని ద‌క్కించుకుంద‌న్న‌ది కాద‌న‌లేని నిజం. అంత‌క ముందు అదే స్థానంలో బాలీవుడ్ క‌నిపించేది. బాలీవుడ్ ని వెన‌క్కి నెట్టి టాలీవుడ్ ఆ స్థానంలో కూర్చుంది. బాలీవుడ్ ఎలాగైనా తిరిగి త‌మ స్థానాన్ని ద‌క్కించుకోవాల‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తోంది గానీ ఫ‌లించ‌డం లేదు. అయితే టాలీవుడ్ ను మించి బాలీవుడ్ ఎంతో అడ్వాన్స్ గా ముందుంటుంద‌న్న‌ది వాస్త‌వం. ఈ విష‌యంలో టాలీవుడ్ ఇంకా వెనుక‌బ‌డే ఉంది.

కానీ భ‌విష్య‌త్ లో సాంకేతికంగానూ బాలీవుడ్ ను టాలీవుడ్ బీట్ చేసే అవ‌కాశాలు లేక‌పోలేదు. టెక్నాల‌జీ విష యంలో టాలీవుడ్ ఎంతో మెరుగు ప‌డింది. కొత్త కొత్త టెక్నాల‌జీని అంది పుచ్చుకోవ‌డంలో మునుప‌టి కంటే మెరుగ్గా ఉంది. గ‌డిచిన కొన్నేళ్ల‌లో టాలీవుడ్ ఎంతో సాధించింది. ఒక‌ప్పుడు కేవ‌లం ప్రాంతీయ భాషా చిత్రాల‌కే ప‌రిత‌మైన టాలీవుడ్ నేడు గ్లోబల్ మార్కెట్‌ను శాసించే స్థాయికి చేరుకుంది. రాబోయే ఐదేళ్ల‌లో తెలుగు పరిశ్ర‌మ మ‌రిన్ని శిఖ‌రాల‌ను అధిరోహించ‌డం ఖాయం. టాలీవుడ్ లో గ్లోబ‌ల్ ప‌వ‌ర్ హాస్ గా టాలీవుడ్ ఎద‌గ‌బోతుంది.

అందుకు ప్ర‌ధానంగా ఓ న‌లుగురు హీరోలు కీల‌కంగా మారారు. ప్ర‌భాస్, మ‌హేష్‌, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, బ‌న్నీల‌తో ఇది సాధ్య‌మ‌వుతుంది. మ‌హేష్ న‌టిస్తోన్న 'వార‌ణాసి'ని ఏకంగా 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంత‌వ‌ర‌కూ ఏ ఇండియ‌న్ సినిమా ఇన్నిదేశాల్లో రిలీజ్ అవ్వ‌లేదు. ఆ ర‌కంగా ముందే రికార్డు క్రియేట్ చేసింది వార‌ణాసి.

దీంతో తెలుగు సినిమా మార్కెట్ అమెరికా, జపాన్ దాటి చైనా , యూరోపియన్ దేశాలకు కూడా విస్తరించ బోతోంద‌న్న‌ది క్లియ‌ర్. హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు అంతే ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్నాయి.

సినిమాటిక్ యూనివ‌ర్శ్ ట్రెండ్ కూడా టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే మొద‌ల‌వుతుంది. సీక్వెల్స్, ప్రాంంచైజీలు కూడా తెర‌కెక్కించ‌డానికి మేక‌ర్స్ రెడీ అవుతున్నారు. రానున్న రెండేళ్ల కాలంలో ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఒక్క సినిమాతో కథ ముగించ‌కుండా ఒకే కథలో అనేక పాత్రలను కలిపే యూనివర్స్ ల‌కు మేక‌ర్స్ ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇప్ప‌టికే పీవీయూసీ ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చేసింది. లోకేష్ క‌న‌గ‌రాజ్ పేరిట కూడా యూనివ‌ర్శ్ ఉంది. అందులో తెలుగు హీరోలు భాగ‌స్వామ్యం అయ్యే అవ‌కాశాలున్నాయి. సాంకేతిక విప్ల‌వం..ఏఐ వంటి టెక్నాల‌జీని విస్తృతంగా వినియోగించ‌నున్నారు.

షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లాల్సిన పని లేకుండా వర్చువల్ ప్రొడక్షన్ వినియోగం పెరుగుతోంది. స్క్రిప్ట్ అనలిటిక్స్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఏఐ వినియోగం పెరగడం వల్ల తక్కువ సమయంలో భారీ విజువల్స్ ఉన్న సినిమాలకు అవ‌కాశం ఉంది. మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల హ‌వా మ‌రింత పెర‌గ‌నుంది. కేవ‌లం తెలుగు స్టార్ హీరోలే కాకుండా ఇత‌ర భాష‌ల న‌టుల‌తో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఓటీటీకి ఆద‌ర‌ణ పెరుగుతోన్న నేప‌థ్యంలో వెబ్ సిరీస్ లు..డాక్యుమెంట‌రీల్లో చాలా మంది స్టార్లు న‌టించే అవ‌కాశం ఉంది.

వీటిపై ఇంత వ‌ర‌కూ సౌత్ స్టార్ హీరో లెవ‌రు పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేదు. కానీ ఇక ఆల‌స్యం చేసే ఛాన్స్ లేదు. పెరుగుతోన్న ఓటీటీ వినియోగంతో? వీలైనంత త‌ర్వాగా సీనియ‌ర్ హీరోలు కూడా ఎంట‌ర్ అవ్వ‌డానికి సిద్ద ప‌డుతున్నారు. నిర్మాణ వ్య‌యం పెరిగిపోతుంది. ప్రేక్షకులు కొత్త తరహా కథలను, కొత్త నటీనటులను ఆదరించడం ఇంకా పెరుగుతుంది. స్టూడియో సిస్టమ్ మరియు కార్పొరేట్ పెట్టుబడులు పెరుగుతాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ వంటి అంతర్జాతీయ సంస్థలు నేరుగా తెలుగులో సినిమాలు నిర్మించడానికి ముందుకు వస్తున్నాయి. దీంతో నిర్మాణ విలువలు పెరగడమే కాకుండా, టాలీవుడ్ పక్కా ప్రొఫెషనల్ ఇండస్ట్రీగా మారుతుంది.