Begin typing your search above and press return to search.

టాలీవుడ్ స్టార్లు రిలీజ్ కోసం భ‌లే ప్లాన్ వేశారే!

టాలీవుడ్ లో ఈ మ‌ధ్య అలా ఎక్కువసార్లు వాయిదా ప‌డిన సినిమాల్లో విశ్వంభ‌ర ఒక‌టి. చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా వాస్త‌వానికైతే ఈ పాటికే రిలీజ‌వాల్సింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   4 Sept 2025 10:00 PM IST
టాలీవుడ్ స్టార్లు రిలీజ్ కోసం భ‌లే ప్లాన్ వేశారే!
X

ఇండ‌స్ట్రీ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో రిలీజ్ డేట్ ప్రాబ్ల‌మ్ కూడా ఒక‌టి. అనౌన్స్‌మెంట్ తో పాటే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయ‌డం, మ‌ధ్య‌లో ఏదొక కార‌ణంతో షూటింగ్ లేట‌వ‌డం, త‌ద్వారా సినిమా చెప్పిన రిలీజ్ డేట్ టార్గెట్ ను అందుకోలేక‌పోవ‌డంతో వాయిదాలు ప‌డాల్సి వ‌స్తుంది. ఆల్రెడీ ముందు ఒక డేట్ ను అనౌన్స్ చేయ‌డంతో ఆ డేట్ లో వేరే సినిమాల‌ను రిలీజ్ అవ‌వు.

స‌డెన్ గా స్లాట్ ఖాళీ అయినా స‌రే స‌రైన ప్ర‌మోష‌న్స్ లేకుండా ఒక్క‌సారిగా త‌మ సినిమాల‌ను రిలీజ్ చేయాల‌ని ఏ నిర్మాత‌లు అనుకోరు. వాయిదా ప‌డిన సినిమా మ‌రో రిలీజ్ డేట్ ను వెతుక్కోవాల్సి రావ‌డం, అప్ప‌టికే ప‌లు సినిమాలు ఫిక్స్ చేసుకున్న రిలీజ్ డేట్ కు త‌మ సినిమాను కూడా రిలీజ్ చేస్తామ‌ని చెప్ప‌డంతో చిన్న సినిమాల‌కు ఇదొక పెద్ద స‌మ‌స్య‌గా మారింది.

ఏప్రిల్ లో విశ్వంభ‌ర‌

టాలీవుడ్ లో ఈ మ‌ధ్య అలా ఎక్కువసార్లు వాయిదా ప‌డిన సినిమాల్లో విశ్వంభ‌ర ఒక‌టి. చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా వాస్త‌వానికైతే ఈ పాటికే రిలీజ‌వాల్సింది. కానీ షూటింగ్ ఆల‌స్యమ‌వ‌డం, వీఎఫ్ఎక్స్ వ‌ర్క్స్ వ‌ల్ల విశ్వంభ‌ర ప‌లుమార్లు వాయిదా ప‌డింది. రీసెంట్ గా త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా రిలీజైన వీడియోలో ఈ సినిమా నెక్ట్స్ ఇయ‌ర్ వ‌స్తుంద‌ని చిరూ హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే విశ్వంభ‌రను చిత్ర నిర్మాతలు వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 30 అంటే స‌మ్మ‌ర్ హాలిడేస్ మొద‌లైపోతాయి కాబ‌ట్టి త‌మ సినిమాను పిల్ల‌లు, పెద్ద‌లు అంతా క‌లిసి చూసే వీలుంటుందని మేక‌ర్స్ ఈ ప్లాన్ చేశార‌ని స‌మాచారం.

ఆగ‌స్ట్ 13న ఫౌజీ

ఇక ప్ర‌భాస్ హీరోగా సీతారామ‌మ్ ఫేమ్ హ‌ను రాఘ‌వపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఫౌజీ సినిమా కూడా వ‌చ్చే ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. పీరియాడిక‌ల్ వార్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్ర‌భాస్ బ్రిటీష్ ఆర్మీ సోల్జ‌ర్ గా క‌నిపించ‌నున్నారని టాక్. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ఇమాన్వీ ఇస్మాయెల్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, ఈ సినిమాను 2026 ఆగ‌స్ట్ 13న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఈ వార్త‌ల్లో నిజ‌మెంతన్న‌ది చూడాలి. ఒక‌వేళ ఈ న్యూస్ నిజ‌మైతే మాత్రం విశ్వంభ‌ర‌కు స‌మ్మ‌ర్ హాలిడేస్, ఫౌజీకి ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ చాలా ఉప‌యోగ‌ప‌డే అవ‌కాశ‌ముంది.