శ్రీలీల స్టేట్ లెవల్ ప్లేయర్ తెలుసా...!
తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌లో ఆఫర్లు రావడమే గగనం అనుకుంటున్న సమయంలో శ్రీలీల ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చేరింది.
By: Ramesh Palla | 28 Oct 2025 11:00 PM ISTతెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌లో ఆఫర్లు రావడమే గగనం అనుకుంటున్న సమయంలో శ్రీలీల ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చేరింది. టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటూ సినిమాలు చేస్తున్న హీరోయిన్స్ జాబితాలో శ్రీలీల ముందు వరుసలో ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్న కారణంగా బిజీ బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉన్నా తాను నటించిన సినిమా ప్రమోషన్ కోసం శ్రీలీల సాధ్యం అయినంత ఎక్కువ సమయంను కేటాయించడం మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. తాజాగా శ్రీలీల మాస్ మహారాజా రవితేజతో నటించిన 'మాస్ జాతర' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. గత కొన్ని రోజులుగా రెగ్యులర్ ఇంటర్వ్యూలు ఇస్తూ, మీడియాతో ఇంట్రాక్షన్ తో శ్రీలీల బిజీ బిజీగా ఉంది.
శ్రీలీల స్టేట్ లెవల్ హాకీ ప్లేయర్
తాజాగా ఒక మీడియా సమావేశంలో శ్రీలీల నుంచి పలు ఆసక్తికర వ్యాఖ్యలు వినడం జరిగింది. అదే సమయంలో తనపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంకు, ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌ను తాను పట్టించుకోను అంది. తాను స్టేట్ లెవల్ హాకీ ప్లేయర్‌ని అని, అందుకే తాను విజయాలతో పాటు అపజయాలను అంగీకరించడం బాగా తెలుసు. అంతే కాకుండా తనపై విమర్శలు చేసిన సమయంలో ఎలా స్పందించాలి, వాటిని ఎలా తీసుకోవాలో కూడా బాగా తెలుసు అన్నట్లుగా పేర్కొంది. భారత జాతీయ క్రీడ అయిన హాకీ లో స్టేట్ ప్లేయర్‌ను అంటూ శ్రీలీల చేసిన వ్యాఖ్యలు అందరినీ సర్‌ప్రైజ్‌కి గురి చేశాయి. ఆమె చిన్నప్పటి నుంచి సినిమాల్లో కనిపించాలనే అనుకునేది, చిన్నప్పుడు ఒక సినిమాలోనూ నటించింది. ఒక వైపు చదువు, మరో వైపు హకీ లో ఎలా రాణించావు అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
పాన్ ఇండియా గుర్తింపు దక్కించుకున్న శ్రీలీల
హాకీ లో స్టేట్ లెవల్ టీంలో ఆడటం అంటే మామూలు విషయం కాదు. ఇండియాలో హాకీకి ఉన్న గుర్తింపు గౌరవం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి హాకీ ప్లేయర్ శ్రీలీల అని తెలిసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చూడ్డానికి సన్నగా నాజూకుగా ఉన్న శ్రీలీల హాకీ గేమ్ లో ఏ ప్లేస్ లో ఆడి ఉంటుందో అనే లెక్కలు వేస్తున్నారు. అంతే కాకుండా కొందరు శ్రీలీల హాకీ వీడియోలు ఏమైనా ఉన్నాయా అంటూ సోషల్ మీడియాలో, ఇంటర్నెట్‌లో వెతకడం మొదలు పెట్టారు. మొత్తానికి హాకీ లో రాష్ట్ర స్థాయి వరకు ఆడియన శ్రీలీల ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలతో దంచి కొడుతోంది. ఆమె వేసిన గోల్స్ అన్ని సినిమాల విజయాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాయి. హాకీ ఆడకుండా సినిమా ఇండస్ట్రీకి రావడం శ్రీలీల తీసుకున్న మంచి నిర్ణయం అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.
రవితేజ మాస్ జాతర సినిమాలో శ్రీలీల
ఇక బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్న శ్రీలీల అక్కడి పరిస్థితుల గురించి ప్రశ్నించిన సమయంలో టాలీవుడ్, బాలీవుడ్‌కి పెద్దగా తేడా ఏమీ ఉండదని, భాష ఒక్కటే తేడా తప్ప మిగిలిన అన్ని విషయాలు కామన్‌గానే ఉంటాయని సేఫ్ ఆన్సర్ చెప్పింది. భాష తేడా ఉన్నా సీన్స్, ఎమోషన్స్ సేమ్‌గా ఉంటాయి కనుక నటించడం ఇబ్బంది కాలేదు అంది. అంతే కాకుండా ఎవరో ఒకరు ఇద్దరు చేస్తున్న ట్రోల్స్‌ను చూసి బాధ పడితే మనని అభిమానించే ఎంతో మందిని ఇగ్నోర్ చేసినట్లు అవుతుంది కదా అంటూ శ్రీలీల చాలా మెచ్యూర్డ్‌గా సమాధానం చెప్పింది.
ఎప్పుడూ తాను ట్రోల్స్‌ను మైండ్‌లోకి తీసుకోను అని, ప్రశంసలను, తనకు పాజిటివ్‌గా ఉన్న కామెంట్స్‌ను మాత్రమే పట్టించుకుంటాను అంటూ చెప్పకనే చెప్పింది. శ్రీలీల ఇంతకు ముందే రవితేజతో ధమాకా సినిమాతో వచ్చి హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమాతో రాబోతున్న నేపథ్యంలో ఫలితంపై ఆసక్తి నెలకొంది. రవితేజ, శ్రీలీల కాంబోలో మరో హిట్ మూవీ పడబోతుందని నిర్మాత నాగవంశీ చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు.
