అలాంటి వాళ్లపై వేటు తప్పదా!
కొన్ని గంటల క్రితమే బాలీవుడ్ నటుడు కొంత మంది హీరోల తీరును ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 30 Oct 2025 1:00 AM ISTసెట్స్ కు హీరోయిన్లు.. నటీనటులు ఆలస్యంగా రావడం...కొన్నిసార్లు ఢుమ్మా కొట్టడం అన్నది తెరపైకి వస్తుంటుంది. నటీ నటులకు తమకంటూ కొంత ఇమేజ్ ఏర్పడిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు అప్పుడప్పుడు ఎదురవుతుంటాయని దర్శక, నిర్మాతలు చెబుతుంటారు. ఒక ఆర్టిస్ట్ సెట్స్ కు అనుకున్న టైమ్ లో హాజరు కాకపోతే నిర్మాతకు వచ్చే నష్టం మాటల్లో చెప్పలేనిది. ముఖ్యంగా కీలకమైన నటులు ఢుమ్మా కొడితే? ఆ రోజంతా వృద్ధాగా పోయినట్లే. పెరిగిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తో నిర్మాతలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారన్నది వాళ్లకే తెలుసు.
అన్ని పరిశ్రమల్లో ఉన్న సమస్యే అయినా? ప్రముఖంగా భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే టాలీవుడ్..కోలీవుడ్ పరిశ్రమలో మాత్రం ఇలాంటి సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. టాలీవుడ్ లో కొంత మంది స్టార్ హీరోలు ఇచ్చిన డేట్లు ప్రకారం షూటింగ్ కి హాజరు కారు? అన్న ఆరోపణ చాలా కాలంగా ఉంది. వారు సెట్స్ కు వచ్చినప్పుడే షూటింగ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయని నిర్మాతలు చెబుతుంటారు. అలాంటి వాళ్లను తాము కూడా ఏమీ అనలేమని..వాళ్లను చూసి కాస్తో కూస్తో పేరొచ్చిన నటీనటులు కూడా అలా చేయడం పరిపాటిగా మారిందన్నది చాలా కాలంగా ఉన్న ప్రధాన ఆరోపణ.
కొన్ని గంటల క్రితమే బాలీవుడ్ నటుడు కొంత మంది హీరోల తీరును ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో టాలీవుడ్లో కొంత మంది యంగ్ హీరోలు కూడా ఇలాంటి ఢుమ్మాలకు అలవాటు పడుతు న్నారని తాజాగా మరోసారి ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. ఆమధ్య ఓయంగ్ హీరోతో ఓ యువ నిర్మాత సినిమా మొదలు పెడితే ఇలాంటి సన్నివేశమే ఎదురైందని గుర్తు చేసుకున్నాడు. షెడ్యూల్ ప్రకారం ఆ రోజంతా వయువ హీరోతో షూటింగ్ చేయాలిట.
కానీ ఎంతకూ హాజరు కాకపోవడంతో నిర్మాతే ఫోన్ చేసి ఇంకా రాలేందటని అడిగితే తనకు పని ఉందని...ఈరోజుకు రాలేనని...మిగతా నటీనటులపై షూటింగ్ చేసుకోవాల్సిందిగా సెలవిచ్చాడుట. నిర్మాత ఫోన్ చేసి అడిగితే గానీ ఫోన్ చేసి విషయం చెప్పాలి? అన్న జ్ఞానం కూడా లేకుండా ఉన్నాడని సదరు నిర్మాత తన బాధను విన్న వించు కున్నాడు. ఇలాంటి వాళ్లు ఇంకా చాలా మంది ఉన్నా రని..సినిమాల్లో కీలక పాత్రలు పోషించే వారితో ఈ రకమైన సమస్యలు తరుచూ ఎదుర్కుంటున్నామని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో చిన్న నిర్మాతలంతా అలాంటి వారిపై నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేసి కఠిన చర్యలు దిశగా అడుగులు వేస్తున్నట్లు లీక్ చేసారు. అలా ఢుమ్మా కొట్టే వారిపై ఆధారపడాల్సిన అవసరం తమకు ఉండదని చెప్పాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ఆయన మాటల్లో అర్దమైంది.
