ఒకప్పుడు నార్త్.. ఇప్పుడు మనమే మెయిన్?
ఒకప్పుడు సినిమా అనౌన్స్మెంట్ అంటే చాలు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా మొదలయ్యేది.
By: M Prashanth | 31 July 2026 1:59 PM ISTఒకప్పుడు సినిమా అనౌన్స్మెంట్ అంటే చాలు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా మొదలయ్యేది. ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ టీజర్, పాన్ ఇండియా ట్యాగ్, పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ ప్లాన్స్.. ఇలా భారీ ప్రమోషన్స్ తో సినిమాలపై ఆడియన్స్ లో అంచనాలు పెంచడం సాధారణంగా మారిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోందా? ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అలానే అనిపిస్తోంది.
గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా మార్కెట్ భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో కూడా సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. దీంతో చాలా మంది మేకర్స్ మొదటి నుంచే పాన్ ఇండియా ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ప్లాన్స్ ను రూపొందించారు. అయితే ఇటీవల ప్రేక్షకుల టేస్టుల్లో వచ్చిన మార్పులు సినీ ఇండస్ట్రీని కొత్తగా ఆలోచించేలా చేస్తున్నాయి.
ప్రస్తుతం ఆడియన్స్ భారీ ప్రమోషన్స్ కంటే మంచి కంటెంట్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని అంతా చెబుతున్నారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవడం లేదు. అదే సమయంలో పెద్దగా హడావుడి లేకుండా వచ్చిన కొన్ని చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి రిజల్ట్స్ అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
దీంతో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇప్పుడు తమ ప్లాన్స్ ను ఇప్పుడు మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో సినిమా ప్రారంభమైన రోజే వరుస అప్డేట్లు ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మాత్రం షూటింగ్ లో ఎక్కువ భాగం పూర్తయ్యే వరకు సైలెంట్ గా ఉండటానికి కొందరు మేకర్స్ ఆసక్తి చూపుతున్నారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు, నార్త్ మార్కెట్ పై కూడా పూర్తిగా ఆధారపడటం కూడా అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన సినిమాలకు అన్ని ప్రాంతాల్లో ఒకేలాంటి రెస్పాన్స్ వస్తుందని ఎప్పుడూ ఎవరూ కూడా చెప్పలేం. లాంగ్వేజ్, కల్చర్, ప్రేక్షకుల టేస్ట్ ప్రాంతానికొకలా ఉండటంతో కొన్ని చిత్రాలు ఒక ప్రాంతంలో సక్సెస్ అయితే, మరో ఏరియాలో ఆశించిన స్థాయిలో ఎఫెక్ట్ చూపలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది మేకర్స్ మళ్లీ తమ కోర్ మార్కెట్ పై దృష్టి సారిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బలమైన పట్టు సాధించడం, ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడం, మంచి మౌత్ టాక్ సంపాదించడం వంటి అంశాలకు ఇంపార్టెన్స్ పెరుగుతోందని అంటున్నారు.
అలాగే, భారీ హైప్ తో వచ్చే సినిమాలపై ప్రేక్షకుల అంచనాలు కూడా అంతే రేంజ్ లో పెరుగుతున్నాయి. ఆ అంచనాలను అందుకోలేకపోతే నిరాశ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఏదేమైనా ఒకప్పుడు దేశవ్యాప్త మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్లిన మేకర్స్.. ఇప్పుడు తమ రీజనల్ మార్కెట్ ను మరింత స్ట్రాంగ్ గా మార్చడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. చివరికి ప్రేక్షకుడు థియేటర్ కు రావడానికి కారణం హైప్ కాదు.. ఆకట్టుకునే మంచి కథే అని మరోసారి క్లియర్ గా తెలుస్తోంది.
