సినిమాకిప్పుడు 'ఏ' సర్టిపికెట్ ఓ బ్రాండ్!
ఒకప్పటి సినిమాల్లో రొమాన్స్ అనేది ప్రధానంగా ఉండేది? కానీ ఇప్పటి కథల్లో రొమాన్స్ కి కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
By: Srikanth Kontham | 16 Dec 2025 3:00 PM ISTసినిమా అంటే నవరసాల సమ్మేళనం. శృంగారం, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానకం, భీభత్సం , అద్భు త, శాంతరసాలే ఏ కథకైనా ప్రామాణికం. వాటి ఆధారంగానే కథలు పుట్టేవి. అయితే నిబంధనలన్నీ తూచ తప్పకుండా పాటించాలని లేదు. కథ అవసరానికి తగ్గట్టు కొన్ని రకాల రసాలనే క్రోడీకరించుకుంటారు. మిగతా వాటిని వదిలేస్తున్నారు. తీసుకున్న పాయింట్ ఆధారంగా అవసరమైన రసాలతో అంతిమంగా ఓ కథను సిద్దం చేస్తున్నారు.
ఒకప్పటి సినిమాల్లో రొమాన్స్ అనేది ప్రధానంగా ఉండేది? కానీ ఇప్పటి కథల్లో రొమాన్స్ కి కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. యాక్షన్ సినిమాల పరంగా చూస్తే ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. యాక్షన్ కథల్లో వయోలెన్స్ అన్నది ఎంత తీవ్రంగా ఉంటే? సినిమాకు ఆ రేంజ్ లో హైప్ వస్తుంది? అన్నది కాదనలేని నిజం. సెన్సాన్ నుంచి `ఏ` సర్టిఫికెట్ వచ్చినా పర్వాలేదు కానీ తమ సినిమాలో సీన్లు మాత్రం కట్ చేయడానికి ఒప్పుకోవడం లేదు.
ఇంకా చెప్పాలంటే? `ఏ` సర్టిఫికెట్ వచ్చిన సినిమానే జనాల్లోకి ఇంకా బలంగా వెళ్తుంది. అందులో ఏదో ఉంది? అన్న ఆత్రుత అంతకంతకు ప్రేక్షకుల్లో రెట్టింపు అవుతుంది. ఒకప్పుడు `ఏ `సర్టిఫికెట్ అంటే ఓ సెక్షన్ ఆడియన్స్ దూరమవుతారనే భయం హీరో, దర్శక, నిర్మాతల్లో కనిపించేది. కానీ ఇప్పుడా భయాలెక్కడా? కనిపించలేదు. `ఏ` సర్టిఫికెట్ వస్తే ఇంకా మంచిందంటున్నారు. దీంతో . సినిమాకు `ఏ` సర్టిఫికెట్ అన్నది ఓ బ్రాండ్ గా మారిపోయింది.
`యానిమల్, ‘సలార్’, ‘హిట్ 3’, `మార్కో` లాంటి చిత్రాలు `ఏ` సర్టిఫై చిత్రాలే. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు సాధించిన ఘన విజయం తెలిసిందే. తాజాగా రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం `ధురంధర్` కూడా `ఏ` సర్టిపికెట్ తోనే రిలీజ్ అయింది. వాస్తవ సంఘటనలు ఆధారంగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పటికే 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇందులో అక్షయ్ ఖన్నా పాత్ర కృరత్వం ఎంత ధారుణంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
అవన్నీ ఒళ్లు గగుర్లు పొడిచే సన్నివేశాలే. కొన్ని సన్నివేశాలైతే కళ్లు మూసుకోవల్సిందే? అంతగా వయోలెన్స్ అన్నది కథల్లో హైలైట్ అవుతుంది. తాజాగా రిలీజ్ అయిన బాలయ్య `అఖండ 2` కోసం కొన్ని యాక్షన్ సన్నివేశాలు అదే రేంజ్ లో డిజైన్ చేసారు. బాలయ్య నుంచి రిలీజ్ అయిన తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో? దర్శకుడు బోయ పాటి ఎంత మాత్రం రాజీ పడలేదు. `ఏ` అనే బ్రాండ్ రానున్న సినిమాలకు మరింత బ్రాండ్ గానూ మారుతుంది? అనడంలో ఎలాంటి సందేహం లేదు.
