సత్తా చాటుతున్న యువ భామలు!
టాలీవుడ్ పరిశ్రమలో ప్రతిభకు కొదవ లేదు. మారుతున్న కాలంతో పాటు యువ నటీమణులు కూడా సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోతున్నారు.
By: Srikanth Kontham | 2 July 2026 8:30 AM ISTటాలీవుడ్ పరిశ్రమలో ప్రతిభకు కొదవ లేదు. మారుతున్న కాలంతో పాటు యువ నటీమణులు కూడా సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. కయాదు లోహర్, మమిత బైజు, ప్రీతి ముకుందన్ వంటి యువ భామలు నటనతో, గ్లామర్‌తో ప్రేక్షకులను అలరిస్తూ కెరీర్‌లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒకప్పుడు కొత్త హీరోయిన్లకు అవకాశాలు దక్కడం ఎంత కష్టమో? ఇప్పుడు వారికి అవకాశాల వరద పారడం అంతే ఆశ్చర్యకరంగా మారింది. ఈ జాబితాలో ముందుగా చెప్పుకో వాల్సింది కయాదు లోహర్ గురించి. నాని నటిస్తో భారీ చిత్రం `ది పారడైస్` లో అవకాశం దక్కించుకోవడం అమ్మడి కెరీర్‌లో పెద్ద మలుపు.
ఈ ప్రాజెక్టే కాకుండా కయాదు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. అమ్మడు స్క్రీన్ ప్రెజెన్స్‌తో, నటనలోని సహజత్వంతో దర్శకుల దృష్టిని ఆకర్షించడంలో సొగసరి సక్సెస్ అయ్యింది. రాబోయే కాలంలో ఈ భామ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్లడం ఖాయమని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మలయాళ చిత్ర పరిశ్రమ నుండి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మమిత బైజు కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. క్యూట్ లుక్స్, నటనలోని పరిణతితో తెలుగు , తమిళ భాషల్లో మంచి ప్రాజెక్ట్‌లను సొంతం చేసుకుంటోంది.
పాత్ర ఏదైనా అందులో? ఒదిగిపోవడానికి అమ్మడు చూపే ఆసక్తి వరుస అవకాశాలను తెచ్చిపెడుతోంది. మల్టీ-లింగ్యువల్ సినిమాల్లో మెరుస్తూ తనదైన మార్కును వేస్తోంది. ప్రీతి ముకుందన్ కూడా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవుతోంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథకు ప్రాముఖ్యత ఉన్న చిత్రాలను ఎంచుకోవడం కెరీర్‌కు బాగా కలిసొస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకున్న క్రేజ్ అంతకంతకు రెట్టింపు అవుతోంది. నటనతో దర్శకుల వద్ద నటిగా మంచి పేరు తెచ్చుకుంటోంది. దీంతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు సులభమవుతున్నాయి.
ఈ భామలు అందాల తారలుగానే కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రల వైపు మొగ్గు చూపడం విశేషం. పరిశ్రమలో ఒక స్థాయికి చేరుకోవాలంటే ? కేవలం గ్లామర్ ఉంటే సరిపోదని నటనలో వైవిధ్యం ఉండాలని యువ భామలు భావిస్తున్నారు. దీంతో ప్రయోగాలకు సిద్ధపడే కొత్త దర్శకులు వీరికి ప్రాధాన్య తనిస్తూ కథలను రాస్తున్నారు. ఇది యువ హీరోయిన్ల కెరీర్‌కు ఎంతో దోహదపడుతోంది.
మొత్తంగా టాలీవుడ్ భవిష్యత్తు యువ భామల చేతుల్లోనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. తమ అంకితభావం, నైపుణ్యంతో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ అగ్రస్థానాన్ని చేరుకోవడానికి సిద్ధమ వుతున్నారు. ఇలాంటి కొత్త టాలెంట్ వల్లే పరిశ్రమకు కొత్త కళ వస్తోంది. ప్రతిభ గల నటీమణులను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు . మరి ఈ కొత్త తరం భామలు ఏ స్థాయికి ఎదుగుతారో వేచి చూడాలి.
