Begin typing your search above and press return to search.

గ్యాంగ్‌స్టర్ల మధ్య.. పొలిటిక్స్‌కు మళ్లీ స్పేస్ దొరుకుతోందా?

టాలీవుడ్‌లో ఒక దశలో పొలిటికల్ డ్రామాలు బాగానే వచ్చాయి. తర్వాత మళ్లీ గ్యాంగ్‌స్టర్, క్రైమ్ వరల్డ్స్ వైపు ఫోకస్ పెరిగింది.

By:  M Prashanth   |   28 Aug 2026 10:55 AM IST
గ్యాంగ్‌స్టర్ల మధ్య.. పొలిటిక్స్‌కు మళ్లీ స్పేస్ దొరుకుతోందా?
X

టాలీవుడ్‌లో ఒక దశలో పొలిటికల్ డ్రామాలు బాగానే వచ్చాయి. తర్వాత మళ్లీ గ్యాంగ్‌స్టర్, క్రైమ్ వరల్డ్స్ వైపు ఫోకస్ పెరిగింది. హీరోను డాన్‌గా చూపించడం, మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో కథ నడపడం తరచుగా కనిపించింది. ఇప్పుడు రాజకీయ పవర్ గేమ్స్ కూడా మొదలయ్యాయి. విశ్వక్ సేన్ ‘లెగసీ’, శ్రీవాస్ ‘ఫీనిక్స్ రాజా’ వంటి సినిమాలు కూడా ఒకే ట్రాక్ లో వెళుతుండడం హైలెట్.

విశ్వక్ సేన్ ‘లెగసీ’ ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్‌లో ఉంది. మదనపల్లె పరిసరాల్లో నెల రోజుల షూట్‌తో సినిమాను పూర్తి చేసే ప్లాన్ ఉంది. ఇది పొలిటికల్ యాక్షన్ డ్రామా. పవర్, ఫ్యామిలీ, వారసత్వం, శత్రుత్వం చుట్టూ కథ నడుస్తుంది. తాను కోరుకోని రాజకీయ ప్రపంచంలోకి ఒక వారసుడు ఎలా రావాల్సి వచ్చింది అనేది లైన్‌తో కథ ఉంటుందట. కే కే మేనన్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని టీమ్ చూస్తోంది.

ఇక శ్రీవాస్ ‘ఫీనిక్స్ రాజా’ మాత్రం ఇంకో రూట్ తీసుకుంది. ఇందులో పొలిటిక్స్ ఒక్కటే కాదు. కార్పొరేట్ పవర్, డ్రగ్ నెట్‌వర్క్, సిస్టమ్, న్యాయం అన్నీ ఒకే కథలో కలుస్తున్నాయి. రాజకీయ అండను కాకుండా తన పద్ధతిలో ఎదిగిన ఓ వ్యాపారవేత్త చుట్టూ కథ మొదలవుతుంది. హీరో ఎవరు అనే విషయం ఇంకా బయటకు రాలేదు. కానీ మోషన్ టీజర్‌తోనే సినిమా ఏ ప్రపంచంలో నడవబోతోందో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.

అయితే ఈ రెండు చూసి టాలీవుడ్ మొత్తం మళ్లీ పొలిటికల్ కథల వైపు తిరిగిందని కాదు. ఎందుకంటే మరోవైపు గ్యాంగ్‌స్టర్, క్రైమ్ కథల లైన్ ఇంకా బలంగానే ఉంది. నాని, సుజీత్ ‘బ్లడీ రోమియో’లో హీరోను చెఫ్‌తో పాటు గ్యాంగ్‌స్టర్‌గా చూపిస్తున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ అయితే 1967 ఒపియం ట్రేడ్ చుట్టూ పెద్ద క్రైమ్ వరల్డ్‌ను సెట్ చేసింది. అంటే క్రైమ్ బ్యాక్‌డ్రాప్ ఇంకా తగ్గలేదు.

పాత పొలిటికల్ సినిమాల్లో ఎన్నికలు, పార్టీలు, సీఎం కుర్చీ చుట్టూ కథ తిరిగేది. ఇప్పుడు పవర్ అంటే రాజకీయ నాయకుడే కాదు. కార్పొరేట్ మనీ, డ్రగ్స్, ఫ్యామిలీ నెట్‌వర్క్, క్రిమినల్ సిస్టమ్ కూడా అదే కథలో భాగమవుతున్నాయి. హీరో నేరుగా రాజకీయ నాయకుడు కాకపోయినా, అతని పోరాటం చివరకు పవర్ సెంటర్స్ దగ్గరకు వెళ్లేలా కథలు తయారవుతున్నాయి.

‘లెగసీ’ క్లిక్ అయితే ఈ జానర్‌కు ఇంకోసారి హీరోల నుంచి స్పేస్ దొరకొచ్చు. అదే సమయంలో ‘బ్లడీ రోమియో’, ‘డ్రాగన్’ లాంటి సినిమాలు కూడా ముందున్నాయి. కాబట్టి రాబోయే నెలల్లో ఒకే ఫార్ములా కాకుండా రెండు దారులు కనిపించబోతున్నాయి. ఒకవైపు గ్యాంగ్‌స్టర్ ప్రపంచాలు, మరోవైపు రాజకీయ పవర్ గేమ్స్. వీటిలో ఏ రూట్ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువగా వర్కౌట్ అవుతుందో చూడాలి.