Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల ఎంట్రీ!

టాలీవుడ్‌లో ఉండే ప్రధాన సమస్యల్లో హీరోయిన్ల కొరత ఒకటి. ఒకరిద్దరు స్టార్ హీరోయిన్లు మినహా మిగిలిన వారి కోసం మేకర్స్ ఎప్పుడూ కొత్త ముఖాల కోసం వెతుకుతూనే ఉంటారు.

By:  Srikanth Kontham   |   16 Oct 2026 5:00 AM IST
టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల ఎంట్రీ!
X

టాలీవుడ్‌లో ఉండే ప్రధాన సమస్యల్లో హీరోయిన్ల కొరత ఒకటి. ఒకరిద్దరు స్టార్ హీరోయిన్లు మినహా మిగిలిన వారి కోసం మేకర్స్ ఎప్పుడూ కొత్త ముఖాల కోసం వెతుకుతూనే ఉంటారు. అయితే ఆ కొరతను తీర్చడానికి ఈసారి ఏకంగా ఓ రేంజ్‌లో యువ‌ భామలు.. సోషల్ మీడియా సెన్సేషన్లు తెలుగు తెరపైకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమ వుతున్నారు. వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో టాలీవుడ్‌లో సరికొత్త సందడి చేయడానికి కొత్త నటీమణుల రాక ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఛార్మింగ్ స్టార్ శ్రీకాంత్ కుమార్తె మేధా మేఖ `మైత్రీ ఇన్ లవ్` అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.

మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న చిత్రం ఇటీవ‌లే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మేథ కెమెరా ముందుకు రాక‌ముందే? రేర్ గా క‌నిపించే ఎయిర్ పోర్టు వీడియోల‌తో తో అల‌రించింది. అమ్మ‌డిలో హీరోయిన్ పీచ‌ర్స్ పుష్క‌లంగా ఉండ‌టంతో? లాంచింగ్ షురూ అయింది. మైత్రీ ఇన్ ల‌వ్ రిలీజ్ కు ముందే మేధ మ‌రిన్ని కొత్త ప్రాజెక్టులు అందుకునే అవ‌కాశం ఉంది. శ్రీకాంత్ ఇమేజ్ కూడా స్టార్ కిడ్ కు చాలా వ‌ర‌కూ క‌లిసొస్తుంది. మేథ స‌క్సెస్ అయితే న‌వ‌త‌రం హీరోల‌కు మంచి ఆప్ష‌న్ అవుతుంది. తెలుగింట అమ్మాయి అనే ట్యాగ్ కూడా కెరీర్ కి క‌లిసొస్తుంది.

అలాగే అచ్చ తెలుగు అమ్మాయిల సత్తా చాటేందుకు సాత్విక వీరవల్లి `ఆకాశంలో ఒకతార` సినిమాతో నటిగా పరిచయం అవుతోంది. అమ్మ‌డు త‌మిళ న‌టి అయినా? తెలుగింట ఆడ‌ప‌డుచులా ఆక‌ట్టుకుంటుంది. ఆ ఇమేజ్ సొగ‌స‌రికి ప్ల‌స్ అవుతుంది. గ్లామర్‌తో పాటు అభినయానికి ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రంతో సాత్విక తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. అలాగే సోషల్ మీడియా సెన్సేషన్లు కూడా టాలీవుడ్ బాట పట్టడం విశేషం.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఇమాన్వి ఇస్మాయిల్ రెబల్ స్టార్ ప్రభాస్ న‌టిస్తోన్న‌ భారీ పీరియాడికల్ చిత్రం `ఫౌజీ`తో తెలుగు తెరకి పరిచయం అవుతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న‌ చిత్రంలో హీరోయిన్ గా లాంచ్ అవ్వ‌డం కెరీర్‌కు బిగ్ లాంఛ్ ప్యాడ్ కానుంది. మరో క్రేజీ బ్యూటీ త్రిప్తీ డిమ్రీ. ఈ అమ్మ‌డు `స్పిరిట్` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతుంది.

`యానిమల్` చిత్రంతో నేషనల్ వైడ్‌గా ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న తృప్తి దిమ్రి రేంజ్ ని పెంచే చిత్రంగా స్పిరిట్ ఇప్ప‌టికే హైలైట్ అవుతుంది. నిజంగా సినిమా హిట్ అయితే? హీరోలే అమ్మ‌డి కోసం క్యూలో ఉంటారేమో. మ‌రిన్ని పాన్ ఇండియా సినిమాల్లో త్రిప్తీ మెరుపులు ఖాయం. వీళ్లంతా స‌క్సెస్ అయితే టాలీవుడ్ కు కొంతైనా హీరోయిన్ల కొర‌త తీరుతుంది. కొంత కాలంగా ముంబై బ్యూటీల‌ను ప‌క్క‌న‌బెట్టి సౌత్ మోడ‌ల్స్ కే ప్రాధాన్య‌త ఇస్తోన్న మేక‌ర్స్ కి యువ భామ‌లంతా మంచి ఆప్ష‌న్ అవుతారు.