Begin typing your search above and press return to search.

ఇలాగే కంటిన్యూ అయితే.. ఇక తిరుగేలేదేమో..!

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, కమర్షియల్ ఫార్ములాలే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మెల్లమెల్లగా మారుతోంది.

By:  M Prashanth   |   12 July 2026 12:00 AM IST
ఇలాగే కంటిన్యూ అయితే.. ఇక తిరుగేలేదేమో..!
X

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, కమర్షియల్ ఫార్ములాలే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మెల్లమెల్లగా మారుతోంది. గత కొన్ని వారాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలను అబ్జర్వ్ చేస్తే.. కొత్త కథలు, విభిన్నమైన ఆలోచనలు, ప్రయోగాత్మక స్టోరీలు ప్రేక్షకులు పెద్దపీట వేస్తున్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. ఇలాగే కొనసాగితే టాలీవుడ్ మరో రేంజ్ కు చేరుకోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇటీవలి కాలంలో విడుదలవుతున్న చిత్రాల్లో కథే మెయిన్ స్ట్రెంగ్త్ గా నిలుస్తోంది. హీరో ఇమేజ్ కంటే కథలో ఫ్రెష్ నెస్, పాత్రల బలం, ప్రేక్షకులను ఆకట్టుకునే కథనం ఉంటే చాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. అందుకే విభిన్నమైన కథాంశాలతో తెరకెక్కుతున్న సినిమాలు కూడా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ పొందుతున్నాయి. ఒకవైపు పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటే.. మరోవైపు కంటెంట్ బేస్డ్ చిత్రాలు కూడా తమదైన ముద్ర వేస్తున్నాయి.

అలా రెండు తరహా సినిమాలకు ఈక్వల్ గా రెస్పాన్స్ లభించడంతో ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ నెలకొంది. ఇది నిర్మాతలు, దర్శకులకు కూడా కొత్త కథలపై పెట్టుబడులు పెట్టే ధైర్యాన్ని ఇస్తోంది. గతంలో కొత్త కాన్సెప్ట్లతో వచ్చిన సినిమాలకు పరిమిత స్థాయిలో మాత్రమే ఆదరణ లభించేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకులు కథ బాగుంటే చిన్న సినిమా అయినా పెద్ద ఎత్తున థియేటర్‌ కు వెళ్లి చూస్తున్నారు.

అదే సమయంలో భారీ అంచనాలతో వచ్చిన సినిమా అయినా కథలో బలం లేకపోతే సింపుల్ గా రిజెక్ట్ చేస్తున్నారు. ఆ చేంజ్ తెలుగు ప్రేక్షకుల టేస్ట్ ఎంతగా ఎదిగిందో క్లియర్ గా చెబుతోంది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా ప్రేక్షకుల అభిరుచిలో మార్పుకు ఒక కారణంగా చెప్పవచ్చు. వర్క్ వైడ్ గా వివిధ భాషల సినిమాలు, వెబ్ సిరీస్‌ లు చూసిన ప్రేక్షకులు ఇప్పుడు కొత్తదనాన్ని ఆశిస్తున్నారు. అదే తరహాలో తెలుగు దర్శకులు కూడా భిన్నమైన కథలతో ముందుకు వస్తుండటం పరిశ్రమకు కొత్త జోష్ ను తీసుకొస్తోంది.

ఆ మార్పుతో కొత్త దర్శకులు, రచయితలు, యువ నటీనటులకు కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. ఒక మంచి కథ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం టాలీవుడ్ లో బలపడుతోంది. దీంతో ఒకే తరహా కథలకు పరిమితం కాకుండా విభిన్నమైన కథాంశాలను ఎంచుకునే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. అయితే తెలుగు సినిమా బలం ఎప్పుడూ వైవిధ్యమే.

కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కొనసాగిస్తూనే, కొత్త కథలకు కూడా ప్రాధాన్యం ఇస్తే సినీ ఇండస్ట్రీ మరింత స్ట్రాంగ్ గా మారుతుంది. ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టే కథలు వస్తూనే ఉంటే తెలుగు సినిమా మార్కెట్ మరింత పెరగడమే కాకుండా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ లో కూడా తన ప్రత్యేక గుర్తింపును మరింత చాటుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ప్రస్తుతం కనిపిస్తున్న మార్పు ఇలాగే కొనసాగితే టాలీవుడ్‌ కు ఇక తిరుగుండదనే అభిప్రాయం వినిపిస్తోంది.