Begin typing your search above and press return to search.

కీరవాణి అక్కడ చెక్ పెడితే.. ఇక్కడ ఆయనకే

ఇండియాలోనే అత్యుత్తమ సంగీత దర్శకుల్లో కీరవాణి ఒకరు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన తెలుగు సినిమా సంగీతంపై తనదైన ముద్రను వేస్తూనే ఉన్నారు.

By:  Garuda Media   |   6 May 2026 4:00 PM IST
కీరవాణి అక్కడ చెక్ పెడితే.. ఇక్కడ ఆయనకే
X

ఇండియాలోనే అత్యుత్తమ సంగీత దర్శకుల్లో కీరవాణి ఒకరు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన తెలుగు సినిమా సంగీతంపై తనదైన ముద్రను వేస్తూనే ఉన్నారు. తమిళ, హిందీ భాషల్లోనూ కీరవాణికి మంచి పేరే ఉంది. సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసి 36 ఏళ్లు పూర్తి కావస్తుండగా.. ఇప్పటికీ ఇండియాలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతుండడం కీరవాణి ప్రత్యేకత. పాటల విషయంలోనే కాక నేపథ్య సంగీతంలోనూ కీరవాణి ప్రత్యేకత ఎలాంటిదో రాజమౌళి సినిమాలను చూస్తే అర్థమవుతుంది.

కీరవాణిలా ఇంటెన్స్ బీజీఎం అందించే మ్యూజిక్ డైరెక్టర్లు అరుదు. కానీ అలాంటి సంగీత దర్శకుడి స్థానంలో వేరొకరిని నేపథ్య సంగీతం కోసం పెట్టుకున్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఐతే ‘విశ్వంభర’ టీం ఇదే పని చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో కీరవాణిని పాటలకే వరకే పరిమితం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజీఎం కోసం ఆయన బదులు యువ సంగీత దర్శకుడు హరి గౌరను తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘హనుమాన్’, ‘మిరాయ్’ చిత్రాలతో హరి గౌర సంగీత దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ రెండు చిత్రాల్లో బీజీఎం విషయంలో సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఈ తరం సంగీత దర్శకుల్లో మైథలాజికల్, ఫాంటసీ టచ్ ఉన్న చిత్రాలకు హరి కంటే బాగా ఎవరూ బీజీఎం చేయలేరన్న పేరొచ్చింది. ఈ నేపథ్యంలో ‘విశ్వంభర’కు కూడా హరితోనే నేపథ్య సంగీతం చేయించుకోవాలని టీం నిర్ణయించుకుందని అంటున్నారు. ఐతే ఇంతకుముందు కీరవాణి.. ఓ సినిమా విషయంలో హరి గౌరను రీప్లేస్ చేశారు.

‘హనుమాన్’ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన హరిని కాదని.. ‘జై హనుమాన్’ కోసం కీరవాణిని తీసుకున్నాడు ప్రశాంత్ వర్మ. ‘హనుమాన్’ చిత్రానికి తాను 90 శాతం పని చేస్తే.. క్రెడిట్ మాత్రం వేరే వాళ్లతో కలిసి పంచుకోవాల్సి వచ్చిందని ‘మిరాయ్’ రిలీజ్ టైంలో హరి గౌర కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మాటలకు నొచ్చుకున్న ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ కోసం అతణ్ని కాదని కీరవాణిని ఎంచుకున్నాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఐతే అక్కడ తనను రీప్లేస్ చేసిన కీరవాణిని.. ‘విశ్వంభర’లో హరి రీప్లేస్ చేస్తుండడంతో లెక్క సరిపోయినట్లయింది.