Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల హోరాహోరీ పోటీ !

పాన్-ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ లీడింగ్ కంపోజర్లు అందిస్తున్న సరికొత్త ట్యూన్లు, బీట్లు థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయి.

By:  Srikanth Kontham   |   22 May 2026 4:00 AM IST
టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల హోరాహోరీ పోటీ !
X

ప్రస్తుతం సౌత్ పరిశ్రమలో కంటెంట్‌తో పాటు సంగీతానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలన్నా? విడుదలకు ముందే భారీ క్రేజ్ సొంతం చేసుకోవాలన్నా? బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ , సాంగ్స్ అత్యంత కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. పాన్-ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ లీడింగ్ కంపోజర్లు అందిస్తున్న సరికొత్త ట్యూన్లు, బీట్లు థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా సాగుతున్న పోటీ ఇండస్ట్రీలో సరికొత్త సంచలనాలకు వేదికవుతోంది.

ఈ మ్యూజికల్ రేసులో టాలీవుడ్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ జోరు మీదున్నారు. తన మార్క్ మాస్ బీట్లతో, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో వరుస ఆఫర్లను దక్కించు కుంటున్నారు. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రానికి తమనే మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో మెగా అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలలో ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బీజీఎమ్ లో స్పెష‌లిస్ట్ కావ‌డంతో త‌మ‌న్ ప్ర‌త్యేకంగా రిక్రూట్ చేసుకుంటోన్న మేక‌ర్స్ ఎంతో మంది ఉన్నారు. కోలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు పాన్-ఇండియా యూత్‌లో రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ క్రేజ్ మారుమోగుతోంది.

ట్రెండీ వెస్ట్రన్ బీట్లు, ఎలక్ట్రిఫైయింగ్ బీజీఎమ్‌లతో అనిరుధ్ ఓ సరికొత్త వేవ్‌ను క్రియేట్ చేశారు. యువతను లూప్‌లో పడేసే మెలోడీలు, థియేటర్లను ఊపేసే మాస్ ఎలివేషన్ స్కోర్ ఇవ్వడంలో అనిరుధ్ స్టైలే వేరు. తెలుగులో కూడా అగ్ర హీరోల చిత్రాలకు సైన్ చేస్తూ టాలీవుడ్ బాక్సాఫీస్ మార్కెట్‌ను తన వైపు తిప్పుకుంటూ తమన్‌కు గట్టి పోటీని ఇస్తున్నారు. ఈ ఇద్దరు అగ్ర కంపోజర్ల పోటీ మధ్య `ఆడతా తా తా` వంటి ఇండస్ట్రీ హిట్స్ అందించిన యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సరికొత్త , వైవిధ్యమైన బీట్లతో సౌత్‌లో సంచలనం సృష్టిస్తున్నారు. క్లాస్ - మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా సరికొత్త ప్రయోగాలు చేస్తూ రీసెంట్ టైమ్స్ లో హాట్ టాపిక్‌గా మారారు.

ఇక రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత ప్రయాణాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూనే మరోవైపు నటుడిగా సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. నటన వైపు అడుగులు వేస్తున్నా? తన మార్క్ మ్యూజిక్‌తో సత్తా చాటుతూనే ఉన్నారు. వీరందరి పోటీ ఇలా ఉంటే? ఆస్కార్ అవార్డు గ్రహీత, లెజెండరీ కంపోజర్ ఏ.ఆర్. రెహమాన్ కూడా టాలీవుడ్‌లో కంబ్యాక్ ఇవ్వడానికి పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ డ్రామా `పెద్ది`కు రెహమాన్ అందిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ కథ కోసం తన మార్క్ రూటెడ్ మెలోడీలు - మ్యాజికల్ వైబ్‌తో టాలీవుడ్‌లో గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండటం విశేషం.

టాలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య సాగుతున్న ఈ హెల్తీ కాంపిటీషన్ అంతిమంగా తెలుగు సినిమా స్థాయిని పెంచుతోంది. తమన్ మాస్ పల్స్, అనిరుధ్ యూత్ క్రేజ్, సాయి అభ్యంకర్ ఫ్రెష్ ట్యూన్స్, దేవిశ్రీ మల్టీ టాలెంట్ , రెహమాన్ క్లాసిక్ టచ్.. ఇలా విభిన్న శైలుల కలయికతో రాబోయే రోజుల్లో థియేటర్లలో మ్యూజికల్ ఫీస్ట్ ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ హోరాహోరీ రేసులో ఏ సంగీత దర్శకుడు బాక్సాఫీస్ వద్ద చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్ అందించి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంటారో చూడాలి.