సంక్రాంతి బాక్సాఫీస్ రిపోర్ట్: సేఫ్ జోన్‌లోకి వెళ్తున్నదెవరు?
టాలీవుడ్ సంక్రాంతి ఫైట్ ఇప్పుడు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. పండగ సెలవులు ఆల్మోస్ట్ ముగుస్తున్న తరుణంలో బాక్సాఫీస్ లెక్కలు చాలా ఇంట్రెస్టింగ్ మలుపులు తీసుకుంటున్నాయి.
By: M Prashanth | 18 Jan 2026 10:12 AM ISTటాలీవుడ్ సంక్రాంతి ఫైట్ ఇప్పుడు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. పండగ సెలవులు ఆల్మోస్ట్ ముగుస్తున్న తరుణంలో బాక్సాఫీస్ లెక్కలు చాలా ఇంట్రెస్టింగ్ మలుపులు తీసుకుంటున్నాయి. థియేటర్ల వద్ద హడావుడి ఎలా ఉన్నా, బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వెళ్ళారా లేదా అన్నదే ఇప్పుడు అసలైన పాయింట్. ప్రతి సినిమా తనదైన రీతిలో రికవరీ సాధిస్తూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వైపు పరుగులు తీస్తోంది. సెలవుల ఎఫెక్ట్ తో కొన్ని సినిమాలు ఊహించని రీతిలో పుంజుకున్నాయి.
సాధారణంగా పెద్ద సినిమాలకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది కాబట్టి, రికవరీ మార్క్ కూడా అంతే పెద్దగా ఉంటుంది. చిన్న సినిమాలకు తక్కువ టార్గెట్ ఉండటంతో అవి త్వరగా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేటెస్ట్ ట్రేడ్ అంచనాల ప్రకారం, ఏ సినిమా ఎంత శాతం రికవరీ సాధించిందో చూస్తే, ఈ సంక్రాంతి విన్నర్ ఎవరనేది దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తోంది.
అందరి ఫోకస్ మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాపైనే ఉంది. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే తన బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో ఏకంగా 95 శాతంకి పైగా రికవరీ పూర్తి చేసుకుని టాప్‌లో నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఇలాగే కొనసాగితే, మరో రెండు రోజుల్లోనే ఈ సినిమా అన్ని ఏరియా లో కూడా క్లీన్ హిట్ స్టేటస్ అందుకుని ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవ్వడం ఖాయం. మెగాస్టార్ తన మాస్ పవర్ తో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తున్నారు.
ఇక యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన 'అనగనగా ఒక రాజు' ఈ పండగకు అసలైన సర్ ప్రైజ్ ప్యాకేజీగా మారింది. కేవలం 4 రోజుల్లోనే ఈ సినిమా 75 శాతం రికవరీ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తక్కువ బడ్జెట్ తో వచ్చి భారీ వసూళ్లు రాబడుతుండటంతో, బయ్యర్లు ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' ఎనిమిది రోజుల తర్వాత 65 శాతం రికవరీ మార్కు దగ్గర ఉంది. భారీ టార్గెట్ ఉండటంతో ఈ సినిమా సేఫ్ జోన్ లోకి రావడానికి ఇంకాస్త కష్టపడాల్సి ఉంటుంది.
శర్వానంద్ నటించిన 'నారీ నారీ నడుమ మురారి' కేవలం 3 రోజుల్లోనే 50 శాతం రికవరీ సాధించి పర్వాలేదనిపిస్తోంది. కామెడీ ఎమోషనల్ కంటెంట్ కావడంతో ఈ వీకెండ్ లో ఈ సినిమా పుంజుకునే అవకాశం ఉంది. ఇక మాస్ మహారాజా రవితేజ నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' 5 రోజుల తర్వాత 40 శాతం రికవరీ మార్కు వద్ద నిలిచింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రాబోయే రోజుల్లో వసూళ్ల వేగం పెరగాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ చూస్తుంటే, మెగాస్టార్ చిరంజీవి నవీన్ పోలిశెట్టి,శర్వానంద్ సినిమాలు సంక్రాంతి విన్నర్లుగా నిలవడం పక్కాగా కనిపిస్తోంది. రికవరీ శాతాన్ని బట్టి చూస్తే, 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమానే ఈ ఏడాది సంక్రాంతి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచేలా ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈ పోరు సెలవులు ముగిసే వరకు ఇలాగే కంటిన్యూ అయ్యేలా కనిపిస్తోంది.
