రిలీజైనపుడు ప్లాప్ అయిన సినిమాలు ఆ తర్వాత కల్ట్ క్లాసిక్స్ ఎలా అవుతున్నాయి...
కొన్ని సినిమాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఉంటాయి. అయితే ఆ సినిమాలను థియేటర్ లో చూసినప్పుడు వాళ్లకు పెద్దగా నచ్చకపోవచ్చు.
By: Gopi Velupala | 25 Sept 2026 9:00 AM ISTకొన్ని సినిమాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఉంటాయి. అయితే ఆ సినిమాలను థియేటర్ లో చూసినప్పుడు వాళ్లకు పెద్దగా నచ్చకపోవచ్చు. కానీ ఆ తర్వాత చూస్తున్న కొద్ది ఆ సినిమాలు అనుకోకుండా ప్రేక్షకుల హృదయాలను టచ్ చేస్తుంటాయి. తద్వారా ఆ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అంటారు. ఆ తర్వాత క్లాసికల్ హిట్స్ గా నిలిచాయని చెబుతుంటారు. ఆ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎందుకని ఫ్లాప్ అవుతున్నాయి. ఆ తర్వాత క్లాసికల్ గా ఎలా మారుతున్నాయనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. నిజానికి ప్రేక్షకుడు ఆ పర్టిక్యులర్ సిచువేషన్ లో సినిమాను చూసినప్పుడు అది అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. కానీ చూస్తున్న కొద్ది ప్రేక్షకుడి యొక్క ధోరణి మారిపోయి దర్శకుడు సినిమాను ఏ ఉద్దేశ్యంతో చేశాడు అనేది పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత అతనికి ఆ సినిమా పూర్తిగా నచ్చుతుంది. కానీ అప్పటికే ఆ సినిమాను థియేటర్లో నుంచి తీసేస్తారు. కాబట్టి సినిమా ఫ్లాప్ అవుతుంది. కానీ ప్రేక్షకుడి హృదయాల్లో మాత్రం కల్ట్ క్లాసికల్ సినిమాగా నిలిచిపోతుంది. ఇక ఇలాంటి సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'ఖలేజా' సినిమా థియేటర్లో ఫ్లాప్ అయింది. కానీ ఆ తర్వాత దాన్ని ఓన్ చేసుకొని చాలా ఎక్కువసార్లు చూస్తూనే ఉన్నారు. దానివల్ల ఆ సినిమా క్లాసికల్ సినిమాల లిస్టులో చేరిపోయింది...
చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన 'అంజి ' మూవీ రిలీజైనపుడు జనాలకి పెద్దగా నచ్చలేదు. కారణమేంటంటే ఆ గ్రాఫిక్స్ ను తెలుగు ప్రేక్షకులు ఆ రేంజ్ లో అప్పటి వరకు చూడలేదు. దాంతో అది వాళ్లకు పెద్దగా నచ్చలేదు. ఇక ఆత్మ లింగం కాన్సెప్ట్ ఏంటి అంటూ కొంతమంది ఈ సినిమాను డిస్కరేజ్ చేస్తూ మాట్లాడారు. కానీ ఇప్పుడు అంజి సినిమా గురించి మాట్లాడిన ప్రతిసారి అందులో ఉన్న గ్రాఫిక్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఆ కంటెంట్ కూడా చాలా జన్యున్ అని అప్పట్లోనే ఇలాంటి కంటెంట్ వచ్చిందంటే గ్రేట్ అంటూ చిరంజీవి ని ఆ మూవీ దర్శకుడు అయిన కోడి రామకృష్ణ ను పొగుడుతున్నారు...
ఇక రామ్ చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'ఆరెంజ్' సినిమా కూడా రిలీజ్ అయినప్పుడు ప్లాప్ టాక్ తెచ్చుకుంది. హీరో నిజమైన ప్రేమ తనకి దొరకడం లేదంటూ తిరుగుతుంటాడు. హీరో అలాంటి క్యారెక్టర్ తో ఉండటం ప్రేక్షకుడికి నచ్చలేదు. అలాగే 'మగధీర' సినిమా తర్వాత వచ్చిన సినిమా కాబట్టి రామ్ చరణ్ నుంచి కూడా చాలామంది ప్రేక్షకులు ఫైట్స్ మాస్ యాంగిల్ కోరుకున్నారు. కానీ అది సినిమాలో లేకపోవడం సినిమా మొత్తం క్లాస్ టచ్ తో ఉండటం కూడా కొంతమందికి నచ్చలేదు. కానీ ఆ తర్వాత టీవీ లో ఆ సినిమాను చూసినపుడు దర్శకుడు ఏదైతే పాయింట్ చెప్పాలనుకున్నాడో దాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. మొత్తానికైతే ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ లో భారీ కలెక్షన్స్ ని రాబట్టింది. అలాగే ఆ సినిమా కూడా క్లాసికల్ లిస్టులో చేరిపోయింది...
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన 'గౌతమ్ నంద' సినిమా కూడా థియేటర్లో అనుకున్న మేరకు సక్సెస్ ని సాధించలేదు. కానీ ఆ తర్వాత ఆ సినిమాని చూసిన ప్రతి ప్రేక్షకుడికి గోపీచంద్ నటనతో పాటు ఆ క్యారెక్టర్ లో ఉన్న డెప్త్ నచ్చింది. దాని వల్ల ఆ సినిమాని సైతం ప్రేక్షకుడు ఓన్ చేసుకొని క్లాసికల్ లిస్టులో చేర్చారు...
