Begin typing your search above and press return to search.

ఆ ఒక్క పని సరిగ్గా చేస్తే.. బడ్జెట్ చాలా మిగులుతుందేమో!

బడ్జెట్ లో ఇబ్బందులు వచ్చి.. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు మధ్యలో రద్దు అయిపోయిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   14 Aug 2025 9:00 PM IST
ఆ ఒక్క పని సరిగ్గా చేస్తే.. బడ్జెట్ చాలా మిగులుతుందేమో!
X

బడ్జెట్.. బడ్జెట్.. బడ్జెట్.. ఇది లేకపోతే ఒక్క సినిమా కూడా లేదు. ఏదైనా మూవీ పూజా కార్యక్రమాల నుంచి.. షూటింగ్ నుంచి.. ప్రమోషన్స్ నుంచి.. రిలీజ్ వరకు.. బడ్జెట్ దే కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైసా మే పరమాత్మ అన్నట్లు బడ్జెట్ ఉంటే ఏ పని అయినా జరుగుతుంది. సినిమా ముందుకు సాఫీగా వెళుతుంది.

బడ్జెట్ లో ఇబ్బందులు వచ్చి.. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు మధ్యలో రద్దు అయిపోయిన విషయం తెలిసిందే. ముందు అనుకున్న లెక్కలు దాటడంతోనో.. లేక ఇంకా డబ్బులు పెట్టలేమనో పలు సినిమాలు ఆగిపోయిన దాఖలాలు ఉన్నాయి. అదే సమయంలో అనేక సినిమాల బడ్జెట్ లు అనుకున్న దాని కన్నా క్రాస్ అవుతాయి.

ముందు ఫిక్స్ చేసుకున్న బడ్జెట్ లో ఇంకా మిగిలి ఉండగానే సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇప్పుడు ఇది ఎందుకు అనుకుంటున్నారా.. సినీ వర్గాల్లో ఇప్పుడు సినిమా బడ్జెట్ కోసం తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. ఎడిటింగ్ టేబుల్ పైకి వచ్చిన సమయంలో చాలా బడ్జెట్ వేస్ట్ అవుతుందంటున్నారు.

నిజానికి సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక.. మొత్తం కాపీని ఎడిటింగ్ టేబుల్ పైకి తీసుకు వస్తారు మేకర్స్. ఆ సమయంలో మొత్తం పరిశీలిస్తారు. షూట్ ఎలా వచ్చిందో చూస్తారు. ఆ సమయంలో సినిమాకు సెట్ అవ్వదనిపిస్తే అనేక సీన్స్ ను తొలగిస్తున్నారు ఎడిటర్స్. ఈ మధ్య కాలంలో మరిన్ని ఎక్కువ షాట్స్, సన్నివేశాలు రిమోవ్ చేస్తున్నారు.

దీంతో చాలా నిర్మాణ సంస్థలు.. మొదటి కట్ కంప్లీట్ అయ్యాక.. రీ షూట్ కు వెళ్తున్నాయి. కొన్ని మాత్రం సైలెంట్ గా ఉండగా.. మరికొన్ని మాత్రం రీషూట్ చేస్తున్నాయి. కట్ చేసిన సీన్స్ వల్ల అప్పటికే నష్టమవ్వగా.. ఇంకా మళ్లీ చిత్రీకరణ చేయడం వల్ల మరింత నష్టం చేకూరుతుంది నిర్మాత. అలా బడ్జెట్ తడిసి మోపెడు అవుతుంది.

అయితే దీనికి సొల్యూషన్ ఏంటి అనేది చూస్తే.. మెరుగైన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనే చెప్పాలి. సరిగ్గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను చేపడితే.. వృథా ఖర్చులు కచ్చితంగా నివారించవచ్చు. ఏ సీన్ పనికొస్తుంది.. ఏ సీన్ పనికిరాదనేది ముందే చూసుకుంటే.. ఎలాంటి ఇబ్బంది ఉండదు. బడ్జెట్ వేస్ట్ అవ్వదు. అలా ప్రీ-విజువలైజేషన్‌ పై పని చేస్తే.. చాలా చిత్రాల విషయంలో కోట్ల రూపాయలు మిగులుతాయి!