Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో ఇంకా పెళ్లికాని ప్రసాద్ లు ఎంతమంది..?

టాలీవుడ్ లో మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. యువ హీరో నారా రోహిత్ ఇంట పెళ్లి సందడితో మళ్లీ తెలుగు సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల గురించి చర్చిస్తున్నారు.

By:  Ramesh Boddu   |   27 Oct 2025 2:00 PM IST
టాలీవుడ్ లో ఇంకా పెళ్లికాని ప్రసాద్ లు ఎంతమంది..?
X

టాలీవుడ్ లో మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. యువ హీరో నారా రోహిత్ ఇంట పెళ్లి సందడితో మళ్లీ తెలుగు సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల గురించి చర్చిస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఇప్పటికీ బ్యాచిలర్ గా అదే పెళ్లి కాని ప్రసాద్ లుగా ఉన్న వారి గురించి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో డిస్కషన్ మొదలైంది. స్టార్ హీరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో మొదటి పేరుగా ఉంది మన రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి టైంలోనే సినిమా రిలీజ్ తర్వాత పెళ్లని చెప్పిన ప్రభాస్ మళ్లీ ఆ ఊసు లేదు.

పెళ్లి విషయంలో ఎందుకు లేట్ చేస్తున్న ప్రభాస్..

మధ్యలో ఎన్నో రకాల వార్తలు వచ్చినా కూడా ఏది నిజం కాలేదు. ప్రభాస్ పెళ్లెప్పుడు అన్నది ఒక సమాధానం లేని ప్రశ్నగా మారింది. ప్రభాస్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ప్రభాస్ పెళ్లి విషయంలో ఎందుకు లేట్ చేస్తున్నాడంటూ ఫ్యాన్స్ కూడా డౌట్ పడుతున్నారు. ప్రభాస్ పెళ్లంటూ మీడియా హడావిడి తప్ప అతను మాత్రం ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునేలా లేడనిపిస్తుంది.

ఇక ఇదే వరుసలో మరో స్టార్ రామ్ కూడా ఉన్నాడు. తన తోటి హీరోలంతా పెళ్లి చేసుకున్నా కూడా రామ్ మాత్రం ఇంకా స్టిల్ బ్యాచిలర్ గానే ఉన్నాడు. దానికి రీజన్స్ ఏంటన్నది మాత్రం తెలియదు. ప్రభాస్ విషయంలో అయినా పెళ్లంటూ హడావిడి ఉంటుంది కానీ రామ్ విషయంలో అది కూడా లేదు. సినిమా వెంట సినిమా చేస్తూ వెళ్తున్నాడు కానీ రామ్ పెళ్లి విషయంపై నోరు విప్పట్లేదు.

ఒకప్పటి హీరో తరుణ్ కూడా..

ఐతే ఈ లిస్ట్ లో ఒకప్పటి హీరో తరుణ్ కూడా ఉన్నాడు. అఫ్కోర్స్ ఇప్పుడు ఫేడవుట్ అయ్యాడు కానీ.. ఇప్పటికీ తరుణ్ బ్యాచిలర్ గానే ఉన్నాడు. తరుణ్ కి పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదా.. ఇంకా టైం తీసుకోవాలని అనుకుంటున్నాడా అన్నది మాత్రం తెలియట్లేదు.

తెలుగు హీరోల్లో ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్. అతని పెళ్లి చేయాలని తేజ్ మదర్ చాలా ఆసక్తిగా ఉన్నారు. కానీ తేజ్ మాత్రం అందుకు ఇంకాస్త టైం కావాలని చెబుతున్నాడట. సినిమాలతో బిజీ అవ్వాలని అప్పుడే పెళ్లి ప్రస్తావన ఉండదని తేజ్ ఒక చిట్ చాట్ లో చెప్పాడు.

తేజ్ చేసుకుంటేనే తనకు లైన్ క్లియర్ అవుతుందని తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా వెయిట్ చేస్తున్నాడు. అఫ్కోర్స్ అతను ఇంకాస్త టైం తీసుకున్నా పర్వాలేదని చెప్పొచ్చు.

జాతిరత్నం నవీన్ పొలిశెట్టి..

ఇక యువ హీరోల్లో స్టిల్ బ్యాచిలర్ గా ఉన్నారు కొందరు కథానాయకులు. వారిలో జాతిరత్నం నవీన్ పొలిశెట్టి వస్తాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా నుంచి సినిమాల మీద ఆసక్తితో ప్రయత్నాలు చేస్తూ ఫైనల్ గా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో హీరోగా తనకంటూ ఒక మార్క్ ఏర్పరచుకున్నాడు నవీన్. నెక్స్ట్ అతని సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఐతే నవీన్ కూడా పెళ్లి విషయంలో తొందరేం లేదు ముందు కెరీర్ ముఖ్యమని భావిస్తున్నాడు.

ఇదే లిస్ట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా కెరీర్ సెట్ రైట్ అయ్యాకే పెళ్లి అన్నట్టుగా ఉన్నాడు. విశ్వక్ సేన్ పెళ్లి విషయంలో అసలు తొందరేం లేదన్నట్టు ఉన్నాడు. ఇక యువ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ కూడా బ్యాచిలర్ గానే ఉన్నాడు. సినిమాల పరంగా తన ప్రయత్నాల్లో ఎలాంటి లోపం ఉండదు కానీ ఒక సినిమా సక్సెస్ అయితే సందీప్ సినిమాలు వరుస ఫెయిల్యూర్స్ అతన్ని వెనక్కి నెట్టేస్తాయి. ఐతే ముందు కెరీర్ ఆ తర్వాతే పెళ్లి అన్నట్టుగా సందీప్ ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.

విజయ్ దేవరకొండ ఎంగేజ్డ్..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ప్రస్తుతానికి బ్యాచిలర్ గానే ఉన్నాడు. ఐతే అతను ఆల్రెడీ రష్మికతో ఎంగేజ్డ్ అన్న విషయం తెలిసిందే. ఐతే వాళ్లిద్దరు మాత్రం ఇంకా ఆ విషయాన్ని రివీల్ చేయలేదు.

ఇలా టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా.. ఇంకా పెళ్లి కానీ ప్రసాద్ గా పిలవబడుతున్నారు ఈ హీరోలు. కెరీర్ కు పెళ్లి అనేది ఒక అడ్డని ఫీలయ్యే వాళ్లు కొందరు.. కానీ దేనికదే పర్ఫెక్ట్ టైం కు సెట్ రైట్ చేసుకోవాలనే వాళ్లు కొందరు. మరి ఈ హీరోల పెళ్లి ఎప్పుడు జరుగుతుందో వారి ఫ్యాన్స్ ని ఎప్పుడు సంతోషపరుస్తారన్నది చూడాలి.