Begin typing your search above and press return to search.

హీరోల ఫ్యూచర్.. కాంప్రమైజ్ అవ్వకుంటే అంతే సంగతి!

టాలీవుడ్ లో ఇప్పుడు టైర్ 1, టైర్ 2 హీరోలు అని సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది.

By:  M Prashanth   |   9 Aug 2025 4:08 PM IST
హీరోల ఫ్యూచర్.. కాంప్రమైజ్ అవ్వకుంటే అంతే సంగతి!
X

టాలీవుడ్ లో ఇప్పుడు టైర్ 1, టైర్ 2 హీరోలు అని సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. బిజినెస్ ఎక్కువ చేసి, భారీ స్థాయిలో మార్కెట్ ఉన్న హీరోలను టైర్ 1 అని, కాస్త తక్కువ మార్కెట్ చేసే నటులను టైర్ 2 అని పిలుస్తున్నాం.ఇప్పుడంటే టైర్ 2 అంటున్నారు. కానీ ఇదివరకు మిడ్ రేంజ్ అనే పదం వాడేవారు.

అయితే ఇప్పుడు తెలుగులో అనేక మంది హీరోలు అయిపోయారు. కొత్త కొత్తగా ఇండస్ట్ట్రీకి వచ్చినవాళ్లు,యంగ్ నటులను మిడ్ రేంజ్ హీరోలు అనేవారు. అయితే ఇప్పుడు ఆ పదం అనడానికి లేదు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు చిన్న హీరోలుగా మారిపోయారు. వాళ్ల సినిమాలు చేసే మార్కెట్ లే దీనికి ఉదాహరణ.

ఆంధ్ర ప్రదేశ్ లో ఏరియాకు గట్టిగా కొడితే రూ.3 కోట్ల మార్కెట్ ఉండడం లేదు. రెండు రాష్ట్రాలు కలిపి రూ. 6- 7 కోట్ల బిజినెస్ చేయడం లేదు. ఇక ఓటీటీ సంగంతైతే వేరు. సినిమా ఓటీటీలో అమ్ముడు పోవడం కొందరికి కష్టంగా ఉంది. అందుకే వాళ్లను ఇంకా మిడ్ రేంజ్ హీరోలు అని ఎలా అంటాం?

చాలా మంది మిడ్ రేంజ్ హీరోలు చిన్న హీరోలు అయిపోతున్నారు. అది చెబితే వాళ్లు ఒప్పుకోరు. ఒక హీరో తన రెమ్యూనరేషన్‌ ను రూ.10 దాకా పెంచేశాడు. ఏమైనా అంటే హిందీ డబ్బింగ్ మార్కెట్ చూడండి. యూట్యూబ్ లో మా పాత సినిమా వ్యూస్ చూడండి అంటుంటారు హీరోలు. కానీ యూట్యూబ్ వ్యూస్ వేరు, థియేటర్లలోకి వచ్చేసరికి అంతటి రెస్పాన్స్ ఉండడం లేదు.

హిందీ డబ్బింగ్ బాగా తగ్గిపోయింది. ఓటీటీలో సినిమా అమ్మడం లేదు. దీంతో ఎవరో ఒకరిద్దరు నిర్మాతలు ఏదో విధంగా ఈ మిడ్ కమ్ చిన్న రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. కానీ భవిష్యత్ లో ఇవి కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఓ చిన్న హీరోతో సినిమాను ఓ పేమస్ ప్రొడ్యూసర్ క్యాన్సిల్ చేశారని టాక్ వినిపిస్తుంది.

ఓ హీరోకైతే రెండు సినిమాలు రీలీజ్కు రెడీగా వున్నాయి. అయితే వాటికంటే విడుదల చేసిన సినిమా ఒకటి డిజాస్టర్ అయ్యిందియ. ఈ పరిస్థితుల్లో ఇంకో సినిమా ప్రారంభం కావాల్సి వుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, వాళ్ల మార్కెట్ చూసి ప్రాజెక్ట్ ను రద్దు చేసుకుంటున్నారు. ఇంకో మిడ్ రేంజ్ హీరో సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అది పూర్తి కావాలంటే రెవెన్యూ కావాలి.

కానీ దానికి ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వదు. ఓటీటీ, హిందీ డబ్బింగ్ అమ్మేసే రోజులు కూడా పోయాయి. దాంతో డబ్బులకు కొరత ఏర్పడింది. అయినా ఈ మిడ్ రేంజ్ హీరోలు నిజం తెలుసుకోవడం లేదు. రెమ్యూనరేషన్లలో కాంప్రమైజ్ అవ్వడం లేదు. రివర్స్ లో స్టోరీను నిర్మాతలకు పంపించి చేస్తారా? చేస్తారా? అని అడుగుతున్నారు. ఇంకొన్నాళ్లైతే.. ఈ మిడ్ రేంజ్, చిన్న హీరోలను ప్రేక్షకులు మరిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.